Mahesh babu New Movie Shocking Update 2024 l మహేష్ బాబు కొత్త సినిమా షాకింగ్ అప్‌డేట్

Written by Movie Updates

Updated on:

Mahesh babu New Movie టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. మొదటి రోజు నెగటివ్ టాక్ కావాలని కొందరు ప్రచారం చేసినప్పటికీ కూడా మహేష్ బాబు క్రేజ్ ముందు అవేవి కూడా నిలబడలేదు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్  నటించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన గుంటూరు కారం మూవీలో రమణ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ పెర్ఫార్మన్స్ కు అందరి నుండి విశేషమైన క్రేజ్ లభించింది.

mahesh babu movie okkadu

రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాంగ్స్ కూడా విశేషాధరణ సొంతం చేసుకున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫ్యామిలి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, జగపతిబాబు, రఘుబాబు, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించగా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించారు. మొత్తంగా గుంటూరు కారం సూపర్ హిట్ తో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ పరంగా ఐదవ హిట్ సొంతం చేసుకున్నారు. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సూపర్ డూపర్ హిట్ కొత్తగా ఖలేజా ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన నెక్స్ట్ SSMB 29 మూవీ చేయనున్నారు సూపర్ స్టార్ మహేష్.

mahesh babu new movie 2024

ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనుండగా వి విజయేంద్రప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిష్టాతక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కాగా దీనికి పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయనున్నట్లు టాక్. విషయం ఏమిటంటే, ఈ మూవీని ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అనౌన్స్ చేయనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా క్రాఫ్, గడ్డం పెంచడంతో పాటు మేకోవర్ పరంగా ఎంతో స్టైలిష్ లుక్ లో రెడీ అవుతున్నారు.

ఈ మూవీకి మహారాజ్, చక్రవర్తి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. అత్యంత భారీ వ్యయంతో ఇండియన్ మూవీ హిస్టరీలో నిలబడిపోయేలా రాజమౌళి SSMB 29 మూవీని గ్రాండ్ లెవెల్లో రూపొందించనున్నారట. మరి ఈ మూవీ పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. మరోవైపు ఈ మూవీలో ఒక ప్రముఖ ఇండోనేషియన్ నటి హీరోయిన్ గా నటించనుందని అలానే ప్రముఖ హాలీవుడ్ సంస్థతో పాటు ప్రముఖ ఓటిటి మాధ్యమం అయిన నెట్ ఫ్లిక్స్ కూడా భాగస్వామ్యం కానుందనే న్యూస్ కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంద్. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకుముందెన్నడూ కనిపించని పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఇతర పాత్రధారుల యొక్క పత్రాలు కూడా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారట.

ఇక ఈ SSMB 29 మూవీ వాస్తవానికి దాదాపుగా పుష్కర కాలం క్రితం అనుకున్న ప్రాజక్ట్ కావడం, అక్కడి నుండి అటు హీరో మహేష్ బాబు, ఇటు దర్శకుడు రాజమౌళి వరుసగా తమ తమ ప్రాజక్ట్స్ తో బిజీ బిజీగా కొనసాగుతుండడం వల్లనే ఇది వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు ఫైనల్ గా ఈ మూవీ త్వరలో పట్టాలెక్కుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఎందరో ఆడియన్స్ దీని కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కోసం మహేష్ తో ఎటువంటి జానర్ చేయాలి అనే ఆలోచన గతంలో చేసిన రాజమౌళి, ఫైనల్ గా సౌత్ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగె అడ్వెంచర్ ని అనుకోవడం ఒక విభిన్నమైన ఆలోచన అని చెప్పాలి.

హాలీవుడ్ కటౌట్ అయిన మహేష్ బాబుని తప్పకుండా జక్కన్న అద్భుతంగా చూపించి భారీ విజయం అందుకుంటారని పలువురు సూపర్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజమౌళి తీసిన RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీ పై పలు విదేశాల ఆడియన్స్ ముఖ్యంగా హాలీవుడ్ నటీనటులు టెక్నీషియల్ యొక్క ఆసక్తి కూడా ఉంది. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు ఆస్కార్ వేడుకల్లో రాజమౌళితో కలిసి సందడి చేసి RRR పై తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

mahesh babu new movie 2024 update

అలానే అటు జక్కన్న రాజమౌళి కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క అంచనాలు అందుకునేలా ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ పూర్తి కావడానికి దాదాపుగా రెండున్నర నుండి మూడేళ్ళ వరకు టైం పడుతుందని, ముఖ్యంగా షూటింగ్ మొత్తం కూడా ఏడాదిలో పూర్తి అయినప్పటికీ ఈలోపు ఆర్టిస్టులు కొంత శిక్షణ తీసుకోవడంతో పాటు వర్క్ షాప్స్ ని కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారట. అలానే ఈ మూవీలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడం, అవి పూర్తి కవాదానిమీ కూడా చాలనే సమయం పడుతుందట.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ మూడేళ్లు సినిమా కోసం ఎంతో కష్టపడేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఫుల్ గా బాడీ ని పెంచనున్న సూపర్ స్టార్ ఇక పై మీడియా కంట పడే అవకాశం ఉండదని అలానే ఆయన నుండి ఎటువంటి సోషల్ మీడియా పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. కాగా అది ఈ మూవీలో ఆయన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడేందుకే జక్కన్న తీసుకున్న నిర్ణయం అంటున్నారు. మరి మొత్తంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ క్రేజ్ మూవీ మూడేళ్ళ తరువాత రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

mahesh babu new movie

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment