Allu Arjun New Movie Shocking Update 2024 l అల్లు అర్జున్ కొత్త సినిమా షాకింగ్ అప్‌డేట్

Written by Movie Updates

Updated on:

Allu Arjun New Movie టాలీవుడ్ స్టార్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లను అలానే భారీగా క్రేజ్ ని కూడా అందుకుంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా 2020లో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించిన భారీ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అలవైకుంఠపురములో ఎంతో పెద్ద సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా ఆయనకు మంచి బ్రేక్ ని అందించిందని చెప్పాలి. ఆ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించిన తీరుతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలానే అలవైకుంఠపురములో మూవీ సాంగ్స్ అయితే ఏకంగా నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. యువ సంగీత సెన్సేషన్ అయిన థమన్ ఆ మూవీకి సూపర్ సాంగ్స్ ని అందించి ఏకంగా ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.

allu arjun hd photos

ఆ తరువాత అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప ది రైజ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తాజాగా ఆయన పుష్ప 2 ది రూల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అనసూయ, సునీల్ నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

allu arjun height

ఇక ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ మూవీతో హీరోగా మరింత పెద్ద క్రేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఆ మూవీలో టైటిల్ పాత్ర అయిన పుష్పరాజ్ పాత్రలో ఆయన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విపరీతంగా ప్రసంశలు కురిసాయి. ఇక పుష్ప మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా రూపొంది రిలీజ్ అనంతరం భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆకట్టుకునే అందం అభినయం, దర్శకుడు సుకుమార్ సూపర్ టేకింగ్, నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారి గ్రాండియర్ నిర్మాణ విలువలు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వండర్ఫుల్ సాంగ్స్, సూపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అలరించే విజువల్స్ వెరసి పుష్ప ది రైజ్ మూవీని అంత పెద్ద సక్సెస్ చేశాయని చెప్పాలి.

allu arjun movies list

ఇక ఆ మూవీలో అద్భుత నటన ప్రదర్శించినందుకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా భారత ప్రభుత్వ అత్యున్నత అవార్డు అయిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా మరింత గ్రాండియర్ గా రూపొందుతోన్న పుష్ప ది రూల్ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని మొదటి భాగాన్ని మించేలా అత్యద్భుత విజయం చేసేందుకు యూనిట్ అంతా కూడా రేయింబవళ్లు నిరంతర శ్రమ పడుతోంది. ఇక పుష్ప ది రూల్ మూవీలో అల్లు అర్జున్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండడంతో పాటు కొన్ని సీన్స్ లో ఆయన వడర్ఫుల్ యాక్టింగ్ నభూతో నభవిష్యతి అనేలా ఉంటుందని అంటున్నాయి సినీ వర్గాలు.

allu arjun brother

ఇక పుష్ప 2 మూవీకి సంబందింసీబీ టెక్నీకల్ గా గానే కాకుండా నిర్మాణం పరంగా కూడా ఎక్కడా నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప 2 మూవీ యాక్షన్ కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్, అలానే నిన్న రిలీజ్ అయిన పుష్ప పుష్ప సాంగ్ సూపర్ గా రెస్సాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక దీని తరువాత ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో ఒక మూవీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరొక మూవీ కమిట్ అయ్యారు అల్లు అర్జున్.

అయితే మ్యాటర్ ఏమిటంటే, గతంలో అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఐకాన్ మూవీ ఉంటుందని కొన్నాళ్ల క్రితం నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఆ మూవీలో అల్లు అర్జున్ యూత్ ఐకాన్ గా మరొక రేంజ్ లో ఆడియన్స్ ని అదరగొట్టనున్నారని, అలానే రిలీజ్ అనంతరం ఐకాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను అలానే అల్లు అర్జున్ కమిట్మెంట్స్ ని బట్టి ఆ మూవీ ఆల్మోస్ట్ లేనట్లే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ఈ మూవీకి సంబంధించి అప్పట్లో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా దానికి బాగా స్పందన లభించింది.

allu arjun father

అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఆయన ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అయితే పక్కాగా అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ ల ఐకాన్ ఉంటుందో లేదో తెలియాలి అంటే మేకర్స్ నుండి రాబోయే రోజుల్లో అఫీషియల్ గా ఏదైనా అప్ డేట్ వస్తేనేగానే తెలియదని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే అల్లు అర్జున్ దిల్ రాజు వేణు శ్రీరామ్ ల ఐకాన్ మూవీ పక్కాగా ఉంటుందని అంటున్న వారు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజక్ట్స్ తరువాత అది ఉంటుందని, అలానే త్వరలోనే అంత సెట్ అయిన అనంతరం దిల్ రాజు కూడా తన కమిట్మెంట్స్ తరువాత ఐకాన్ మూవీ పై ప్రకటన అందిస్తారని అంటున్నారు. కాగా దీని పై ఆ మూవీ మేకర్స్ నుండి పక్కాగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

allu arjun new movie

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment