Guntur Kaaram Collection Till Now l గుంటూరు కారం తాజా కలెక్షన్ డీటెయిల్స్ 2024

Written by Movie Updates

Updated on:

Guntur Kaaram Collection Till Now:- మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో మహేష్ బాబు సూపర్ డూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు మాస్ స్టైల్, స్వాగ్, డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

రమ్యకృష్ణ, జగపతిబాబు, సునీల్, రఘుబాబు, ఈశ్వరరావు, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉండడం, అలానే ఆ అంచనాలు మించేలా అద్భుతంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని తెరకెక్కించడంతో ఫస్ట్ డే నుండి ఎందరు ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో నెగటివిటీ చేసి విషం చిమ్మినా మూవీ కంటెంట్ ఆకట్టుకోవడంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డం ముందు అవి నిలవలేకపోయాయి.

Guntur Kaaram Collection Till Now

ఇక ప్రస్తుతం ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబు కి సోదరుడిగా రాహుల్ రవీంద్రన్ నటించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ మూవీ మొత్తంగా గడచిన ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 206 కోట్ల గ్రాడ్ ని అలానే రూ. 103 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Guntur Kaaram Collection Till Now

ఇక రేపటి నుండి గుంటూరు కారం మూవీకి డీసెంట్ కలెక్షన్ లభించే అవకాశం ఉందని, ఎందరు ఎన్నివిధాలుగా నెగటివిటీ ప్రచారం చేసిన మహేష్ బాబు గారి క్రేజ్ అలానే మూవీ లో కంటెంట్ కూడా బాగుండడంతో మొత్తంగా గుంటూరు కారం మూవీ పెద్ద సక్సెస్ దిశగా పరుగెడుతోందని మేకర్స్ అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సక్సెస్ తో కెరీర్ పరంగా మరొక అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Guntur Kaaram Collection Till Now

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Guntur Kaaram Collection Till Now

1 thought on “Guntur Kaaram Collection Till Now l గుంటూరు కారం తాజా కలెక్షన్ డీటెయిల్స్ 2024”

Comments are closed.