Kho Gaye Hum Kahan 2023 Review Telugu l ఖో గయే హమ్ కహాన్ రివ్యూ తెలుగు

Written by Movie Updates

Published on:

Kho Gaye Hum Kahan 2023:- సమీక్ష : ఖో గయే హమ్ కహాన్ – ఇంట్రెస్టింగ్ గా సాగె మూవీ

 

విడుదల తేదీ : డిసెంబర్ 26, 2023

మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ – 4 / 5

నటీనటులు: అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్, రోహన్ గర్బక్సాని, కల్కి కొల్చెయిన్ తదితరులు.

దర్శకుడు: అర్జున్ వారైన్ సింగ్

నిర్మాతలు : జోయా అక్తర్, రీమా కగ్టి, రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్

సంగీత దర్శకులు: OAFF సవేరా, అంకుర్ తివారి, సచిన్ జిగర్, కరణ్ కంచన్, అచింత్, రశ్మిత్ కౌర్, సిద్ శిరోద్కర్

సినిమాటోగ్రాఫర్: తనయ్ సతం

ఎడిటర్: నితిన్ బెయిద్

kho gaye hum kahan pocket fm

 

ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ ఫేమ్ అనన్య పాండే ప్రధాన పాత్రలో తాజాగా బాలీవుడ్ మూవీ రిలీజ్ అయిన మూవీ ఖో గయే హమ్ కహాన్ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎలా ఉందో పూర్తి సమీక్ష లో చూద్దాం.
కథ :
ఇక ఈ మూవీ యొక్క కథ ముఖ్యంగా ముగ్గురు ప్రాణ స్నేహితుల మధ్య సాగుతుంది. ఇక వారు ముగ్గురూ అహానా (Ananya Panday), ఇమాద్ (Siddhant Chaturvedi), నీల్ (Adarsh Gourav). ఇక వీరిలో ముందుగా ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అహనా చక్కగా చదువుకుని పైకి ఎదగాలని అనుకుంటుంది, అయితే అనుకోకుండా ఆమె ఒక రిలేషన్ షిప్ సమస్యలో ఇరుక్కుతుంది.
ఇక జిమ్ ఇన్స్ట్రక్టర్ గా నీల్ పని చేస్తుండగా ఇమాద్ స్టాండప్ కమెడియన్ గా వర్క్ చేస్తుంటాడు. వీరిద్దరూ కూడా భవిష్యతులో పైకి రావాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటిది మరి సడన్ గా వీరి ముగ్గురి జీవితాల్లో ఏమి జరిగింది, అనంతరం వారు ఏ విధంగా ముందుకు సాగారు. వారికి ఎదురైన సమస్యలను ఎదుర్కొని ఏవిధంగా విజయం సాధించారు అనేది సినిమా యొక్క పూర్తి కథ.

Kho Gaye Hum Kahan Review in Hindi

ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఖో గయే హమ్ కహాని మూవీ నేటి యువతకి సంబందించిన ఒక కీలక టాపిక్ కి సంబందించి సాగుతుంది. మరీ ముఖ్యంగా నేటి యువత నిజజీవితంలోని మానవ సంబంధాల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ తమ జీవితాలను వాటితోనే గడుపుతున్నారు. ఆ విధంగా మొబైల్ ఫోన్ తోనే తమ లైఫ్ సాగిస్తున్న యువతకు సంబంధించి పలు అంశాలు స్పృశిస్తూ ఈ మూవీ సాగుతుంది.
అలానే దీని ద్వారా మనకు మంచి మెసేజ్ కూడా లభిస్తుంది. ఇక ఈ ముగ్గురు తమ జీవితంలో సోషల్ మీడియా వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారు. అయితే మొదట వారి జీవితం సాదాసీదాగా సాగినప్పటికీ ఆ తరువాత వారిని ఇబ్బంది పెట్టిన అంశం ముగ్గురికి సంబంధించి ఒక లింక్ ఉంటుంది. ఆ విధంగా కథని అలానే కథనాన్ని దర్శకుడు అర్జున్ వారైన్ సింగ్ అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడం జరిగింది.
అయితే ఈ మూవీ ఎండింగ్ సమయానికి బాగా ఇంటెన్స్ గా డార్కర్ వే కి చేరుకుంటుంది. ఇక దానిని ఎంతో చక్కగా సెటిల్ మ్యానర్ లో దర్శకుడు డీల్ చేసారు. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన నటి అనన్య పాండే గత సినిమాలతో పోలిస్తే మరింత అద్భుతంగా నటించారు అని చెప్పాలి. ఇక ఇతర పాత్రల్లో నటించిన సిద్దాంత్, ఆదర్ష్ కూడా చక్కటి నటన ప్రదర్శించారు అని చెప్పాలి. ఇక మూవీలో తనకు స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ కూడా నటి కల్కి కొల్చెయిన్ చక్కగా నటించారు. మొత్తంగా చాలా వరకు ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.
మైనస్ పాయింట్స్ :
ఇక ఈమూవీ కోసం దర్శకుడు తీసుకున్న కథ బాగున్నప్పటికీ కథనాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా నడిపితే బాగుండేదనిపిస్తుంది. మొదటి గంట పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, అక్కడ కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ విభాగం వారు కట్ చేస్తే బాగుండేది.
ఇక ఈ కాన్సెప్ట్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ తో పాటు యువతకి బాగా కనెక్ట్ అవడంతో ఇతర సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది రీచ్ కాకపోవచ్చు. ఇటువంటి కథల్లో యాక్షన్, కమర్షియల్ అంశాలు ఆశించలేము. ఇక చాలా వరకు కథనం సాగుతున్నప్పుడు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనేది మనకు అర్ధం అవుతుంది. అలానే కామెడీ సీన్స్ కూడా మరింత ఆకట్టుకునేలా రాసుకుంటే బాగుండేది.
సాంకేతిక వర్గం :
ఇక ఈ మూవీలో పాత్రల యొక్క అద్భుత నటనతో పాటు చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. పలు సందర్భాల్లో మూవీ థీమ్ కి సీన్స్ కి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రాఫర్ తనయ్ సతం కూడా అద్భుతంగా విజువల్స్ ని అందించి అలరించారు.
కొన్ని సీన్స్ అయితే మనకి మంచి ఐ ఫీస్ట్ ని అందిస్తాయి. ఇక ఎడిటింగ్ విభాగం వారు మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాల్సింది. ఇక దర్శకుడు అర్జున్ వారైన్ సింగ్ దర్శకుడిగా ఈ మూవీతో మెగాఫోన్ పట్టినప్పటికీ కథ, కథనాలను ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా బాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. నేటి యువత ప్రస్తుత డిజిటల్ ఎరా లోని అంశాలు తీసుకుని చక్కగా తెరకెక్కించారు.

Kho Gaye Hum Kahan 2023 Review

తీర్పు :
ఇది మొత్తంగా ఖో గయే హమ్ కహాన్ మూవీ నేటి కాలం యువత ఎక్కువగా వ్యక్తిగత బంధాల కంటే సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ వంటి వాటికీ ఎక్కువగా విలువనిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కథాంశంగా తీసుకుని చక్కగా రూపొందించబడింది. ప్రధాన పాత్రల్లో నటించిన అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారు.
అలానే వారి పాత్రలు నేటి యువత లోని పలువురికి రిలేట్ అవుతాయి కూడా. అయితే అక్కడక్కడా కొంత స్లో పేస్ లో సాగడం, అధిక రన్ టైం వంటివి కొంత ఇబ్బందిగా అనిపించినా కథనం ఇంట్రెస్టింగ్ గా సాగడంతో ఓవరాల్ గా ఈ వారం మీరు ఖో గయే హమ్ కహాన్ (Kho Gaye Hum Kahan) మూవీని హ్యాపీగా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో చూసేయొచ్చు.

Kho Gaye Hum Kahan 2023 Movie

మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ – 4 / 5
Kho Gaye Hum Kahan 2023

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Kho Gaye Hum Kahan 2023

1 thought on “Kho Gaye Hum Kahan 2023 Review Telugu l ఖో గయే హమ్ కహాన్ రివ్యూ తెలుగు”

Comments are closed.