Mahesh Babu Superhit Movies l మహేష్ బాబు వరుస సూపర్ హిట్ మూవీస్ 2024

Written by Movie Updates

Updated on:

Mahesh Babu Superhit Movies:- టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

Mahesh Babu Superhit Movies

విషయం ఏమిటంటే, కెరీర్ పరంగా ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎమోషనల్ మూవీ మహర్షి, అనిల్ రావిపూడి తీసిన ఎమోషనల్ మాస్ యాక్షన్ మూవీ సరిలేరు నీకెవ్వరు,మూవీస్ సక్సెస్ తో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్, ఇటీవల పరశురామ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ మెసేజ్ మూవీ సర్కారు వారి పాట తో మరొక విజయాన్ని అందుకున్నారు.

Mahesh Babu Superhit Movies

ఇక తాజాగా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం విజయంతో మొత్తంగా వరుసగా ఐదు సక్సెస్ లు సొంతం చేసుకున్న మహేష్, అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 తో కూడా సక్సెస్ అందుకుంటే కెరీర్ పరంగా ఆయన తొలిసారిగా డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్లే అని తెలుస్తోంది. ఇప్పటికే కెరీర్ పరంగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ హీరో తప్పకుండా డబుల్ హ్యాట్రిక్ అందుకుంటారని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh is one more movie away from the double hattrick

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mahesh Babu Superhit Movies

1 thought on “Mahesh Babu Superhit Movies l మహేష్ బాబు వరుస సూపర్ హిట్ మూవీస్ 2024”

  1. Thank you, I have just been looking for information approximately
    this topic for ages and yours is the best I have found out till
    now. But, what concerning the conclusion? Are you certain in regards to the source?

Comments are closed.