Megastar Vishwambhara Release Date Fixed l మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ 2025

Written by Movie Updates

Published on:

Megastar Vishwambhara Release Date Fixed మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మూవీ ఆడియన్స్ ముందుకి మంచి అంచనాలతో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దాని అనంతరం ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తోన్న మూవీ విశ్వంభర. ఇటీవల కళ్యాణ్ రామ్ తో బింబిసార మూవీ తీసి సక్సెస్ సొంతం చేసుకున్న వశిష్ఠ, మెగాస్టార్ విశ్వంభర మూవీని సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Megastar Vishwambhara Release Date Fixed

ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తమ మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

Megastar Vishwambhara Release Date Fixed

ఇటీవల రిలీజ్ అయిన విశ్వంభర కాన్సెప్ట్ వీడియో అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Megastar Vishwambhara Release Date Fixed

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment