Mamitha Baiju in Vijay Devarakonda Movie l విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మమిత బైజు 2024

Written by Movie Updates

Published on:

Mamitha Baiju in Vijay Devarakonda Movie మలయాళ మూవీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం యువ నటిగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు మమిత బైజు. ఇటీవల ఆమె నటించిన ప్రేమలు మూవీ పెద్ద సక్సెస్ సాధించింది. గిరీష్ ఏ డి తెరకెక్కించిన ఈ మూవీ అక్కడ భారీ విజయం అందుకోవడంతో పాటు ఇటు తెలుగులో కూడా రిలీజ్ అయి మన ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ కొనసాగుతోంది.

Mamitha Baiju in Vijay Devarakonda Movie

ఇక మరోవైపు జివి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన రెబల్ మూవీలో కూడా హీరోయిన్ గా నటించారు మమిత. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గౌతమి తిన్ననూరి దర్శకత్వంలో యువ నటుడు విజయ్ దేవరకొండ ఒక మూవీ చేస్తున్నారు. దీనిని సితార ఎంతేటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్ గా మొదటి శ్రీలీల ని అనుకున్నారు.

Mamitha Baiju in Vijay Devarakonda Movie

అయితే డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె తప్పుకోవడంతో తాజాగా ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ని ఆ పాత్రకు తీసుకునే అవకాశం ఉందనేది టాలీవుడ్ బజ్. మరోవైపు ఆమెతో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉందట. మరి పక్కాగా విజయ్, గౌతమ్ ల మూవీలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈమూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.

Mamitha Baiju in Vijay Devarakonda Movie

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment