Pawan Kalyan HD Images Trending 2024 l పవన్ కళ్యాణ్ హెచ్ డి ఇమేజస్ లేటెస్ట్

Written by Movie Updates

Updated on:

Pawan Kalyan HD Images టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అటు రాజకీయాలు ఇటు సినిమాలతో కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. అంతకముందు రాజకీయాల కోసం సినీ కెరీర్ కి కొంత బ్రేక్ ఇచ్చి మూడేళ్ళ పాటు కొనసాగిన పవన్, ఆ తరువాత వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి మంచి విజయం అందుకున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది.

pawan kalyan wife

అనంతరం సాగర్ కె చంద్రతో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో రానా దగ్గుబాటి, సంయుక్తా మీనన్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అనంతరం బాగానే సక్సెస్ సాధించింది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ తన నటనతో మరొక్కసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి కాగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు, అలానే వేరొకటి యువ దర్శకడు సుజీత్ తీస్తున్న ఓజి. ఈ మూవీ మూడు సినిమాల పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే వీటిలో ఓజి మూవీ భారీ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా రూపొందుతోంది. దీనిని ఎంతో భారీ వ్యయంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు రూపొందిస్తుండగా అందాల నటీమణి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఓజి మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా దీనిని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఓజి లో ఓజాస్ గంభీరగా పవన్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా చాలావరకు షూట్ పూర్తి చేసుకుంది.

pawan kalyan son

ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రలు చేస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో గజ దొంగ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించనుండగా ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు నుండి రిలీజ్ అయిన మొత్తం మూడు గ్లింప్స్ టీజర్స్ అందరిని ఎంతో ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఎరపరిచాయి. అలానే ఈ రెండు సినిమాలతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

pawan kalyan og release date

ఇటీవల తమిళ్ లో ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన తేరికి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది. పొలిటికల్ యాక్షన్ మాస్ డ్రామా మూవీగా రూపొందుతోన్న ఈ మూవీలో యువ అందాల నటీమణులు శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకోగా దీనిని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది.

ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఒక గ్లింప్స్ టీజర్ రిలీజ్ చేయగా దానికి బాగా రెస్పాన్స్ లభించింది. మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం తన జనసేన పార్టీ తరపున ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈసారి టీడీపీ, బిజెపితో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్. అయితే ప్రస్తుతం ఏపీ ఎన్నికల నిమిత్తం కొన్నాళ్ల పాటు మూడు సినిమాలను ప్రక్కన పెట్టార పవన్ కళ్యాణ్.

pawan kalyan og movie release date

అయితే వీటిలో ముందుగా ఓజి మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుండగా హరి హర వీర మల్లు మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక తాజగా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో విరివిగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన చేస్తున్న ప్రచారం సందర్భంగా పలువురు ప్రజలు కార్యకర్తలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి పవన్ ని ఎలాగైనా గెలిపించాలని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.

అలానే పలువురు జబర్దస్త్ నటులు, సీరియల్ నటిలు సైతం పవన్ గెలుపు కోసం పాటు పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యువ నిర్మాత హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ అన్నయ్య కుమారుడైన సూర్యదేవర రాధాకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ తరపున తాము పోటీ చేస్తున్న 21 సీట్లని కూడా దక్కించుకునేలా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్. మరి ఈసారి ఆయనని విజయం ఎంతమేర వరిస్తుందో, రాజకీయ నాయకుడిగా ఏ స్థాయి పేరు అందుకుంటారో చూడాలి.

pawan kalyan hd images

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment