Mahesh Babu Biography Net worth Family Secrets l మహేష్ బాబు బయోగ్రఫీ నెట్ వర్త్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024

Written by Movie Updates

Published on:

Mahesh Babu Biography Net worth Family Secrets:- మన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నేటితరం సూపర్ స్టార్ గా వరుసగా పలు విజయాలతో దూసుకెళుతూ కోట్లాది ప్రేక్షక అభిమానుల్లో అద్వితీయమైన క్రేజ్ ని విశేషమైన ఆదరణ, ప్రేమని సొంతం చేసుకుని దూసుకెళుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. నటుడిగా ఇప్పటివరకు తన కెరీర్ పరంగా 27 సినిమాల్లో ఆయన నటించారు. మహేష్ బాబు 1979లో సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పటి లెజెండరీ టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరు. అయితే తన తండ్రి కృష్ణ గారి సినిమా షూటింగ్స్ జరుగుతున్నపుడు వేసవి సీజన్ సందర్బంగా పలు సందర్భాల్లో ఊటీ వంటి ప్రాంతాలకు పిల్లలను కూడా తీసుకెళ్లేవారు కృష్ణ. ఆ సమయంలో  మహేష్ బాబును చూసిన అప్పటి దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తాను తెరకెక్కించనున్న ప్రయోగాత్మక సినిమా నీడ లో ఒక కీలక పాత్రకి బాలనటుడిగా మహేష్ బాబుని తీసుకున్నారు.

అందులో కృష్ణ గారి పెద్ద కుమారుడైన రమేష్ బాబు కూడా ఒక కీలక పాత్ర చేయడం జరిగింది. ఆ విధంగా నీడ సినిమాతో బాల నటుడిగా మహేష్ బాబు తెలుగు సినిమా రంగానికి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రెండో సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తెరకెక్కిన శంఖారావం, అనంతరం రమేష్ బాబు హీరోగా రూపొందిన బజార్ రౌడీ, ఆపైన ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, అలానే కొడుకు దిద్దిన కాపురంలో బాలనటుడిగా డ్యూయల్ రోల్ పోషించారు. వాటి అనంతరం గీత, శరత్ కుమార్, రామిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలచంద్రుడు అలానే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తెరకెక్కినఅన్న తమ్ముడు సినిమాల్లో కూడా మహేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. అయితే విషయం ఏమిటంటే, బాలనటుడిగా అప్పట్లో తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అలరించి మంచి పేరు అందుకున్నారు మహేష్ బాబు. ఇక చివరిగా ఈ రెండు సినిమాలు అనంతరం బాలనటుడిగా సినిమాలు ఆపేసారు మహేష్ బాబు. ఇక అక్కడి నుంచి నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకొన్నారు మహేష్.

అలానే చదువులో కూడా కొంత ఉత్తీర్ణత సంపాదించారు. ముఖ్యంగా తనకు నటన నేర్పిన గురువైన సత్యానంద్ గురించి గొప్పగా చెపుతుంటారు మహేష్. సత్యానంద్ గారి దగ్గర నటన నేర్చుకున్నాను, అలాగే ఆయన దగ్గర ఎన్నో మెళకువలు తెలుసుకున్నానని ఆయన అందరికి అద్భుతంగా శిక్షణ ఇస్తారని అన్నారు. అనంతరం 1999లో తొలిసారిగా దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలీవుడ్ నటి  ప్రీతీ జింటా హీరోయిన్ గా తెరకెక్కిన రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరో గా ఎంట్రీ ఇచ్చారు మహేష్. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అలానే మంచి యాక్షన్, లవ్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దీనిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అద్భుతంగా తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. అలానే తన అభినయంతో మహేష్ బాబు ఆ మూవీలోని రాజ్ కుమార్ పాత్రలో సూపర్ గా నటించారు.

మొత్తంగా అప్పట్లో రాజకుమారుడు సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని తొలి సినిమా ద్వారానే హీరోగా మహేష్ బాబు కి నటుడిగా విశేషమైన ప్రేక్షకుల ప్రేమతో పాటు ఎందరో అభిమానులని సైతం అందించింది. అనంతరం వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్స్ గా యువరాజు సినిమాలో నటించారు మహేష్. ఈ ట్రయాంగిల్ యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ లో మహేష్ బాబు కుమారుడిగా ఇప్పటి యువ హీరో తేజ సజ్జ బాలనటుడిగా నటించారు. ఆ సమయంలో అతడి వయసు నాలుగు సంవత్సరాలు. మంచి అంచనాలతో విడుదలైన యువరాజు సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకుంది. ఆ సినిమాకి రమణ గోగుల గారు అందించిన సంగీతం ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. మహేష్ బాబు అత్యద్భుత నటన కనబరిచిన యువరాజు కు అందరి నుండి మంచి పేరు లభించింది.

అనంతరం తమ సొంత సంస్థ అయిన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో అలానే నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా వంశీ మూవీ చేసారు మహేష్. అయితే వంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఆ సినిమాకి అప్పట్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక పెద్ద సంచలనాన్ని అయితే సృష్టించాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మరియు కృష్ణ ఇద్దరు మామ అల్లుళ్ళ పాత్రలో నటించారు. అటు కృష్ణ గారు ఇటు మహేష్ ఇద్దరు కూడా అద్భుత నటన కనబరిచారు. అనంతరం మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తొలిసారిగా బాలీవుడ్ నటీమణి సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా మురారి. ఈ సినిమాలో మహేష్ బాబు కనబరిచిన అద్భుత పెర్ఫార్మన్స్ కి జ్యూరీ నంది అవార్డు లభించింది. ప్రసాద్ బాబు, సత్యనారాయణ, చిన్న, అనిత చౌదరి, హేమ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ బాబు అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో పాటు కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్ వంటివి బాగా పండాయి. విభిన్నమైన ఆకట్టుకునే కదా కథనాలతో తెరకెక్కిన మురారి అప్పట్లో సిల్వర్ జూబిలీ మూవీగా నిలిచి నటుడిగా మహేష్ బాబుకి మంచి బ్రేక్ అయితే అందించింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో మెలోడీస్ గా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్, యువత అందరినీ ఆకట్టుకునే విధంగా అత్యద్భుతమైన ట్యూన్స్ అందించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. దీని అనంతరం జయంత్ ఫలక్రం సినర్జిస్ బ్యానర్ పై తొలిసారిగా జయంత్ సి పరాన్జీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ కౌబాయ్ సినిమా టక్కరి దొంగ. ఈ సినిమా ద్వారా, తొలిసారిగా కౌబాయ్ సినిమాలో నటించారు మహేష్ బాబు. అంతకుముందు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు, మంచి వాళ్లకు మంచివాడు వంటి కౌ బాయ్ సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమకు కౌబాయ్ సినిమాలను తొలిసారిగా పరిచయం చేశారు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కొదమ సింహం కౌబాయ్ సినిమాలో నటించి మంచి విజయం అందుకున్నారు. ఇక వీరిద్దరి తర్వాత చాలా గ్యాప్ అనంతరం మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా 2002 జనవరిలో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఏమాత్రం డూప్ లేకుండా మహేష్ బాబు చేసిన సాహసోపేత సన్నివేశాలు ఇప్పటికీ కూడా మనందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులైన బిపాషా బసు, లిసారే ఇద్దరూ కలిసి నటించిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యద్భుతమైన నటనతో పాటు హీరోయిన్స్ ఇద్దరి అందం, అభినయం ఆకట్టుకునే టేకింగ్, కథ, కథనాలు, ముఖ్యంగా మణిశర్మ అందించిన సూపర్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అత్యద్భుతమైన గ్రాడ్నియర్ విజువల్స్ ఈ సినిమాకి బలంగా మారాయి. అనంతరం శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా బాబీ.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా మంచి సక్సెస్ అయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ మూవీ ఒక్కడు చేసారు. అంతకముందు గుణశేఖర్ మెగాస్టార్ చిరంజీవితో చూడాలని వుంది సినిమాను చేసి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆ విధంగా తొలిసారిగా గుణశేఖర్ తో మహేష్ బాబు చేసిన ఒక్కడు సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాని గ్రాండ్ లెవెల్లో నిర్మించడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించడంతో పాటు నటుడిగా మహేష్ బాబుకు తిరుగులేని స్టార్ డం అయితే తెచ్చిపెట్టింది. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ గారు అత్యద్భుత నటన కనబరిచారు. అలానే ముకేశ్ ఋషి ఇందులో మహేష్ బాబుకి తండ్రిగా నటించగా ప్రముఖ హీరోయిన్ గీత మహేష్ బాబు గారికి తల్లిగా నటించారు.

మణిశర్మ అందించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహేష్ బాబు అత్యద్భుత నటన, ఆకట్టుకునే కథ కథనాలు, భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ వంటివి ఒక్కడు సినిమాని అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశాయి. అప్పట్లో అత్యధిక థియేటర్స్ లో వంద రోజులు ఆడిన మూవీగా ఒక్కడు సంచలనం నమోదు చేసింది. అనంతరం తేజ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందించిన యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా నిజం. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఆకట్టుకొనే కథ, కథనాలతో ఈ సినిమా అయితే రూపొందింది. రక్షిత హీరోయిన్ గా నటించిన మూవీలో సీనియర్ నటులు తాళ్లూరి రామేశ్వరి, రంగనాధ్ మహేష్ బాబు కి తల్లిదండ్రుల పాత్రల్లో నటించారు. ఇప్పటి యాక్షన్ హీరో గోపిచంద్ విలన్ గా నటించిన ఈ సినిమాలో నటి రాశి ఒక కీలక పాత్ర పోషించగా దీనికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ముఖ్యంగా నిజం సినిమాలోని అమాయకుడైన సీతారాం పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనబరిచిన సహజత్వమైన నటనకి నంది అవార్డు కూడా లభించింది.

వాస్తవానికి నిజం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోనప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి మహేష్ పోషించిన సీతారాం పాత్ర ఆయన కెరీర్ లో నిలిచిపోతుందని చెప్పాలి. తేజ గారి అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ, మహేష్ బాబు నటన, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ఆ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ సినిమా నాని. నిజానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది అనే చెప్పాలి. నాని సినిమాలో బాలీవుడ్ నటీమణి అమీషా పటేల్ హీరోయిన్ గా నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలై పెద్దగా సక్సెస్ కాలేదు నాని మూవీ. దాని తర్వాత భారీ సెట్టింగ్స్ తో భారీ స్థాయి బడ్జెట్ తో రూపొందిన సినిమా అర్జున్. అంతకముందు ఒక్కడు సినిమా చేసిన దర్శకుడు గుణశేఖర్ కి అర్జున్ మూవీ ద్వారా మరొక అవకాశం ఇచ్చారు మహేష్ బాబు. ఈ సినిమాని మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తన కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో అయితే దీనిని నిర్మించారు.

అప్పట్లో మంచి అంచనాలతో విడుదలైన ఈ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా మణిశర్మ గారు అందించిన సాంగ్స్ తో పాటు మధుర మీనాక్షి టెంపుల్ సెట్ అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. భారీ స్థాయి ఖర్చుతో అత్యధిక వ్యయంతో దానిని ప్రముఖ టాలీవుడ్ కళా దర్శకుడు తోట తరణి నిర్మించారు. ఆ విధంగా అర్జున్ సినిమా మంచి విజయం సొంతం చేసుకొని నటుడిగా మహేష్ బాబుకు మరింతగా క్రేజ్ ని పెంచింది. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారిగా మహేష్ బాబు చేసిన సినిమా అతడు. స్టార్ హీరో హీరోయిన్ త్రిష నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. భారీ స్థాయి యాక్షన్ ఎమోషనల్ లవ్ డ్రామా సన్నివేశాలతో తెరకెక్కిన అతడు మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి నటుడిగా మహేష్ బాబు రేంజ్ ని మరింత పెంచేసింది.

ఎన్నో ఏరియాల్లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. ఇక ఇప్పటికి కూడా ఇందులోని సాంగ్స్ అలానే సినిమా ఎన్నిసార్లు బుల్లితెరపై ప్రసారమైనా కూడా మంచి రేటింగ్స్ నైతే సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఆ విదంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ తొలి కాంబినేషన్ లో వచ్చిన అతడు కల్ట్ క్లాసిక్ గా ఆడియన్స్ మనసులో మంచి క్రేజ్ తో నిలిచిపోయింది. ఇక తర్వాత స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారిగా చేసినటు సినిమా పోకిరి. ఇలియానా హీరోయిన్ గా నటించిన పోకిరి సినిమా అప్పట్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దాదాపుగా రూ. 42 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకొని ఇండియా వైడ్ టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది. ఇక పోకిరిలో మహేష్ బాబు అత్యద్భుత పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే విజువల్స్ తో పాటు ఇలియానా అందం అభినయం, మణిశర్మ అందించిన వండర్ఫుల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భారీ నిర్మాణ విలువలు విలన్ గా ప్రకాష్ రాజ్ అద్భుత నటన, పూరీ జగన్నాధ్ పవర్ ఫుల్ టేకింగ్ ఓవర్ అల్ గా పోకిరి మూవీని అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ చేశాయి.

ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎవరికీ అందనటువంటి భారీ స్థాయి క్రేజ్ ని, ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అనేక అవార్డులు, రివార్డులతోనే కాకుండా పలు భాషల్లో కూడా రీమేక్ అయిన పోకిరి మూవీ ఆయా భాషల్లో కూడా భారీ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషం. ఆ విధంగా మహేష్ బాబు కెరీర్ ని మరొక గొప్ప స్థాయికి తీసుకెళ్లి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది పోకిరి మూవీ. దాని అనంతరం మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా సైనికుడు. ఈ సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ గా నటించగా దీనికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలన్ గా నటించగా మరొక కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే సైనికుడు మూవీ అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. అయితే మ్యూజికల్ గా ఇందులోని సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Mahesh Babu Biography Net worth Family Secrets

దాని తర్వాత స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అతిథి. బాలీవుడ్ నటి అమృతరావు హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ అందించిన సూపర్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలాలు. ఈ మూవీలో మహేష్ బాబు ట్రెండీ లుక్స్, ఆకట్టుకునేటటువంటి హెయిర్ స్టైల్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ద్వారానే ప్రముఖ నటుడు మురళి శర్మ విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర అతిథి మూవీ యావరేజ్ విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది. ఇక దీని తర్వాత ఖలేజా మూవీ చేశారు మహేష్ బాబు. చాలా గ్యాప్ తర్వాత మరొకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు చేసిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం అందుకోలేదు.

అయినప్పటికీ కూడా కల్ట్ క్లాసిక్ గా నిలిచినటువంటి ఖలేజా లోని సాంగ్స్ ముఖ్యంగా మహేష్ బాబు వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఎప్పటికి కూడా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసాయి. ఆ విదంగా మహేష్ బాబు కెరీర్ లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు ఆ తర్వాత ఖలేజా కూడా ఆడియన్స్ మనసులో ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయని చెప్పాలి.  దాని అనంతరం భారీ సినిమా దూకుడు ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ ముందుకు వచ్చారు మహేష్. దిగ్గజ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కోన వెంకట్, గోపి మోహన్ కథా రచన చేసిన దూకుడు సినిమా రిలీజ్ తర్వాత అతి పెద్ద హిట్ అయితే సొంతం చేసుకుంది. మహేష్ బాబు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు శ్రీను వైట్ల అద్భుత దర్శకత్వ ప్రతిభ, స్క్రీన్ ప్లే అలానే ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరి నుండి విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి.

స్టార్ హీరోయిన్ సమంత కటనాయికగా  నటించిన దూకుడు సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరా రావు, షాయాజీ షిండే, చంద్రమోహన్, నాజర్ వంటి వారు నటించారు. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు సోను సూద్ విలన్ గా కనిపించడం జరిగింది. మొత్తంగా దూకుడు సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి అటు యూఎస్ లో సైతం హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా భారీ స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుంది. అంతకు ముందు అతడు సినిమాతో తొలిసారిగా యూఎస్ మార్కెట్ ఓపెన్ చేసిన మహేష్ బాబు దూకుడు సినిమాతో దానిని మరింతగా పెంచేశారు. ఆ విధంగా యూఎస్ ఏ లో తనకంటూ ఆడియన్స్ లో ప్రేత్యేకమైన గుర్తింపును సాధించిన స్టార్ హీరోగా మహేష్ బాబు స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక దూకుడు అనంతరం మరోసారి పూరీ జగన్నాధ్ తో మహేష్ బాబు పనిచేసిన సినిమా బిజినెస్ మ్యాన్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ గారు హీరోయిన్ గా నటించగా దీనికి కూడా థమన్ సంగీతం అందించారు.

మహేష్ బాబు వన్ మ్యాన్ షో పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. పూరీ జగన్నాధ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు టేకింగ్ కూడా దీనికి ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ కి ఎప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఇటీవల రీ రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా థియేటర్స్ లో మరొకసారి అత్యద్భుతంగా సందడి చేసి ఈ సినిమా యొక్క సత్తాని మహేష్ బాబు క్రేజ్ ని మరోసారి నిరూపితం చేసింది. బిజినెస్ మ్యాన్ తర్వాత తొలిసారిగా 25 ఏళ్ళ అనంతరం తెలుగు సినిమా పరిశ్రమకు ముల్టీస్టారర్ మూవీని తీసుకొచ్చారు మహేష్ బాబు. ఈ సినిమా పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఆ సినిమా ద్వారా తొలిసారిగా విక్టరీ వెంకటేష్ తో కలిసి జత కట్టారు మహేష్ బాబు. యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ అనంతరం అతి పెద్ద విజయాన్ని అయితే నమోదు చేసింది.

ఏమాత్రం ఫైట్స్, భారీ యాక్షన్ సీన్స్ వంటివి లేకుండా చక్కటి కుటుంబ కథాచిత్రం గా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా, దీని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. దీని తర్వాత తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మహేష్ బాబు పని చేసిన సినిమా వన్ నేనొక్కడినే. ఈ సినిమాపై కూడా అందరిలో మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. అప్పట్లో అత్యధిక వ్యయంతో భారీ బడ్జెట్ తో రూపొందిన వన్ నేనొక్కడినే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయి విజయం అందుకోలేక పోయింది. ఈ సినిమా ద్వారా తొలిసారిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అయిన కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. ఇక కీలక పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, ఆనంద్, నాజర్ వంటి వారు కనిపించడం జరిగింది. ఓవరాల్ గా వన్ నేనొక్కడినే సినిమా మహేష్ బాబు కెరీర్ లో క్లాసికల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇందులో మానసికంగా వేదన కలిగినటువంటి యువకుడిగా మహేష్ బాబు అత్యద్భుత నటన కనబరిచారు.

ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల యొక్క మదిని తాకాయి. అలానే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు వన్ సినిమాలో అద్భుతం అని చెప్పాలి. దీని తర్వాత మరొకసారి శ్రీను వైట్ల తో కలిసి మహేష్ బాబు చేసిన మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆగడు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా సోదరుడిగా అజయ్ నటించారు. అప్పట్లో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఆగడు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం నమోదు చేసుకోలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు అత్యద్భుతమైన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ కి అందరి నుంచి విశేషమైన ప్రసంశలు కురిసాయి. మరొకసారి ఎస్ థమన్ ఈ సినిమాకి అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా భాటియా నటించారు. అలానే ఇందులో స్టార్ నటి శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేసారు. ఇక ఆగడు తర్వాత తొలిసారిగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా శ్రీమంతుడు.

ఊరిని దత్థత తీసుకోవడం అనే వినూత్న కాన్సెప్ట్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి మాస్ యాక్షన్ తో కూడిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీమంతుడు సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు అత్యద్భుత పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు కొరటాల శివ అత్యద్భుత రీతిని తెరకెక్కించిన తీరు, హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ అందం అభినయం, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సూపర్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్రాండ్ విజువల్స్. ఈ సినిమాకి భారీ విజయాన్ని అందించాయి. ఇక శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు విజయాన్ని అందుకుని నటుడిగా భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అయితే దీని అనంతరం మరొకసారి శ్రీకాంత్ అడ్డాల తో మహేష్ బాబు చేసిన ఫ్యామిలీ యాక్షన్ సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు హీరోయిన్స్ తో నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మ్యూజికల్ గా అతిపెద్ద సెన్సేషన్ సృష్టించిన బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అనంతరం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక దీని అనంతరం తొలిసారిగా తమిళ దర్శకుడు మురుగదాస్ తో మహేష్ బాబు చేసిన భారీ యాక్షన్ సినిమా స్పైడర్. తెలుగు, తమిళ బైలింగువల్ మూవీగా రూపొందిన స్పైడర్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటించడం జరిగింది. ఈ సినిమాపై అప్పట్లో భారీ స్థాయి హైప్ తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ అలానే ఓవర్సీస్ లో భారీ స్థాయి ప్రీమియర్స్ లభించాయి. కానీ స్పైడర్ సినిమా రిలీజ్ అనంతరం మాత్రం ఆకట్టుకునే స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇక స్పైడర్ అనంతరం మహేష్ బాబు నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా భరత్ అనే నేను. రెండోసారి కొరటాల శివ తో కలిసి మహేష్ బాబు చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా మరొకసారి దీనికి కూడా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Mahesh Babu Biography Net worth Family Secrets

ఈ సినిమాలో ముఖ్యమంత్రి భరత్ గా మహేష్ బాబు అత్యద్భుత నటన కనబరిచారు. తన పాత్రలో మహేష్ బాబు కనబరిచిన నటనకు విశేషమైనటువంటి స్పందన లభించింది. కొరటాల శివ అత్యద్భుత టేకింగ్ తో పాటు మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎమోషనల్ గా రూపొందిన భరత్ అనే నేను సినిమా అందరినుంచి విశేషమైనటువంటి ప్రసంశలు సొంతం చేసుకుంది. దాని అనంతరం తొలిసారిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సినిమా మహర్షి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మరొక కీలకపాత్రలో అల్లరి నరేష్ కనిపించారు. యాక్టర్ జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. అలానే ఈ మూవీలోని సాంగ్స్ కూడా మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక దీని అనంతరం మహేష్ బాబు నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమాని యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మరోసారి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక ప్రముఖ నటి మరియు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఈ సినిమా ద్వారా చాలా సంవత్సరాల అనంతరం సినీరంగ పునః ప్రవేశం చేసారు. ఈ సినిమాలో ఆమె పోషించిన కీలక పాత్ర అందరిని విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు నటనతో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సీన్స్, అనిల్ రావిపూడి టేకింగ్ వంటివ ప్రధాన బలాలుగా నిలిచాయి. 2020 సంక్రాంతి కానుకగా విడుదలై అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేసుకుంది సరిలేరు నీకెవ్వరు మూవీ. దీని అనంతరం యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సినిమా సర్కారు వారి పాట.

థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాటలోని సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ స్టైలిష్ న్యూ లుక్ లో కనిపించగా తమన్ అందించినటువంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. మంచి మెసేజ్ కూడా ఇందులో పొందుపరిచారు దర్శకుడు పరశురామ్. మొత్తంగా అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరొక విజయాన్ని నమోదు చేసి కెరీర్ పరంగా రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. అంతకుముందు అప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు మహేష్ బాబు. ఇక ప్రస్తతం చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తనకు ఎంతో ఇష్టమైనటువంటి స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం మూవీ చేస్తున్నారు మహేష్.

ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, బ్రహ్మానందం, రఘుబాబు, మహేష్ ఆచంట వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుంటూరు కారం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ టీజర్ అందరిని ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయి ఎక్సపెక్టషన్స్ పెంచింది. ఇక గుంటూరు కారం మూవీ షూటింగ్ ఈ ఏడాది పూర్తవడంతో జనవరి 12న దీనిని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. హారిక హాసిని క్రియేషన్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా గుంటూరు కారం సినిమా నిర్మితమవుతోంది. ఇక దీని అనంతరం తొలిసారిగా తన కెరీర్ లో భారీ పాన్ ఇండియన్ మించి పాన్ వరల్డ్ సినిమాను చేయబోతున్నారు మహేష్ బాబు. దానిని ప్రతిష్టాత్మక దిగ్గజ దర్శకుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించనుండగా కే యల్ నారాయణ ఈ సినిమాని అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఈ మూవీ గురించి మాట్లాడుతూ దీనిని భారీ యాక్షన్ తో కూడి అడ్వెంచరస్, గ్లోబ్ ట్రోట్టింగ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నట్లు చెప్పారు. అనేక దేశాల్లో ఈ సినిమా యొక్క షూటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉండగా ఈ సినిమా ద్వారా పలు హాలీవుడ్ సంస్థలతో కూడా రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలానే ఇండియా తో పాటు హాలీవుడ్ కి చెందిన పలు నటులు కూడా ఇందులో బాగమయ్యే అవకాశం కనబడుతోంది. దీని ద్వారా తొలిసారిగా పాన్ ఇండియన్ ని మించి పాన్ వరల్డ్ మార్కెట్ ని సొంతం చేసుకోనున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొత్తంగా ఈ విధంగా ఒక్కో సినిమాతో నటుడిగా విశేషమైనటువంటి క్రేజ్ ని అద్వితీయమైనటువంటి ప్రేక్షకాభిమానుల ఆదరణని అలానే కోట్లాదిమంది ఫ్యాన్స్ యొక్క ప్రేమను అందుకుంటూ దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఇక మహేష్ బాబు సినీ జీవితం అనంతరం ఆయన పర్సనల్ జీవితాన్ని గురించి చెప్పుకుంటే మహేష్ మూడో సినిమా వంశీ లో ఆయనతో కలిసి జతకట్టినటువంటి నమ్రతని అనంతరం ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2000 సంవత్సరం వీరిద్దరూ కలిసి చేసిన వంశి సినిమా అక్టోబర్ లో విడుదలై పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక తర్వాత మహేష్ బాబు, నమ్రతతో కొన్నాళ్ల ప్రేమ అనంతరం 2005లో ఆమెను మహేష్ బాబు వివాహం చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం సాదాసీదాగా ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత వీరిద్దరికి కుమారుడు గౌతమ్ కృష్ణ 2006 ఆగష్టు 31న జన్మించాడు. అనంతరం వారికి సితార పాప 2012 జులై 20న జన్మించింది. ఆ విధంగా ఇద్దరు బిడ్డలతో హ్యాపీ లైఫ్ తో ప్రస్తుతం ఆనందంగా కొనసాగుతున్నారు మహేష్ బాబు.

ఇక తనకు 48 సంవత్సరాలు వయసున్నప్పటికీ కూడా మహేష్ బాబు యాక్టింగ్ లో గాని డ్యాన్సింగ్ లో ని గ్రేస్ ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా దూసుకెళ్తున్నారు. మరోవైపు మహేష్ బాబు ఎప్పుడు తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ వుంటారు. అలానే ఆయన గ్లామర్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమా రాజకుమారుడు లో ఎలా ఉన్నారో ప్రస్తుతం నటిస్తున్న గుంటూరు కారం లో కూడా అదే విధంగా యంగ్ ఏజ్ తో కనపడుతూ నేటి యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీనే అందిస్తున్నారు మహేష్. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ. 85 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. పాన్ ఇండియా హీరోలను మినహాయిస్తే రీజినల్ హీరోల పరంగా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు నిలుస్తారనేది అందరు ఒప్పుకోవాల్సిన విషయం.

అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ యువత అలానే ఏ,బి,సి, అనే తేడా లేకుండా కుల, మత, జాతి, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతీయ, లింగ, వయో బేధాలకు అతీతంగా అన్ని ఏరియాల్లో కూడా మహేష్ బాబుకి విశేషమైన క్రేజ్ వుంది. ఇక మహేష్ బాబు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని అనేక ప్రాంతాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇక మహేష్ బాబు నెట్ వర్త్ గురించి గనక మాట్లాడుకుంటే ఇప్పటికే ఆయనకి ఓవరాల్ గా ఆస్తుల పరంగా రూ.400 కోట్లకు పైగా స్థిరాస్తి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీల యొక్క కార్లతో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సంబంధించి రెండు విల్లాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా అయితే ఇటు సినిమాలతో పాటు అటు బ్రాండ్ అడ్వార్టైజ్మెంట్స్ తో కూడా కొనసాగుతున్నారు మహేష్. ఇక ఆయన ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల గురించి మాట్లాడుకుంటే థమ్స్ అప్ మొదలుకొని మౌంటెన్ డ్యూ వంటి సాఫ్ట్ డ్రింక్స్ తో పాటు అనేక ఇతర బ్రాండ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతానికి పైగా మహేష్ బాబు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సేవా దృక్పథం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన మహేష్ బాబు ఫౌండేషన్ తరుపున ఇప్పటికే దాదాపుగా 3000 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సా ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో సరికొత్త వెలుగు నింపారు మహేష్. ఆ విధంగా మానవతా దృక్పధంతో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఏర్పరిచినటువంటి బాటలో నడుస్తూ ఎందరికో కొత్త జీవితాన్ని అందిస్తూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తూ కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొత్తంగా అయితే నటుడిగా ఒక్కో సినిమాతో అద్వితీయమైనటువంటి క్రేజ్ ను సంపాదించుకొని కొనసాగటమే కాకుండా ఇటు వ్యక్తిగతంగా కూడా ఆదర్శమూర్తిగా కొనసాగుతున్నారు సూపర్ స్టార్. రాబోయే రోజుల్లో నటుడిగా మరిన్ని సంచలన విజయాలని మహేష్ బాబు అందుకోవాలని అలానే ఆయన కెరియర్ గ్రాఫ్ మరింతగా పెరగాలని కోరుకుందాం.

మహేష్ బాబు చదువు:

ఆయన చెన్నైలోని సెయింట్ బెడెస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ పాఠశాల నుండి విద్యను అభ్యసించారు. అలానే చెన్నైలోని లయోలా కళాశాలలో బి కామ్ చదివారు.
మహేష్ బాబు పేస్ బుక్ , ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియా వివరాలు :
మహేష్ బాబుకి 8. 3 మిలియన్ల మంది అనుచరులను కలిగివున్న ఇంస్టాగ్రామ్ ఖాతా (@urstrulyMahesh) వుంది. అతని ట్విట్టర్ ఖాతా (@urstrulyMahesh)కు దాదాపుగా 12.5 మిలియన్ల మంది అనుచరులు వున్నారు. అతను తన రాబోయే ప్రాజెక్టులు మరియు సినిమాల గురించి ఎక్కువగా ట్వీట్లు చేస్తారు. అతను యువర్స్ ట్రూలీ మహేష్ పేరుతో పేస్ బుక్ పేజీని కలిగి 15 మిలియన్ల మంది అభిమానులను కలిగి ఉన్నారు.

 

మహేష్ బాబు సినిమాల జాబితా:

1979 – నీడ
1983 – పోరాటం
1987 – శంఖారావం
1988 – బజార్ రౌడీ
1989 – గూఢచారి
1989 – కొడుకు దిద్దిన కాపురం
1990 – అన్న తమ్ముడు
1990 – బాల చంద్రుడు
1999 – రాజకుమారుడు
2000 – యువరాజు 2001 – వంశీ
2002 – మురారి
2002 – బాబీ
2003 – ఒక్కడు
2003 – నిజం
2004 – నాని
2004 – అర్జున్
2005 – అతడు
2006 – పోకిరి
2006 – సైనికుడు
2007 – అతిథి
2010 – ఖలేజా
2011 – దూకుడు
2012 – బిజినెస్ మ్యాన్
2013 – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2014 – వన్ నేనొక్కడినే
2014 – ఆగడు
2015 – శ్రీమంతుడు
2016 – బ్రహ్మోత్సవం
2017 – స్పైడర్
2018 – భరత్ అనే నేను
2019 – మహర్షి
2020 – సరిలేరు నీకెవ్వరూ
2022 – సర్కారు వారి పాట
మహేష్ బాబు గెలుచుకున్న అవార్డులు:
ఉత్తమ నటుడిగా సినీ మా అవార్డులు:
ఒక్కడు, దూకుడు, నేనొక్కడినే,
మహేష్ బాబు గెలుచుకున్న ఫిలింఫేర్ అవార్డులు:
ఒక్కడు, పోకిరి,దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు IIFA అవార్డులు శ్రీమంతుడు
నంది అవార్డులు:
అర్జున్, నిజం, అతడు, దూకుడు, ఒక్కడు, శ్రీమంతుడు
సంతోషం ఫిలిం అవార్డ్స్: ఒక్కడు, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
జీ సినీ అవార్డ్స్ తెలుగు:
మహర్షి
సౌత్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్:
మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు
మహేష్ బాబు విజయాలు:
బాక్సాఫీస్ వసూళ్ళలో అత్యద్భుత విజయాన్ని సాధించిన అతి కొద్దిమంది నటుల్లో మహేష్ బాబు ఒకరు. అతని కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పటికీ, దాదాపు అతని అన్ని సినిమాలు ప్రతి సంవత్సరం కొత్త రికార్డుని సృష్టిస్తాయి. చిన్న వయసులోనే మొదలుపెట్టి 43 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
మహేష్ బాబుకి ఇష్టమైనవి:
ఆహార పదార్థాలు:
దోశ,
ఇడ్లి
పిజ్జా
ఇష్టమైన విహార ప్రదేశాలు:
మనాలి,
గోవా,
పారిస్
మాల్దీవులు
ఇష్టమైన కార్లు:
ఆడి ఇ-ట్రాన్.,
రేంజ్ రోవర్,
బిఎండబ్ల్యు 730ఎల్ డి,
లాంబోర్గిని గల్లర్డో,
మెర్సిడెస్ జిఎల్ క్లాస్,
టొయోటా ల్యాండ్ క్రూయిజర్ వి8.
ఇష్టమైన నటులు:
కృష్ణ ఘట్టమనేని,
శ్రీదేవి,
షారుఖ్ ఖాన్,
మాధురి దీక్షిత్,
కమల్ హాసన్,
పాల్ వాకర్
ఇష్టమైన సినిమాలు:
 2001: ఎ స్పేస్ ఒడిస్సి
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్
చాందిని
పచ్చని కాపురం
సాగర సంగమం
బంగారు భూమి
మహేష్ బాబు ఆస్తులు :
అతను మరియు అతని కుటుంబం హైదరాబాద్ లోని జూబిలీహిల్స్ లోని నాగరిక ప్రాంతంలో నివసిస్తున్నారు. బెంగళూరు లో కూడా ఆయనకు కోట్ల ఆస్తులున్నట్లు తెలిసింది. అతని వద్ద బిఎండబ్ల్యు 730ఎల్ డి. రూ. 2.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ మరియు రూ. 1.1 కోట్ల విలువైన ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు వంటి విలాసవంతమైన కార్లు వున్నాయి. ఆయన దుబాయ్, సింగపూర్, లండన్ మరియు న్యూయార్కులలో అనేక బంగ్లాలను కూడా కలిగి వున్నారు.
మహేష్ బాబు గురించి అంతగా తెలియని నిజాలు:

ఆయన టైమ్స్ అఫ్ ఇండియా ద్వారా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్లను అధిగమించారు. అతనికి తెలుగు బాగా చదవడం రాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుడు మహేష్ బాబు. తొలి చిత్రం నీడలో 4 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనను ప్రారంభించాడు. ఎక్కువగా, అతని చిత్రాలను తమిళంలో నటుడు విజయ్ రీమేక్ చేసారు. అతని చిత్రం పోకిరి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పోషించిన వాంటెడ్ రీమేక్ చేయబడింది.

మహేష్ బాబు నుండి నేర్చుకోవలిసిన జీవిత పాఠాలు:
నమ్రత, అతను మీడియాలో మరియు అతని వ్యక్తిగత జీవితంలో కూడా వినయపూర్వకమైన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన టాలీవుడ్ లో సూపర్ స్టార్ అయినప్పటికీ పూర్తిగా అహంకారానికి దూరంగా ఉంటాడు. అందుకే ఇప్పటివరకు రాజమౌళి లాంటి చాలా మంది ప్రముఖ దర్శకులు ఆయనతో పని చేయాలని అనుకుంటున్నారు. ఉన్నతస్థాయికి చేరుకున్న తర్వాత కూడా వినయంగా ఉండాలని ఆయన మనకు భోదిస్తాడు. పాత్రలతో ప్రయోగాలు చేయడం. అతను సవాలు చేసే పాత్రలను చేయటం ద్వారా నటుడిగా తనను తాను నిరంతరం అభివృద్ధి చేసుకున్నాడు. దీనితో ఒక్కసారి కాదు తన సినిమాలు విడుదలైన ప్రతీసారి నిరూపించుకునేలా చేసింది. నైపుణ్యాలు వున్నా వ్యక్తులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలి మరియు తమలో తాము మెరుగైన సంస్కరణను అభివృద్ధి చేసుకోవడానికి కొత్త మార్గాలను ప్రయత్నించాలి అని మహేష్ బాబు తరచు చెప్తూ ఉంటారు.
మహేష్ బాబు వ్యక్తిగత జీవితం :
పుట్టిన తేదీ 9 ఆగష్టు 1975వ సంవత్సరం, వయస్సు 2023 నాటికి 48 సంవత్సరాలు
జన్మస్థలం : చెన్నై, తమిళనాడు, భారతదేశం జాతీయత భారతీయ మతం హిందూ
హాబీలు: పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం
కుటుంబం: అతని కుటుంబంలో అతని తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా, అతని అన్నలు రమేష్ బాబు, పద్మావతి, మంజుల, నరేష్ మరియు చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. అతను నమ్రతా శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు. సితార మరియు గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్కూల్: సెయింట్ బెడ్స్ స్కూల్, చెన్నై
కళాశాల: లొయొలా కళాశాల, చెన్నై
విద్యార్హత: గ్రాడ్యుయేట్
ఎత్తు: 1.83 మీ
మహేష్ బాబు జాతకం: రాశిచక్రం లియో

పుట్టిన సంఖ్య: 9విధి సంఖ్య 8అదృష్ట సంఖ్యలు 3,6,9

Mahesh Babu Biography Net worth Family Secrets

అవార్డులు, సన్మానాలు, విజయాలు:
1999 రాజకుమారుడు చిత్రానికి గాను ఉత్తమ నూతన నంది అవార్డు
2003: మురారి మరియు టక్కరి దొంగ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
2003: ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు – ఒక్కడు చిత్రానికి తెలుగు
2006: ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు – పోకిరి చిత్రానికి తెలుగు
2012: నంది అవార్డుల వేడుకలో దూకుడు చిత్రానికి ఉత్తమ నటుడు మరియు ఫిలిం ఫేర్ ఉత్తమ అవార్డు 59వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 1వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకల్లో నటుడు – తెలుగు
2012: 60వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 2వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకల్లో బిజినెస్ మ్యాన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ చేయబడింది.
2013: 61వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక
2015: 63వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు శ్రీమంతుడు సినిమా
2019: ఉత్తమ నటుడిగా నాల్గవ SIIMA అవార్డు – తెలుగు
2010లో TIME మ్యాగజైన్ భారతదేశంలోని మోస్ట్ డిసైరబుల్ మెన్ జాబితాలో పన్నెండవ స్థానంలో, 2011లో ఐదవ స్థానంలో మరియు
2012లో రెండవ స్థానంలో ఉంది.
2017: భారతీయ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మరియు హ్రితిక్ రోషన్ లతో పాటు జాబితాలో స్థానం పొందారు.
మహేష్ బాబు గురించి అంతగా తెలియని కొన్ని వాస్తవాలు:
మహేష్ బాబు ప్రముఖ భారతీయ నటుడు మరియు నిర్మాత అతను. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు మరియు అతని దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాడు. మురారి (2001), ఒక్కడు (2003), అతడు (2005), పోకిరి (2006), ఖలేజా (2010), దూకుడు (2011), వన్ నేనొక్కడినే (2014), శ్రీమంతుడు (2015) వంటి తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. మరియు భరత్ అనే నేను (2018), అతను జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అనే ఫిలిం ప్రొడక్షన్ హౌస్ యజమాని. అతను ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, మూడు CineMAA అవార్డులు మరియు ఒక IIFA ఉత్సవం అవార్డు గ్రహీత. అతను తమిళనాడులోని చెన్నైలో తన అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. నివేదిక ప్రకారం, అతని తండ్రి తన సినిమాలతో బిజీగా ఉన్నందున అతని విద్య పనితీరు అతని అన్నయ్య రమేష్ బాబు పై ఉంది.
తన చిన్నతనంలో, మహేష్ బాబు తన సోదరులు మరియు సోదరీమణులతో మద్రాసులోని వీజీపీ గోల్డెన్ బీచ్లో క్రికెట్ ఆడేవారు.మహేష్ బాబు తమిళ నటుడు విజయ్ కాలేజీ రోజుల్లో అతని క్లాసుమేట్. మహేష్ బాబు తెలుగు దర్శకుడు ఎల్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు.అధికారిక విద్యాబ్యాసం పూర్తయ్యాక మహేష్ బాబుకు తెలుగు చదవడం, రాయడం రాదు, అయినప్పటికీ, అతను భాషను అనర్గళంగా మాట్లాడగలడు.రమేష్ బాబు, అతని అన్నయ్య, తీవ్రమైన కాలేయ సమస్యలతో బాధపడుతూ 8 జనవరి 2022న హైదరాబాద్ లో మరణించారు. సుప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ సభ్యుడు, గల్లా జయదేవ్ మహేష్ బాబు బావ. మరియు అతని అక్క పద్మావతి భర్త. అతని అక్క, మంజుల తెలుగు సినిమా దర్శకురాలు మరియు నిర్మాత, అతని చెల్లెలు, ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు.
సుధీర్ బాబు ప్రియదర్శినిని వివాహం చేసుకున్న తర్వాత బాబు కుటుంబం సినీ పరిశ్రమలోకి ప్రేవేసించింది. అతని తండ్రికి విజయ నిర్మల రెండవ భార్య. ఈమే ప్రసిద్ధ తెలుగు నటి, విజయ నిర్మలకు నరేష్ అనే కుమారుడు వున్నాడు. అతను తెలుగు నటుడు మరియు మహేష్ బాబు యొక్క సవతి సోదరుడు. మహేష్ బాబు 2005లో నటి నమ్రతా శిరోద్కర్ తో వివాహానికి ముందు నాలుగేళ్ల సంబంధంలో వున్నారు. ముంబై లో అతడు చిత్రం చిత్రీకరణ సమయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. నివేదిక ప్రకారం, నమ్రత రెండవ డెలివరీకి ముందు వారు తమ మూల కణాలను స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో భద్రపరిచారు. మరియు భవిష్యత్తు కోసం మెరుగైన రోగనిరోధక శక్తిని అందించారు. నమ్రత మహేష్ బాబు కంటే మూడేళ్లు పెద్దది, మరియు కొన్ని మీడియా వర్గాల ప్రకారం, మొదట మహేష్ బాబు తండ్రి వారి సంబంధానికి అంగీకరించలేదు.
అయితే మహేష్ సోదరి, మంజుల మహేష్, నమ్రత వివాహం కోసం కృష్ణ ఘట్టమనేనిని ఒప్పించారు. చిన్నతనంలో మహేష్ తన తండ్రి కలిసి సినిమా సెట్స్ కి వెళ్ళేవాడు. 1979లో అతను తన అన్నయ్యతో కలిసి నీడ సినిమా సెట్స్ కి వెళ్లడం జరిగింది. అక్కడ మహేష్ కి చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రను ఆ సినిమా దర్శకుడు దాసరి నారాయణ రావు ఆఫర్ చేసారు. మహేష్ నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేయడం ప్రారంభించాడు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ తన వార్షిక ఆదాయంలో ముప్పై శాతాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తున్నాడు. ఆగష్టు 2013లో, అతను ఫర్హాన్ అక్తర్ నేతృత్వంలో మెన్ ఎగైనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినషన్ (MARD) క్యాంపెయిన్ లో భాగమయ్యాడు. ఈ ప్రచారానికి సంబందించిన థీమ్ కవితను జావేద్ అక్తర్ రాశారు.
మరియు తెలుగు భాషలో మహేష్ బాబు చదివారు. అతను హీల్-ఎ-చైల్డ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థకు గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. ఇది 2013 నుండి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అక్టోబర్ 2014లో, హుద్ హుద్ తుఫాను సమయంలో, అతను రూ. 25 లక్షలను అందించాడు. ధ్వంసమైన ప్రాంతాల పునరాభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి. 2015 ఫిబ్రవరిలో, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు మరియు సరైన డ్రైనేజి వ్యవస్థలు వంటి సమాజంలో ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అతను తన స్వగ్రామమైన ఆంధ్ర ప్రదేశ్ లోని బుర్రెపాలెం ను, అలానే తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొత్తంగా నటుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డంతో, మనసున్న నటుడిగా మంచి పేరుతో కొనసాగుతున్నారు.

 

Mahesh Babu Biography Net worth Family Secrets

 

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mahesh Babu Biography Net worth Family Secrets