Pawan Kalyan Biography Net worth Family Secrets l పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ నెట్ వర్త్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024

Written by Movie Updates

Updated on:

Pawan Kalyan Biography Net worth Family Secrets:- ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ యాక్టర్ గా సూపర్ క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇక కెరీర్ బిగినింగ్ నుండి నటుడిగా ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్ ని అలానే ఆడియన్స్ ఫ్యాన్స్ యొక్క ఆదరణ ని అందుకుంటూ  దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఓవైపు నటుడిగానే కాక మరోవైపు రాజకీయ నాయకుడిగా 2014 లో సొంతం గా జనసేన పార్టీ నెలకొల్పిన పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ కొనసాగుతున్నారు. టాలీవుడ్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారికి చిన్న తమ్ముడు అయిన కొణిదెల కళ్యాణ్ బాబు, 2 సెప్టెంబర్ 1971లో తల్లి అంజనాదేవి, తండ్రి కొణిదెల వెంకట్ రావు లకు జన్మించారు.

అప్పట్లో కానిస్టేబుల్ గా తండ్రి వెంకట్రావు పని చేస్తున్న సమయంలో అన్నయ్య చిరంజీవి, మరొక అన్నయ్య నాగబాబు తో కలిసి తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసారు పవన్ కళ్యాణ్. ఆపైన తన వదిన గారైన సురేఖ గారి మాటల ప్రకారం సినిమాల్లోకి రావాలని భావించిన పవన్ కళ్యాణ్, అనంతరం సినీ గురువు సత్యానంద్ గారికి వద్ద ఫైట్స్, యాక్టింగ్, డ్యాన్స్ లలో ఎంతో శిక్షణ తీసుకుని అనంతరం 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఇక తన చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్, కరాటే వంటి వాటి పై ఎంతో మక్కువ కలిగిన పవన్ కళ్యాణ్, అనంతరం ఒకానొక సందర్భంలో వాటికి సంబందించిన ప్రదర్శన ఇచ్చారు. అప్పుడే ఆయనకి పవన్ అని పేరు లభించింది.

అప్పటివరకు అందరూ ఆయనని కళ్యాణ్ బాబు అని పిలవగా, అనంతరం పవన్ కళ్యాణ్ గా ఆయన పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మొదటి నుండి కూడా తన తల్లితండ్రులు, సోదరులు, సోదరీమణులపై ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన పవన్ కళ్యాణ్, ఎల్లప్పుడూ వారి మాటల ప్రకారమే నడుచుకునే వారు. అలానే చిన్నప్పటి నుండి ఎంతో మంచి సేవా భావం గల పవన్, ఎవరైనా సమస్యల్లో ఉంటె వేంటనే వారిని తన వంతుగా ఆదుకుని ఆర్ధికంగా చేయూతనిచ్చేవారు. ఆ విధంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో ముందుకి నడిచిన పవర్  స్టార్ పవన్ కళ్యాణ్, తొలిసారిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా సినీ రంగప్రవేశం చేసి ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్నారు.

ఆ మూవీలో సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా నటించగా ఇవివి సత్యనారాయణ తెరకెక్కించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రిలీజ్ అనంతరం మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక నటుడిగా ఫస్ట్ మూవీతోనే తన అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు పవన్. అప్పట్లో బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకున్న ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీకి ఇది ఫ్రీ మేక్ గా తెరకెక్కింది. అనంతరం తన రెండవ మూవీ గోకులంలో సీతలో నటించారు పవన్. ఈ మూవీని ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించగా అప్పటి బ్యూటీ రాశి హీరోయిన్ గా నటించారు.

Pawan Kalyan Biography Net worth Family Secrets

హరీష్, కోట శ్రీనివాస రావు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా పర్వాలేదన్పించింది. అనంతరం దేవయాని హీరోయిన్ గా భీమనేని శ్రీనివాస రావు తో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ సుస్వాగతం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఏ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ తొలిప్రేమ. ఈ మూవీలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా వాసుకి పవన్ కు చెల్లెలిగా కనిపించారు. నగేష్, నర్రా వెంకటేశ్వరరావు, సంగీత, వేణుమాధవ్, ఆలీ తదితరులు కీలక పాత్రలు పోషించిన తొలిప్రేమ మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకుని హీరోగా యువతలో పవన్ కు మంచి పేరు తీసుకువచ్చింది.

ఆపైన పీఏ అరుణ్ ప్రసాద్ తో పవన్ చేసిన మూవీ తమ్ముడు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటి ప్రీతీ జింగ్యానీ తెలుగుకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన తమ్ముడు కూడా బాగానే సక్సెస్ అయింది. ఈ మూవీలో అచ్యుత్, మల్లిఖార్జున రావు, సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించగా రమణ గోగుల సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన మూవీ బద్రి.

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ నటి అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో కోట శ్రీనివాస రావు, ప్రకాష్ రాజ్, ఆలీ నటించారు. బద్రి కూడా రిలీజ్ అనంతరం పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని హీరోగా పవన్ కు బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపైన ఎస్ జె సూర్య తో పవన్ నటించిన మూవీ ఖుషి. భూమిక హీరోయిన్ గా నటించినా ఖుషి మూవీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి అప్పట్లో బాగా సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ కి హీరోగా బ్రేక్ నిచ్చిన ఖుషి మూవీలో సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. ఇక ఈ మూవీ ద్వారా తొలిసారిగా మణిశర్మ తో కలిసి వర్క్ చేసారు పవన్.

అనంతరం కొంత గ్యాప్ తీసుకుని మూడేళ్ళ విరామం తరువాత సొంతంగా తన డైరెక్షన్ లో జానీ మూవీ చేసారు పవన్. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద డైజెస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో రేణు దేశాయి హీరోయిన్ గా నటించగా రమణ గోగుల సంగీతం అందించారు. అనంతరం వీరశంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన మూవీ గుడుంబా శంకర్. ఈ మూవీలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే గుడుంబా శంకర్ అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆపైన మరొక్కసారి కరుణాకరన్ తో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ బాలు. ఈ మూవీలో శ్రియ, నేహా ఒబేరాయి హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే బాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

అనంతరం తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ బంగారం. ఈ మూవీలో మీరా చాప్రా హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో ముకేశ్ ఋషి నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన బంగారం కూడా ఫ్లాప్ అయింది. ఆ తరువాత మరొక్కసారి భీమనేని శ్రీనివాస రావు తో పవన్ చేసిన మూవీ అన్నవరం. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఇందులో ఆసిన్ హీరోయిన్ గా నటించగా రమణ గోగుల సంగీతం అందించారు. ఇందులో పవన్ కు చెల్లెలిగా ప్రేమిస్తే సంధ్య కనిపించారు. అయితే ఇది కూడా పెద్దగా ఆడలేదు. రెండేళ్ల గ్యాప్ అనంతరం తొలిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ జల్సా.

ఈ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం, ఉత్తేజ్, ఆలీ నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన జల్సా మూవీ సాంగ్స్ ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఆపై మళ్ళి రెండేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మరొక్కసారి ఖుషి దర్శకుడు ఎస్ జె సూర్య తో చేసిన మూవీ పులి. ఈ మూవీలో నికిషా పటేల్, హీరోయిన్ గా నటించగా ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. అయితే పులి మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆపైన తొలిసారిగా జయంత్ తో పవన్ కళ్యాణ్ చేసిన మూవీ తీన్ మార్. ఈ మూవీ ద్వారా తొలిసారిగా పవన్ తో కలిసి జోడి కట్టారు స్టార్ హీరోయిన్ త్రిష.

Pawan Kalyan Biography Net worth Family Secrets

పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లో కనిపించిన ఈమూవీ కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆపైన తమిళ దర్శకుడు విష్ణు వార్ధన్ తో పవన్ చేసిన మూవీ పంజా. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన పంజా కూడా బోల్తా కొట్టింది. సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అభిమాని అయిన హరీష్ శంకర్ తొలిసారిగా పవన్ తో చేసిన మూవీ గబ్బర్ సింగ్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించితిన్ ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో అజయ్, సుహాసిని, నాగినీడు, అభిమన్యు సింగ్ నటించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ మూవీ హీరోగా పవన్ కు కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ని అందించింది.

ఆ తరువాత మరొక్కసారి పూరి జగన్నాథ్ తో కలిసి కెమేరామ్యాన్ గంగ తో రాంబాబు మూవీ చేసారు పవన్. అయితే ఇది కూడా పెద్దగా ఆడలేదు. ఇక రెండో సారి త్రివిక్రమ్ తో పవన్ చేసిన మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కి రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద బాగా విజయవంతం అయింది. ఆ తరువాత తొలిసారిగా విక్టరీ వెంకటేష్ తో కలిసి పవన్ నటించిన మల్టి స్టారర్ మూవీ గోపాల గోపాల. ఈ మూవీలో శ్రీయా హీరోయిన్ గా నటించగా దీనిని కిషోర్ కుమార్ పార్ధసాని తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద గోపాల గోపాల యావరేజ్ విజయం అందుకుంది. ఆ తరువాత బాబీ దర్శకత్వంలో సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ చేసారు పవన్ కళ్యాణ్.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే రిలీజ్ అనంతరం సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ కూడా బోల్తా కొట్టింది. ఆపైన గోపాల గోపాల దర్శకుడు కిషోర్ కుమార్ తో పవన్ మరొక్కసారి చేసిన మూవీ కాటమరాయుడు. ఈమూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇది కూడా పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ తో పవన్ చేసిన మూవీ అజ్ఞాతవాసి. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం కెరీర్ పరంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత వేణు శ్రీరామ్ తో చేసిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో కన్పించారు.

ఆ తరువాత సాగర్ కె చంద్ర తో పవన్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా కీలక పాత్రలో దగ్గుబాటి రానా కనిపించారు. ఇక ఇటీవల తొలిసారిగా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పవన్ చేసిన మూవీ బ్రో. ఈ మూవీని సముద్రఖని తెరకెక్కించారు. అయితే బ్రో కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సుజీత్ తో ఓజి, క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్. ఈ మూడింటి పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక 2014 లో జనసేన పార్టీ నెలకొల్పిన పవన్, ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే అప్పట్లో టిడిపి పార్టీకి మాత్రం సపోర్ట్ చేసారు.

కాగా జనసేన సపోర్ట్ తో తొలిసారిగా విభజిత నూతన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ గెలిచి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క సీట్ దక్కించుకున్నారు. అలానే తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల కూడా ఘోరంగా ఓడిపోయారు. ఇక త్వరలో రానున్న 2024 ఎన్నికల్లో మరొక్కసారి టిడిపితో కసిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నారు పవన్. ఇక అన్నయ్య చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా పలు విధాలుగా సామజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తన అన్నయ్య చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగం అధినేత ఉన్న పవన్ అప్పట్లో తనవంతుగా పలువురికి సాయం అందించారు.

ఇక ప్రస్తుతం జనసేన తరపున కూడా తనవంతుగా ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతున్నారు. ఎలాగైనా 2024 ఎన్నికల్లో ఎమ్యెల్యే గా గెలిచి ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తున్నారు పవన్ .ఇక నటుడిగా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేష్ అందుకుంటున్న వారిలో ఒకరైన పవన్, ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 80 కోట్ల వరకు తీసుకుంటున్నారు. మరొక నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే మొత్తం తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన భార్య అన్నా లేజనోవా తో కలిసి ఉంటున్నారు. వారికీ ఇద్దరు సంతానం. వారి పేర్లు మార్క్ శంకర్ పవనోవిచ్, అకీరానందన్, ఆద్య. ఇక తరచు అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో పాటు తన ఫ్యామిలీ తో కూడా గడుపుతూ ఉంటారు పవన్.

ఇక నెట్ వర్త్ పరంగా పవన్ కళ్యాణ్ కు పలు బడా కంపెనీలకు చెందిన కార్లు అన్ని ఉన్నాయి. ఎక్కువగా ఖాళీ సమయాల్లో తన ఫామ్ హౌస్ లో గడిపేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ లో ఎంతో పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎక్కువగా పుస్తకాలు చదవడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం వంటివి పవన్ కు ఎంతో ఇష్టం. తరచు తన అన్నయ్య ఇంటికి వెళ్తుంది పవన్, ఏవైనా శుభకార్యాల్లో కుటుంబం అందరితో కలిసి సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువగా పాత సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. అప్పటి నటులు అందరిని అభిమానించే పవన్ కు ప్రత్యేకంగా సినిమాలు అంటే ఆసక్తి లేనప్పటికీ తొలిసారిగా వదిన సురేఖ గారి ప్రోద్బలంతో సినిమా ఎంట్రీ ఇచ్చారు.

ఇక అక్కడి నుండి ఒక్కో సీనెంతో మంచి క్రేజ్ అందుకుంటూ ముందుకి సాగి నేడు ఇంత పేరు సొంతం చేసుకున్నారు.ఇప్పటివరకు పూర్తిగా రీజినల్ సినిమాలని మాత్రమే చేస్తూ సాగిన పవన్ త్వరలో సుజీత్ తీస్తున్న ఓజి, అలానే క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మూవీస్ ద్వారా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక కెరీర్ పరంగా క్రేజ్ పరంగా తనకు సమకాలీకుడైన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పవన్ పలు సినిమాల దవారా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే అందులో ఇద్దరూ కూడా పలు సినిమాలతో విజయం అందుకున్నారు. ఇక పవన్ రాబోయే 2024 ఎన్నికల కోసం గట్టిగ దృష్టి పెట్టి ప్రస్తుతం చేస్తున్న ఆ మూడు సినిమాలు ప్రక్కన పెట్టారు.

లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పవన్ నుండి ఓజి మూవీ మే లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ అక్టోబర్ లో అలానే హరిహర వేరమల్లు వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ అవుతాయని అంటున్నారు. మొదటి నుండి నటుడిగా తనకు ఎంతో ఇష్టమైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వృత్తి పరంగా క్రమ శిక్షణ, నిబద్దత వంటివి అన్ని కూడా ఆయన నేర్పారని, ఇక తమ చిన్నపుడు నాన్న ఇంట్లో లేని సమయంలో అన్నయ్య తమకు అన్నివిధాలుగా మార్గదర్శకుడిగా నిలిచేవారని, ఆయన హీరోగా మారిన తరువాత తమకు అన్నివిధాలుగా సపోర్ట్ చేసి తమని ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎన్నో కష్టాలు పెద్దరాణి అన్నారు.

మొత్తంగా అన్నయ్య చిరంజీవి గురించి పలు సందర్భాల్లో ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. అలానే తన రెండవ సోదరుడు మెగాబ్రదర్ నాగబాబు గురించి కూడా పలు సందర్భాల్లో గొప్పగా చెప్పే పవన్, ప్రస్తుతం ఆయనని జనసేన పార్టీలో ఒక కీలక విభాగంలో నియమించారు. గతంలో జనసేన నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఘోరంగా ఓడిపోయారు. అయితే ఈసారి కూడా జనసేన తరపున పోటీ చేసి ఎలాగైనా విజయం అందుకునేందుకు సమాయత్తం అవుతున్నారు నాగబాబు.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యువ నటులు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి వారితో కూడా పవన్ కి మంచి అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో అలానే శుభకార్యాలు, పండుగలు, వేడుకల సమయంలో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటికి సంబందించిన ఫోటోలు కూడా మనం తరచు సోషల్ మీడియాలో చూస్తూంటే ఉంటాము. ఇక తాజాగా 2024 సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మెగా కుటుంబం మొత్తం కూడా కలిసి ఆ వేడుకల్ని ఎంతో వైభవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలని మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేసారు. చిరంజీవి, నాగబాబు ఇద్దరూ కూడా తమ సోదరుడు పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా నటుడిగా అటు రాజకీయ నాయకుడుగా ముందుకు సాగుతున్న పవన్ కు రాబోయే రోజుల్లో మరింత మంచి భవిష్యత్తు లభించాలని మనం కోరుకుందాం.

Pawan Kalyan Biography Net worth Family Secrets

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Pawan Kalyan Biography Net worth Family Secrets

1 thought on “Pawan Kalyan Biography Net worth Family Secrets l పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ నెట్ వర్త్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024”

Comments are closed.