Tollywood Top 10 Music Directors l టాలీవుడ్ టాప్ 10 మ్యూజిక్ డైరెక్టర్స్ 2024

Written by Movie Updates

Updated on:

Tollywood Top 10 Music Directors:- తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేక వేల సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇక అందులో కొన్ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించగా మరికొన్నీ పెద్దగా వారిని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఏ సినిమాలో అయినా కథ, కథనాలతో పాటు మ్యూజిక్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మ్యూజిక్ తో ఎన్నో గొప్ప పాటలు మనకు అందించిన ఎందరో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సాంగ్స్ తో పాటు నేటి కాలంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా తాజాగా వచ్చిన అనేక సినిమాలు మంచి సాంగ్స్ తో పాటు బ్యాక్ స్కోర్ బాగుంటే కథ కథలతో పాటు వాటికి కూడా ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఏ జనరేషన్ కి ఆ జనరేషన్ లో అనేకమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ వచ్చారు వెళ్లారు. అయితే అందులో ప్రస్తుతం టాప్ 10 ప్లేస్ లో ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

1. ఇళయరాజా :-

ముఖ్యంగా టాలీవుడ్ లో నాటి తొలితరం మధుర గాయకుడు సంగీత దర్శకుడు ఘంటసాల తరువాత ఇక్కడ అనేక సక్సెస్ఫుల్ సినిమాలు అలానే ఎన్నో గొప్ప గొప్ప పాటలు అందించి ఆడియన్స్ ఫ్యాన్స్ యొక్క మదిని దోచిన ఘనత మొదటగా ఇళయరాజా కే దక్కుతుంది. 1980 ల నుండి తెలుగులో ఆయన అనేక సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి తనకంటూ ప్రత్యేక శైలిని, క్రేజ్ ని అందుకున్నారు. అయితే ఇళయరాజా సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పని చేసినప్పటికీ ఆయన గాయకుడిగా పాడిన పాటలు మాత్రం చాలా చాలా తక్కువ అనే చెప్పాలి. నిజానికి తెలుగు లో మాత్రమే కాదు తమిళ్ సహా అనేక భాషల్లో వందల సినిమాలు చేసిన ఇళయరాజాకు దేశవిదేశాల్లో ఎంతో గొప్ప పేరు ఉంది.

ఆయన పాట నిజముగా జోల పాట లానే ఉంటుందని అనేకులు అంటుంటారు అనేది అతిశయోక్తి కాదు.ఇక ఇటీవల పలు సినిమాలకు ఆయన సంగీతం అందిస్తూ ఇంకా ఆడియన్స్ ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో వంశీ సినిమాలకు ఇళయరాజా అందించిన సాంగ్స్ ఎంతో ప్రత్యేకతని కలిగి ఉండడడంతో పాటు ఎంతో హిట్ అయ్యేవి, వారిద్దరి కాంబినేషన్ కి అందరిలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇటీవల కాలంలో గుండెల్లో గోదారి, అనుమానాస్పదం, సన్ ఆఫ్ ఇండియా, రంగమార్తాండ, గమనం, కస్టడీ, సినిమాలకు వర్క్ చేసారు. దాదాపుగా ఆ మూవీస్ అన్నిట్లో ఇళయరాజా అందించిన సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అప్పటి అందరు నటీనటులకు ఇళయరాజా ఎన్నో గొప్ప సాంగ్స్ అందించారు. కాగా ప్రస్తుతం తెలుగుతో పాటు పలు ఇతర భాషల సినిమాలతో ఇళయరాజా ఎంతో బిజీగా ఉన్నారు.

2. ఏ ఆర్ రహమాన్ :-

తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాదు పలు ఇతర భాషల్లో కూడా అనేక సినిమాలు వర్క్ చేసి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుని ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు ఏ ఆర్ రహమాన్. ముఖ్యంగా అప్పట్లో తెలుగు, హిందీ, తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసారు రహమాన్. ఇటీవల ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి, తరుణ్ తో నీ మనసు నాకు తెలుసు, శంకర్ బాయ్స్, నాగ చైతన్య ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో ఇలా పలు సినిమాలు చేసారు.

అయితే తెలుగులో రహమాన్ సక్సెస్ఫుల్ సినిమాలు పెద్దగా అందుకోనప్పటికీ మ్యూజికల్ గా ఆయన అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అత్యద్భుతం అనే చెప్పాలి. అతి త్వరలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన తెరకెక్కించనున్న స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. ఇక రహమాన్ అందించే సాంగ్స్ ఎంతో ట్రెండీ, క్లాసికల్ స్టైల్ లో ఉంటూ యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అలానే సంగీతంతో పాటు పలు పాటలు కూడా పడుతూ ఉండే రహమాన్ ఇటీవల అనేక గొప్ప గొప్ప పాటలు పాడి సింగర్ గా కూడా మంచి పేరు అందుకున్నారు.

3. ఎమ్ ఎమ్ కీరవాణి :-

తెలుగు సినిమా పరిశ్రమలో 1980 ల కాలం నాటి నుండి ఇప్పటివరకు కూడా వరుసగా అనేక సినిమాలతో మంచి క్రేజ్ తో అత్యద్భుతమైన సాంగ్స్ తో దూసుకెళ్తున్నారు ఎం ఎం కీరవాణి. ఇక ఆయన సినిమాలు 1990లలో కూడా మరింత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావుతో కీరవాణి గారిది ఎంతో గొప్ప అనుబంధం. వీరిద్దరి కలయికలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో పాటు అనేక సోషల్ చిత్రాలు కూడా పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో పాటు మ్యూజికల్ గా కూడా సెన్సేషన్ సృష్టించాయి.

అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు, ఘరానా మొగుడు, సుందరకాండ, అల్లరి మొగుడు, ఆపద్బాంధవుడు, మాతృదేవుభావ, ఇలా చెప్పుకుంటూ పోతే కీరవాణి గారు అందించిన అద్భుతమైన సాంగ్స్ ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇక తన సోదరుడు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి యొక్క ప్రతి సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తారు. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు అలానే ఆర్ఆర్ఆర్ మూవీస్ కి కీరవాణి అద్భుతమైన సంగీతం నేపధ్య సంగీతం అందించి గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఏకంగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర, పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, SSMB29 మూవీస్ చేస్తున్నారు కీరవాణి.

Tollywood Top 10 Music Directors

4. మణిశర్మ :-

తెలుగు సినిమా పరిశ్రమలో ఇళయరాజా తరువాత అనేకమంది సంగీత దర్శకులు వచ్చారు వెళ్లారు. అయితే వారిలో ఒకింత ఆడియన్స్ నుండి విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో ప్రథముడు మణిశర్మ. ఆయనని అందరూ మెలోడీ బ్రహ్మ అని అంటూ ఉంటారు. 2000వ దశకంలో దాదాపుగా ఏడాదికి ఎన్నో సినిమాలు చేస్తూ కొనసాగిన మణిశర్మ పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరు హీరోల సినిమాలకు వర్క్ చేసి ఎన్నో గొప్ప గొప్ప పాటలు అందించారు. అయితే విచిత్రం ఏమిటంటే ఇప్పటివరకు తన కెరీర్ లో మణిశర్మ ఒక్క పాట కూడా పాడలేదు. తనకు సంగీతం అందించడం మాత్రమే తెలుసునని, పాడడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని ఆయన చెప్తూ ఉంటారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆయన అందరికీ భారీ బ్లాక్ బస్టర్స్ ని అందించారు. ముఖ్యంగా మణిశర్మ సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. మణిశర్మ అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సినిమాల్లో ఇంద్ర, ఒక్కడు, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఒక్కడు, ఖుషి, పోకిరి, ఠాగూర్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి.

నిజానికి ఆయనకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేనప్పటికీ ఒకవేళ మంచి ఛాన్స్ లభిస్తే మళ్ళి మరింతగా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మణిశర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ తో పూరి జగన్నాథ్ తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 అయిన డబుల్ ఇస్మార్ట్ కి ఆయన సంగీతం అందిస్తున్నారు.

5. దేవిశ్రీప్రసాద్ :-

తెలుగు సినిమా పరిశ్రమలోని అద్భుతమైన సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ఆనందం, సొంతం వంటి సినిమాలు ఆయనకి విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్. అక్కడి నుండి మెల్లగా ఒక్కో సినిమా అవకాశం అందుకుంటూ కొనసాగిన దేవిశ్రీ కూడా దాదాపుగా అందరు పెద్ద చిన్న హీరోల సినిమాలకు పని చేసి అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరిగింది.

వన్ నేనొక్కడినే, జల్సా, అత్తారింటికి దారేది, లెజెండ్, ఆర్య, ఆర్య 2, జగడం, శ్రీమంతుడు, గబ్బర్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకు దేవిశ్రీ సూపర్ పాటలు అందించారు. ఇక తన సినిమాల్లో కొన్ని పాటలు కూడా మధ్యలో ఆయన పాడుతుంటారు. ఇక ఇటీవల పుష్ప మూవీ సాంగ్స్ తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, తండేల్ సహా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

6. ఎస్ థమన్ :-

ఇక ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకట్టుకునే మ్యూజిక్ టాలెంట్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆడియన్స్ ఫ్యాన్స్ లో ఎంతో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న వారిలో ఎస్ థమన్ కూడా ఒకరు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆలా వైకుంఠపురములో మూవీ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ థమన్ కు లభించింది. ఆ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు నేషనల్ వైడ్ గా థమన్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

అలానే ఆ మూవీకి గాను థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుత థమన్ చేతిలో ఎన్నో క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. వాస్తవానికి కెరీర్ బిగినింగ్ లో మెల్లగా ఒక్కో సినిమా చేస్తూ ఆడియన్స్ ని అలరించిన థమన్ కి అప్పట్లో రవితేజ నటించిన కిక్ మూవీ సక్సెస్ కొట్టడంతో పాటు అందులోని సాంగ్స్ బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుండి ఒక్కో అవకాశాన్ని వినియోగించుకుని దోకుడు, బృందావనం, ఆగడు, బిజినెస్ మ్యాన్ ఇలా అనేక బ్లాక్ బస్టర్ మ్యూజికల్ సెన్సేషనల్ మూవీస్ చేస్తూ కొనసాగారు థమన్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నడిచిన గుంటూరు కారంతో మరొక సక్సెస్ సొంతం చేసుకున్నారు థమన్.

Tollywood Top 10 Music Directors

7. మిక్కీ జె మేయర్ :-

తెలుగు సినిమా పరిశ్రమలోని పేరెన్నికగన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో మిక్కీ జె మేయర్ కూడా ఒకరు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన టాలీవుడ్ లో పెద్ద క్రేజ్ సొంతం చేసుకున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థ పై శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు మ్యూజికల్ గా కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ అనంతరం ఒక్కసారిగా తెలుగులో అనేక సినిమా అవకాశాలు అందుకున్నారు మిక్కీ జె మేయర్.

ఇక ఆ తరువాత కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం, ముకుంద, లైఫ్ ఈఫ్ బ్యూటిఫుల్ ఇలా అనేక సినిమాలకు సూపర్ మ్యూజిక్ అందించి అందరిలో తనకంటూ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేక ఇమేజ్ అందుకున్నారు మిక్కీ. ఇటీవల గాండీవధారి అర్జున, రామబాణం, శ్యామ్ సింగరాయ్, శ్రీకారం, అన్ని మంచి శకునములే, పెద్ద కాపు సినిమాలకు మంచి మ్యూజిక్ అందించారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.

8. హారిస్ జయరాజ్ :-

వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా విక్టరీ వెంకటేష్ హీరోగా కరుణాకరన్ తెరకెక్కించిన వాసు మూవీతో ఎంట్రీ ఇచ్చారు హారిస్ జయరాజ్. అప్పట్లో ఆ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు మ్యూజికల్ గా అందరినీ అలరించింది. అనంతరం  బాబు హీరోగా గుణశేఖర్ తీసిన సైనికుడు, ప్రభాస్ నటించిన మున్నా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్, మరొక్కసారి మహేష్ హీరోగా తెరకెక్కిన స్పైడర్, విశాల్ సెల్యూట్, ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇలా పలు సినిమాలు చేసి తనకంటూ టాలీవుడ్ ఆడియన్స్ లో గొప్ప పేరు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు హారిస్ జయరాజ్. ఇక తమిళ్ లో కూడా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు హారిస్ జయరాజ్.

9. యువన్ శంకర్ రాజా :-

ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు అయిన యువన్ శంకర్ రాజా మొదట అటు తమిళ్ లో సంగీత దర్శకుడిగా పరిచయం అయి అక్కడ పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు. అనంతరం తొలిసారిగా తెలుగులో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేషు మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ కి సూపర్ సాంగ్స్ అందించారు. ఆ తరువాత అదంతే అదో టైపు, 7జి బృందావన్ కాలనీ సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వాటిలో 7జి బృందావన్ కాలనీ మూవీ తో పాటు సాంగ్స్ కూడా అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఇక అల్లు అర్జున్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా కరుణాకరన్ తెరకెక్కించిన హ్యాపీ మూవీకి మంచి మ్యూజిక్ అందించి ఆకట్టుకున్నారు యువన్. ఆపైన రామ్, ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే, ఓయ్ సినిమాలు చేసారు. అవి కూడా బాగా సక్సెస్ అయి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా మూవీకి కూడా మంచి సాంగ్స్ అందించారు. అలానే సుధీర్ బాబు శివ మనసులో శృతి, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, గోపీచంద్ ఆక్సిజన్, తో పాటు తాజగా నాగచైతన్య హీరోగా రూపొందిన కస్టడీ మూవీస్ కి వర్క్ చేసారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు యువన్ శంకర్ రాజా.

10. అనూప్ రూబెన్స్ :-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలిసారిగా తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా రూపొందిన జై మూవీ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు అనూప్ రూబెన్స్. ఏ మూవీ అప్పట్లో మంచి విజయం అందుకోవడంతో పాటు సాంగ్స్ కూడా అలరించాయి. ఆ తరువాత అది నటించిన ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలతో పాటు నితిన్ నటించిన గుండె జారీ గల్లంతయ్యిందే, అక్కినేని హీరోలు నటించిన మనం, గోపీచంద్ లౌక్యం, పిల్ల నువ్వు లేని జీవితం, పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, నాగార్జున బంగార్రాజు, వెంకటేష్ దృశ్యం 2 ఇలా అనేక సినిమాలకు సూపర్ గా మ్యూజిక్ ని అందించడంతో పాటు కెరీర్ పరంగా సక్సెస్లు సొంతంక్ చేసుకున్నారు. ఇక సింగర్ గా కూడా ఆకట్టుకున్న అనూప్, తన సినిమాల్లోని పలు పాటలను పాడారు. ఇక ప్రస్తుతం పలు సినిమా అవకాశాలతో బిజీగా కొనసాగుతున్నారు అనూప్.

Tollywood Top 10 Music Directors

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tollywood Top 10 Music Directors

1 thought on “Tollywood Top 10 Music Directors l టాలీవుడ్ టాప్ 10 మ్యూజిక్ డైరెక్టర్స్ 2024”

Comments are closed.