Tollywood Box office Collections 2024 l టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లేటెస్ట్ 2024

Written by Movie Updates

Updated on:

Tollywood Box office Collections తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ఇప్పటికే పలు బడా సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఆడియన్స్ ని అలరించాయి. ముఖ్యంగా వాటిలో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం మంచి అంచనాలతో రిలీజ్ అయి కొన్ని ఏరియాలు తప్ప చాలా ఏరియాల్లో బాగా కలెక్షన్ రాబట్టింది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా రూ. 220 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టినట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు మంచి హిట్ కొట్టగా ఆ తరువాత వచ్చిన ఖలేజా మాత్రం పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది.

etc tollywood box office collection

అయితే గుంటూరు కారం మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో మొదట అందరిలో బాగా అంచనాలు ఏర్పరిచింది. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రమణ గాడిగా సూపర్ గా పెర్ఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా థమన్ సాంగ్స్ తో పాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి అందం అభినయం కూడా గుంటూరు కారం మూవీకి బాగా విజయాన్ని అందించింది. అలానే దానితో పాటు రిలీజ్ అయిన తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ల హను మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. ఇక హను మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 295 కోట్ల మేర వరల్డ్ వైడ్ గా గ్రాస్ ని సొంతం చేసుకుని ఇప్పటివరకు టాలీవుడ్ లో 2024 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నటుడిగా గతంలో జంబి రెడ్డి, బేబీ సినిమాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న యువ నటుడు తేజ సజ్జకు ప్రశాంత్ వర్మ ఈ హను మాన్ మూవీ ద్వారా అతి పెద్ద సక్సెస్ ని అందించారని చెప్పాలి.

tollywood box office collection

ఈ మూవీలో హనుమంతు పాత్రలో తేజ సజ్జ మంచి యాక్టింగ్ కనబరిచారు. అలానే విలన్ గా నటించిన వాన నటుడు వినయ్ రాయ్ తో పాటు కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు మరొక్కసారి తమ అద్భుత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడంతో పాటు హనుమంతుని కాన్సెప్ట్ ని తీసుకుని దర్శకడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు, మరీ ముఖ్యంగా చివరి ఇరవై నిముషాలు హను మాన్ మూవీకి పెద్ద ఆయువు పట్టు అని చెప్పాలి. ఆ విధముగా హను మాన్ మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. అలానే అదే సమయంలో రిలీజ్ అయిన నాగార్జున నా సామిరంగ రూ. 37 కోట్లు, వెంకటేష్ సైంధవ్ రూ. 25 కోట్లతో కూడా బాగానే విజయం అందుకున్నాయి.

box office collection of tollywood

అక్కినేని నాగార్జున, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా నటించిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ లో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేయగా మరొక్కసారి ఈ మూవీలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. యువ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన ఈ మూవీని ప్రముఖ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మొత్తంగా నా సామిరంగ విజయం కెరీర్ పరంగా నాగార్జున కు మంచి క్రేజ్ అందించింది.

ఇక ఆ తరువాత ఇటీవల రిలీజ్ అయిన యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ సూపర్ హిట్ కొట్టి రూ. 135 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. గతంలో వచ్చిన డీజే టిల్లు మూవీ కూడా ఎంతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీని మించేలా మరింత యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు మల్లిక్ రామ్ టిల్లు స్క్వేర్ ని అద్భుతంగా రూపొందించారు. సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా యువ అందాల నాయిక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మరొక్కరి టిల్లు పాత్రలో సిద్దు యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించారు. మొత్తంగా టిల్లు స్క్వేర్ విజయంగా హీరోగా సిద్దు జొన్నలగడ్డ బాగా క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ కొనసాగుతున్నారు. సైంధవ్ మూవీలో వెంకటేష్ మరొక్కసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్డఖి విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఇక సైంధవ్ లో ముఖేష్ ఋషి తో పాటు తమిళ నటుడు ఆర్య కూడా కీలక పాత్రలు చేసారు. మొత్తంగా సైంధవ్ మూవీ ఎమోషనల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా దర్శకుడు శైలేష్ కొలను చక్కగా తెరకెక్కించారు. ఈ మూవీ వెంకటేష్ కెరీర్ 75వ మూవీగా రూపొంది మంచి విజయం అందుకుంది. ఇక వీటితో పాటు చిన్న సినిమాగా మంచి అంచనాలతో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న మూవీ ఓం భీం బుష్. ప్రియదర్శి, శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేసారు.

ఈ మూవీ రూ. 26 కోట్ల మేర కలెక్షన్ అందుకుంది. ఇక మాస్ మహారాజ రవితేజ ఈగిల్ మూవీ రూ. 31 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని బాగానే సక్సెస్ అయింది. ముఖ్యంగా ఓం బీమ్ బుష్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన హర్రర్ కామెడీ మూవీగా రూపొందింది. యువ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దీనిని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే ఎంటర్టైనర్ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో ముగ్గురు యువ నటులు అయిన రాహుల్ రామకృష్ణ, శ్రీవిష్ణు, ప్రియదర్శి తమ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, కామెడీ తో ఆడియన్స్ ని అలరించారు. చాలా ఏరియాల్లో ఓం భీం బుష్ మూవీ బాగానే కలెక్షన్ రాబట్టింది.

ఇక వీటితో పాటు ఇప్పటికే నేడు అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ ప్రసన్నవదనం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు ఈ ఏడాది అనగా 2024 లో పలు బడా పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక తాజాగా అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు మూవీ థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా విజయం అందుకుని కొనసాగుతోంది. వారి రాబోయే రోజుల్లో ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలు ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటాయో చూడాలి.

tollywood box office collections

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment