Shruti Haasan Age Family Personal Secrets l శృతి హాసన్ వయస్సు కుటుంబ వ్యక్తిగత రహస్యాలు 2024

Written by Movie Updates

Updated on:

Shruti Haasan Age తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళ్, హిందీ వంటి పరిశ్రమల్లో నటిగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న నటీమణుల్లో శృతి హాసన్ కూడా ఒకరు. తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అనగనగా ఓ ధీరుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో సిద్దార్థ హీరోగా నటించారు. అయితే అప్పట్లో ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ మూవీ చేసారు శృతి. అయితే ఆ మూవీ పెద్ద విజయం అందుకోవడంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్నారు.

ఇక అక్కడి నుండి వరుసగా తెలుగులో అనేక అవకాశాలు అందుకున్న శృతి హాసన్, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు మూవీ, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా, రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో రేసు గుర్రం వంటి సినిమాలు చేసారు. ఇక మొదటి నుండి కూడా మల్టి టాలెంటెడ్ అయిన శృతి అటు హీరోయిన్ గా కొనసాగుతుండడంతో పాటు సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తూ దూసుకెళ్తున్నారు. 28 జనవరి 1986లో చెన్నైలో జన్మించిన శృతి, మొదటినుండి కూడా తండ్రి కమల్ అలానే తల్లి సారిక తనకు ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. మహిళలు ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని ఆమె చెప్తుంటారు. శృతి హాసన్ సోదరి అక్షర హాసన్ అక్కడక్కడా పలు సినిమాల్లో నటించారు.

shruti haasan husband

పర్సనల్ గా ఎక్కువగా కెరీర్ తో పాటు ఫ్యామిలీ లైఫ్ కి క్కూడా ప్రాధాన్యత ఇచ్చే శృతి, వారితో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తండ్రి కమల్ హాసన్ నుండి ఎంతో నేర్చుకున్నానని ముఖ్యంగా నటుడిగా ఆయన ఎంతో సాధించారని, అటువంటి వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టం అని చెప్తూ ఉంటారు శృతి. ఇక సమాజంలో స్త్రీలు వ్యక్తిగతంగా ఎంతో కష్టపడి పైకి వస్తున్నారని, ఆ విధంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగితే స్త్రీలు ఏదైనా సాధించగలరని ఆమె చెప్తుంటారు.

ఇక ఏదైనా సినిమాలో తనకు అవకాశం లభిస్తే, దానికి సంబంధించి కథని విన్న తరువాత తన పాత్ర ఎలా ఉంటుందనేది తెలుసుకుంటానని, ఆ పాత్రకు తగ్గట్లుగా ఏ విధంగా సిద్దమవ్వాలనేది ముందే ఆలోచన చేస్తానని అంటారు శృతి హాసన్. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సరసన నటిగా తన అవకాశాలు రావడంతో పాటు వారి సరసా నటించి మంచి విజయాలు అందుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు. అలానే తమిళ చిత్ర పరిశ్రమలో కూడా పలువురు స్టార్స్ తో నటించడం ఎప్పటికీ మరువలేని అనుభూతి అని ఆమె అంటారు.

shruti haasan in srimanthudu

ప్రస్తుతం అడివి శేష్ తో డెకాయిట్ మూవీతో పాటు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ 2 శౌర్యాంగపర్వం మూవీలో కూడా నటించనున్నారు. నటిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేసి తన అభిమానులు, ప్రేక్షకులకు చేరువవ్వాలనేదే తన ఆలోచనని శృతి అన్నారు. ఇటీవల తన ప్రియుడు సంతను హజారికాతో కలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుండి డిలేట్ చేసారు శృతి హాసన్. కాగా వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చి విడిపోయారని,ఆ అందుకే శృతి అతడి ఫోటోలు డిలీట్ చేయడంతో పాటు అన్ ఫాలో కూడా అయ్యారని ఇండస్ట్రీ టాక్.

ఇక ఎక్కువగా తన ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ కి వెల్లడించడం ఇష్టం లేదని, ముఖ్యంగా మేము స్టార్స్ అయినప్పటికీ మాకు కూడా వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి కదా, వాటిని గోప్యంగా ఉంచాలి అనుకుంటానని ఆమె చెప్తుంటారు. తన సోదరి అక్షర కూడా నటన విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటోందని, మంచి టాలెంట్ ఉన్న తనకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు తప్పకుండా వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు శృతి. తన కెరీర్ లో చేసిన పలు సినిమాల్లో అనేక పాత్రలు నటిగా తనకు మంచి పేరుని తీసుకువచ్చాయని, ఇక తనను ఇంతలా అభిమానిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు శృతి.

shruti haasan old pictures

ఇటీవల కరోనా టైంలో తాను కూడా ఇంట్లోనే అమ్మ వద్ద ఎన్నో పనులు విషయాలు తెలుసుకున్నానని, ఆ టైం నిజంగా అందరికీ ఎన్నో కొత్త విషయాలు నేర్పిందని శృతి హాసన్ అభిప్రాయపడ్డారు. అలానే తాజాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేసిన ఇనిమెల్ సాంగ్ గురించి శృతి మాట్లాడుతూ, మొదట లోకేష్ ఈ సాంగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాతో నటించడానికి ఒప్పుకోలేదని, తనకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అన్నారని తెలిపారు. అలానే కమల్ గారి కూతురుతో నటించడం ఒకింత బిడియంగా అనిపించడమే అతడు అలా అనడానికి కారణం అన్నారు.

shruti haasan salaar

అయితే నేను కూడా అందరిలానే నటిని అని భావించి నటిచాలని మెల్లగా అందరం కలిసి లోకేష్ ని ఒప్పించడంతో చివరకు అతడు ఒప్పుకునంట్లు తెలిపారు. ఇక ఇనిమెల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఆ సాంగ్ ని రూపొందించిన ప్రతి ఒక్కరికీ, ఆదరిస్తున్న శ్రోతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు శృతి. అడివి శేష్ తో ఫస్ట్ టైం డెకాయిట్ మూవీ చేస్తుండడం ఆనందంగా ఉందని, అటువంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో వర్క్ చేస్తున్న ఈ మూవీ తప్పకుండ మంచి విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శృతి హాసన్.ఆ విధంగా అటు నటిగా ఇటు సంగీత దర్శకురాలిగా, అలానే సింగర్ గా ఎంతో గొప్ప టాలెంట్ తో ముందుకు సాగుతున్న శృతి హాసన్ రాబోయే రోజుల్లో నటిగా మరింత మంచి పేరు అందుకోవాలని కోరుకుందాం.

shruti haasan age

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment