Kajal Aggarwal Husband ప్రస్తుతం టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గొప్ప పేరు క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఇక మొదటి సినిమా నుండి నటిగా తన పాత్రల్లో ఒదిగిపోయి ఎంతో సహజ నటన కనబరిచే కాజల్, తొలిసారిగా సంచలన దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ మూవీలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన లక్ష్మి కళ్యాణం మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు కాజల్ అగర్వాల్ కు బాగానే పేరు తీసుకువచ్చింది.
kajal aggarwal born
ఇక ఈ మూవీ తరువాత టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ సొంతం చేసుకున్న కాజల్, ఆ మూవీతో పెద్ద విజయం అందుకున్నారు. ఇక ఆ మూవీలో ఆమె యువ నటుడు నవదీప్ కు జోడీగా నటించగా ఆమె తండ్రి పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించారు. ఇక ఈ మూవీ లవ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇక ఈ మూవీలో ముఖ్యంగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించిన కాజల్ ఆడియన్స్ మనసు దోచారు. అయితే అదే సమయంలో అప్పట్లో యువ కథానాయడుకుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ ప్రతిష్టాత్మక మూవీ మగధీర తీస్తున్న జక్కన్న రాజమౌళి ఆమెను అందులో హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు కాజల్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపించారు.
అందులో భైరవగా చరణ్ తో పాటు మిత్రవింద గా కాజల్ అగర్వాల్ పాత్రకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా మిత్రవింద పాత్రలో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ ఎంతో మంది ఫ్యాన్స్ లో మరింత మంచి క్రేజ్ సంపాదించిపెట్టింది. అయితే రిలీజ్ అనంతరం అందరూ ఊహించని విధంగా మగధీర మూవీ రిలీజ్ అనంతరం అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుంది. ఆ విధంగా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన మగధీర తో హీరోయిన్ గా ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ కు అక్కడి నుండి టాలీవుడ్ లో అనేక అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా అదే సమయంలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య 2 మూవీ చేసారు. ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.
kajal aggarwal saree
అంతకముందు వచ్చిన ఆర్య మూవీ మంచి విజయం అందుకోవడంతో ఆర్య 2 పై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అనంతరం మాత్రం ఆర్య 2 ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో డార్లింగ్ మూవీ చేసారు కాజల్. ఈ మూవీని ఏ కరుణాకరన్ తెరకెక్కించగా జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఇక డార్లింగ్ మూవీ రిలీజ్ అనంతరం విజయం అందుకుంది. ఈ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ తో నటిగా మరింత పేరు సొంతం చేసుకున్నారు కాజల్ అగర్వాల్. దాని తరువాత టాలీవుడ్ మరొక స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనం మూవీలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్నారు కాజల్.
ఈ మూవీలో మరొక హీరోయిన్ గా సమంత రూత్ ప్రభు నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక బృందావనం మూవీలో క్రిష్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించగా భూమి పాత్రలో మరొక్కసారి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు కాజల్ అగర్వాల్. ఈ మూవీ అనంతరం ఆమెకు మరింతగా అవకాశాలు దక్కాయి. ఇక అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్టార్ హీరోల సరసన వరుసగా పలు అవకాశాలు సొంతము చేసుకున్నారు కాజల్.
kajal aggarwal wikipedia
ఇక తమిళ్ లో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకీ. ఆ మూవీ కూడా రిలీజ్ అనంతరం సూపర్ డూపర్ హిట్ కొట్టి అక్కడ కూడా కాజల్ కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి నటిగా తన సినీ ప్రస్థానాన్ని మరింత వేగంగా ముందుకు నడిపిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత తెలుగు, తమిళ్ తో పాటు అటు హిందీలో సైతం పలు సినిమా అవకాశాలు అందుకున్నారు. అప్పట్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ తో కాజల్ చేసిన స్పెషల్ 26 మూవీ మంచి విజయం అందుకుని అక్కడ కూడా ఆమెకు బాగా పేరు తీస్కువచ్చింది. దాని అనంతరం 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్నారు కాజల్. ఇక ఇటీవల వారిద్దరికీ నీల్ అనే కుమారుడు జన్మించాడు.
kajal aggarwal father
ప్రస్తుతం అటు ఫ్యామిలీ ఇటు సినిమాలతో ఎంతో ఆనందంగా కొనసాగుతున్నారు కాజల్. ఇక ఆమె భర్త గౌతమ్ ఒక పెద్ద వ్యాపారవేత్త. మొదటి నుండి తనకు భర్త గౌతమ్ ఎంతో సపోర్ట్ గా ఉంటారని, అలానే తనకు అన్ని విషయాల్లో ఆయన అందించే సపోర్ట్ ప్రధాన బలం అని తరచు చెప్తుంటారు కాజల్. గౌతమ్ ఎప్పుడూ తనని సినిమాల విషయంలో ఆక్షేపణ పెట్టలేదని, అందువలనే తాను రెండూ కూడా ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ కొనసాగుతున్నాని తన భర్త గొప్పతనం మంచి మనసు గురించి చెప్తారు కాజల్. ఎక్కువుగా గౌతమ్ ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతారని, ఆ విధంగా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం అని అంటారు కాజల్. మొత్తంగా అన్ని విధాలా తనను అర్ధం చేసుకునే గౌతమ్ తనకు భర్తగా దొరకడం అదృష్టం అని కూడా ఆమె చెప్తారు.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి