Megastar Shocking Response on Ramcharan Doctorate l రామ్ చరణ్ కు డాక్టరేట్ పై మెగాస్టార్ షాకింగ్ రెస్పాన్స్ 2024

Written by Movie Updates

Published on:

Megastar Shocking Response on Ramcharan Doctorate టాలీవుడ్ నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

Megastar Shocking Response on Ramcharan Doctorate

ఇక తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు తమిళనాడు లోని వేల్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేసారు. ముఖ్యంగా నటుడిగా మంచి క్రేజ్ సాధించిన రామ్ చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈ డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం దీనిపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ ద్వారా స్పందించారు.

Megastar Shocking Response on Ramcharan Doctorate

తమ బిడ్డలు తమకంటే గొప్పవారుగా ఎదుగుతూ పైకి వెళుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా అంటుందని, ఆ విధంగా ప్రస్తుతం రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, తనని అభినందిస్తూ వేల్స్ యూనివర్సిటీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా మెగాస్టార్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Megastar Shocking Response on Ramcharan Doctorate

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment