Samantha Without Makeup l మేకప్ లేకుండా సమంతని చూసారా 2024

Written by Movie Updates

Updated on:

Samantha Without Makeup టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నారు. నటిగా తొలిసారిగా ఏ మాయ చేసావే మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఆ మూవీతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో సమంత జెస్సి పాత్రలో కనిపించారు. ముఖ్యంగా ఆ పాత్ర అప్పటి యువత ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా అబ్బాయిలు కేవలం జెస్సి ని చూసేందుకే అప్పట్లో ఏ మాయ చేసావే సినిమాకు ఎన్నో సార్లు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో.

Samantha Without Makeup

ఆ విధంగా ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే తో నే పేరు అందుకున్నారు సమంత రూత్ ప్రభు. ఈ మూవీని ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ రెండవ కుమార్తె మంజుల గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ఈ మూవీకి అప్పట్లో దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ అందించిన సాంగ్స్ కూడా పెద్ద చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఆ విధంగా ఫస్ట్ మూవీతో బాగా పేరు అందుకున్న సమంతకు వరుసగా అవకాశాలు లభించాయి.

అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం తో పాటు ఎస్ ఎస్ రాజమౌళితో ఈగ మూవీ చేసి వాటితో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు సమంత. ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సమంత చుల్ బులిగా తన పెర్ఫార్మన్స్ తో అలరించి అందరినీ ఆకట్టుకున్నారు. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బృందావనం మూవీలో కూడా అలరించారు సమంత. ఇక వీటి తరువాత నాని హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈగ లో హీరోయిన్ గా పలు సీన్స్ లో అదరగొట్టిన సమంతకు ఆ మూవీస్ వరుస విజయాలు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టడంతో పాటు టాలీవుడ్ లో ఆమెకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే క్రెడిట్ ని అందించాయి.

ఇక అక్కడి నుండి ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్కో సినిమాతో నటిగా మంచి విజయాలు అందుకోవడంతో పాటు తన ఆకట్టుకునే అందం అభినయంతో ఎందరో ఫ్యాన్స్ మనసులు దోచారు సమంత. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకున్న సమంత రూత్ ప్రభు అటు తమిళ్ లో కూడా పలువురు స్టార్స్ తో నటించారు. ఇళయదళపతి విజయ్ తో ఆమె నటించిన కత్తి, సూర్య తో నటించిన సికిందర్ అక్కడ బాగా విజయాలు అందుకున్నాయి.

ఆ విధంగా అటు తమిళ నాట కూడా సమంత కు బాగా క్రేజ్ దక్కిందని చెప్పాలి. ఇక ఇటీవల ఆరేళ్ళ క్రితం తన ఫస్ట్ మూవీ హీరో అయిన అక్కినేని మూడవ తరం నటుడు నాగ చైతన్యని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు సమంత. వీరిద్దరి వివాహం డెస్టినేషన్ పద్దతిలో ఎంతో వైభవంగా జరిగింది. అయితే నాలుగేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట కొన్ని అనివార్య కారణాల వలన తామిద్దరం విడిపోతున్నట్లు ఇటీవల అధికారికంగా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. ఇక అక్కడి నుండి చైతన్య తో విడిపోయిన సమంత, ఆపైన తన ఫ్యామిలీ తో కలిసి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుక్కుని ఉంటున్నారు. మరోవైపు చైతన్య విడిగా తన ఫ్యామిలీ తో జీవిస్తున్నారు. ఇక ఇటీవల గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం, అలానే యశోద సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి పేరు అందుకున్నారు సమంత.

Samantha Without Makeup

ఐతే ఇటీవల మాయోసైటిస్ వ్యాధితో బాధపడ్డ సమంత, అనంతరం డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్ తీసుకుని పలు విదేశాలు వెకేషన్ కి వెళ్లి వచ్చారు. ఆ వ్యాధి వలన తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, అయితే ఎవరికైనా అనారోగ్యం సంభవించినపుడు ప్రక్కన పలువురు తోడుండి ధైర్యాన్ని అందిస్తే దానిని మెల్లగా అధిగమించి మనో ధైర్యంతో మళ్ళి ఆరోగ్యం పొందవచ్చని, ఆ విధంగా తనకు మాయోసైటిస్ సోకినా సందర్భంలో తన ఫ్యామిలి తో పాటు ఫ్యాన్స్ ఎంతో అండదండగా నిలిచారని వారి మేలు ఎప్పటికీ మర్చిపోలేనని అప్పట్లో తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు సమంత రూత్ ప్రభు. ఇక మరోవైపు పలు సామజిక సేవా కార్యక్రమాలతో మొదటి నుండి తనకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవకు అందిస్తుంటారు సమంత. కెరీర్ బిగినింగ్ లోనే ప్రత్యూష ఫౌండేషన్ సంస్థని నెలకొల్పి ఎందరో ఆడబిడ్డలకు అలానే చిన్నారులకు విద్యని అందించడంతో పాటు ఉచిన గుండె ఆపరేషన్స్ కూడా చేయిస్తూ తన మంచి మనసుని చాటుకుంటూ గొప్ప పేరుతో కొనసాగుతున్నారు సమంత.

ఇక ప్రస్తుతం అమెరికన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు సమంత రూత్ ప్రభు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో ప్రసారం కానుంది. ఈ సిరీస్ పై సమంత ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, మొదటి నుండి కూడా తాను బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తానని తరచూ చెప్తుంటారు సమంత. పైపై అందాల కంటే లోపల మనసు మరియు ఆలోచనలు గొప్పగా ఉండాలని, ఇక మేకప్ వేసుకునేది సినిమాల్లో అందంగా కనిపించడం కోసం అని కానీ మేకప్ తీసేసి సహజంగా మనం కనపడేదే నిజమైన అందం అని అంటారు సమంత. కష్టే ఫలి అని, అందంతో పాటు అభినయంతో కష్టపడితే తప్పకుండా మంచి విజయం లభిస్తుందని అంటారు సమంత. మరి నటిగా సమంత రూత్ ప్రభు రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Samantha Without Makeup

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment