90s Web Series Season 2 Update l 90s వెబ్ సిరీస్ సీజన్ 2 అప్‌డేట్

Written by Movie Updates

Published on:

90s Web Series శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు ఆదిత్య హాసన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 90’s. దీనిని ఇటీవల ప్రముఖ తెలుగు మాధ్యమం ఈటివి విన్ లో ప్రసారం చేయగా ఆడియన్స్ ని అలరించిన ఎన్నో మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ని ఇది సొంతం చేసుకుంది.

90s web series download

ముఖ్యంగా 90 ల కాలం నాటి మధ్యతరగతి జీవితం అలానే వారి జీవితాల్లోని పరిస్థితులు, ముఖ్యంగా ఒక చిన్న కుటుంబం, అందులోని భార్య భర్త, వారి పిల్లల జీవితాల గురించిన ఈ సిరీస్ లో దర్శకుడు ఆదిత్య హాసన్ అద్భుతంగా చూపించారని చెప్పాలి.

90s web series telugu

ఇక ఈ సిరీస్ కి నవీన్ మేడారం సమర్పకులుగా వ్యవహరించారు. అయితే ఈ సిరీస్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుండి విశేషమైన క్రేజ్ లభించడంతో దీని యొక్క సీక్వెల్ అయిన 90’s పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. కాగా ఇటీవల దర్శకుడు రచయిత అయిన ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, ఈ సిరీస్ యొక్క సీక్వెల్ కథని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు.

90s web series ott platform

ఆయన మాట్లాడుతూ, ఇంటర్ కాలేజ్ డేస్ బ్యాక్ డ్రాప్ లో 90’s సీజన్ 2 సాగనుందని అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో తమ స్నేహితుల గురించిన తెలుసుకునేలోపే అందరూ ఇంజనీరింగ్ కి వెళ్ళిపోతారు, అలానే కాలేజీ చదువుల కోసం ఎక్కడో పల్లెటూళ్ళ నుండి వచ్చి సిటీల్లో హాస్టల్ లో ఉండి చదువుకుంటూ ఉంటారు.

90s middle class web series ott platform

వారిలో కొందరు ఇల్లు వదిలి వచ్చి ఇక్కడ సిటీ లైఫ్ అలానే హాస్టల్ జీవితానికి కొంత ఇమడలేక ఇబ్బందులు పడుతుంటారు, అయితే కాలేజీకి వెళ్లి హాయిగా క్లాసుల్లో అల్లరి చేస్తూ గడిపినప్పటికీ తమ పల్లెటూరి జీవితం, అక్కడి ఇంటి వాతావరణం గురించి తరచు రాత్రుళ్ళు పడుకునేటపుడు ఆలోచిస్తుంటారని, ఈ అంశాలనే ప్రధానంగా చేసుకుని ఈ సిరీస్ యొక్క సీక్వెల్ ని రూపొందించనున్నట్లు ఆదిత్య హాసన్ తెలిపారు.

90s web series telugu download

ఇక త్వరలోనే ఈ సిరీస్ ని సినిమాగా థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నాం అని, ప్రతుతం ఆ పనులు జరుగుతున్నాయని కూడా ఆయన తెలిపారు.

90s web series

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment