Tollywood Top 10 Collection Movies l టాలీవుడ్ టాప్ 10 కలెక్షన్ మూవీస్ 2024

Written by Movie Updates

Published on:

Tollywood Top 10 Collection Movies:- తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టిస్తూ మంచి క్రేజ్ తో పాటు ఆడియన్స్ యొక్క ఆదరణ మరియు భారీ స్థాయి కెలెక్షన్స్ తో దూసుకెళ్ళినవి ఉన్నాయి. ముఖ్యంగా 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి మూవీ అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అన్ని గత రికార్డులు తుడిచి పెట్టి సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు అన్ని ప్రాంతాల్లో నెలకొల్పింది. ఇక ఆ తరువాత వచ్చిన పలు సినిమాలు ఆ మూవీ రికార్డ్స్ ని పలు ప్రాంతాల్లో బద్దలు కొట్టాయి.

ఆపైన రామ్ చరణ్ మగధీర, మహేష్ బాబు దూకుడు కూడా సంచలన రికార్డులు నమోదు చేసాయి. ఇక 2013 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తరువాత మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివతో చేసిన శ్రీమంతుడు కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ రెండు సినిమాలు కూడా ఒకదానిని మించేలా మరొకటి అద్భుత విజయాలతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా సంచలనం నమోదు చేసింది. మరి ఇటీవల టాలీవుడ్ లో టాప్ 10 కలెక్షన్ సొంతము చేసుకున్న సినిమాలు యేవో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.

1. బాహుబలి 2 (Bahubali 2: The Conclusion)

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన బాహుబలి 2 మూవీ 2017 లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద సంచలన విజయం అందుకుంది. బాహుబలి పార్ట్ 1 లోని చివరి సీన్ లో  అమరేంద్ర బాహుబలి ని కట్టప్ప చంపడం, అయితే అతడు ఎందుకు అమరేంద్ర బాహుబలిని చంపాడు అనే ఇంట్రెస్టింగ్ హ్యాష్ టాగ్ తో అలానే అదే ఇంట్రెస్టింగ్ అంశంతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాహుబలి 2 మూవీ అందరి అంచనాలు మించేలా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ. 1900 కోట్ల వరకు కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ సూపర్ గా యాక్ట్ చేయగా శివగాని గా రమ్యకృష్ణ, కట్టప్ప గా సత్యరాజ్, భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటి, దేవసేన గా అనుష్క తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోగా ఎస్ ఎస్ రాజమౌళి అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ ఈ మూవీని భారీ సక్సెస్ చేసింది.

2. ఆర్ఆర్ఆర్ (RRR)

తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా మెగా నందమూరి ఫ్యామిలీ స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి చేసిన భారీ పాన్ ఇండియన్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీని కూడా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య మరింత గ్రాండ్ గా నిమించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో అత్యద్భుతంగా ఒదిగిపోయి నటించారు.

ఇక ఆర్ఆర్ ఆర్ లో సముద్రఖని, శ్రీయ శరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి తదితరులు నటించారు. ఇక 2022లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1387 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుని మరొక్కసారి తెలుగు సినిమా యొక్క బాక్సాఫీస్ సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. అలానే ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు లభించడంతో వరల్డ్ సినిమా మొత్తం కూడా తెలుగు సినిమా వైపు చూసింది.

3. సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ వ్యయంతో నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, మైమ్ గోపి, ఈశ్వరి రావు, ఝాన్సీ వంటి వారు కీలక పాత్రలు పోషించిన సలార్ కి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ కెమెరా మ్యాన్ గా వర్క్ చేసారు.

ఇటీవల 2023 డిసెంబర్ లో మంచి అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. ప్రభాస్ సూపర్ యాక్టింగ్ తో పాటు కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ అంశాలను సలార్ లో ఆడియన్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంతో మెప్పించాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 720 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ తో ఇంకా దూసుకెళుతోంది.

4. బాహుబలి 1 (Baahubali: The Beginning)

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని పార్ట్ 1 అయిన బాహుబలి ది బిగినింగ్ మూవీ మంచి అంచనాలతో తొలి పాన్ ఇండియన్ మూవీగా టాలీవుడ్ లో 2015 లో రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ టేకింగ్ తో పాటు కీరవాణి సూపర్ డూపర్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా హీరో ప్రభాస్ అత్యద్భుత నటన వేసారి ఈ సినిమాలని ఎంతో సక్సెస్ చేసాయి.

ఇక శివగామిగా రమ్యకృష్ణ, భల్లాల దేవుడిగా రానా, దేవసేన గా అనుష్క కూడా ఎంతో బాగా నటించి ఆడియన్స్ యొక్క మన్ననలు అందుకున్నారు. ఇక బాహుబలి 1 మూవీ లో సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ స్థాయి విజువల్స్, గ్రాండియర్ యాక్షన్ సన్నివేశాలు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్, ఫైట్స్, రాజమౌళి మార్క్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వంటివి బాహుబలి భారీ సక్సెస్ కు కూడా ప్రధాన కారణాలు. ఇక ఈ మూవీ 2015 లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

Tollywood Top 10 Collection Movies

5. సాహో (Saaho)

బాహుబలి సిరీస్ లో రిలీజ్ అయిన రెండు సినిమాల్లో తన ఆకట్టుకునే అభినయంతో ఇండియా వైడ్ గా ఆడియన్స్ యొక్క మెప్పు పొందారు ప్రభాస్. ఆ సినిమాలు రెండూ కూడా ఒక దానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు హీరోగా ప్రభాస్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టతలు క్రేజ్, మార్క్ ని తెచ్చిపెట్టాయి. ఇక దాని అనంతరం యువ దర్శకుడు సుజీత్ తో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సాహో.

ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో మురళి శర్మ, వెన్నెల కిశోర్, చుంకి పాండే, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్ నటించారు. ప్రభాస్, శ్రద్దల జోడి స్క్రీన్ పై ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. సాహో లో సుజీత్ తీసిన భారీ యాక్షన్ సీన్స్ విజువల్స్ ఆడియన్స్ ని అలరించడంతో పాటు ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మార్కులు సొంతం చేసుకుంది. ఇక సాహో మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 430 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

6. పుష్ప ది రైజ్ (Pushpa: The Rise)

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

సుకుమార్ సూపర్ టేకింగ్ తో పాటు పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ అత్యద్భుత నటనను ఈ మూవీకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటు మాస్ యాక్షన్ సీన్స్, రష్మిక ఆకట్టుకునే అందం అభినయం కూడా అందరినీ అలరించింది. గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూపర్ ఫైట్స్ వంటివి పుష్ప లో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప మూవీ 2021 డిసెంబర్ లో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా రూ. 370 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

7. ఆదిపురుష్ (Adipurush)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన మైథలాజికల్ యాక్షన్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కృతి సనన్ జానకి పాత్రలో నటించగా లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. రాఘవగా ప్రభాస్ ఆకట్టుకునే అభినయం అందరినీ అలరించింది.

బాలీవుడ్ యువ దర్శకుడు ఓం రౌత్ దేనిని తెరకెక్కించారు. ఇక ఆదిపురుష్ కి అజయ్ అతుల్, సాకేత్ పరంపర సాంగ్స్ అందించగా సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సమకూర్చారు. 2023 జూన్ లో మంచి అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఆదిపురుష్ మూవీ మంచి విలయం అందుకుంది. గ్రాండియర్ విజువల్స్, అలరించే సాంగ్స్, బీజీఎమ్, యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల పెర్ఫార్మన్స్ వంటివి ఆదిపురుష్ ని విజయవంతం చేసాయి. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 354 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

Tollywood Top 10 Collection Movies

8. అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో సచిన్ ఖేడేకర్, జయరాం, టబు, సుశాంత్, నివేత పేతురాజ్ నటించారు. ఇక ఈమూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించారు. అందరిలో మంచి అంచనాలతో 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది.

ముఖ్యంగా అల వైకుంఠపురములో మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకట్టుకునే నటనతో పాటు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్స్, స్టైల్ అలరించాయి. అలానే యాక్షన్ ఎమోషనల్ అంశాలు కూడ బాగుండడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ మూవీ లోని సాంగ్స్ అయితే నేషనల్ వైడ్ గా పాపులర్ అయి సంగీత దర్శకుడిగా థమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏకంగా నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టాయి. కాగా అల వైకుంఠపురములో మూవీ తెలుగు రీజినల్ సినిమాల్లో రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 275 కోట్ల గ్రాడ్ ని కలెక్ట్ చేయడం విశేషం.

9. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఇక ఈ మూవీలో అజయ్ కృష్ణ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అద్బుత నటనతో పాటు యాక్షన్ ఎంటర్టైనింగ్ స్టైల్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించియాన్ విధానానికి అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి.

సరిలేరు నీకెవ్వరు ద్వారా దాదాపుగా పదమూడేళ్ల విరామం అనంతం టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళి సినిమాల్లోకి రంగప్రవేశం చేసారు. ఇంకా ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సంగీత కీలక పాత్రలు చేసారు. దేవిశ్రీ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి పేరు లభించింది. ముఖ్యంగా కామెడీ తో పాటు ఎమోషనల్ అంశాలు కూడా సరిలేరు నీకెవ్వరు లో ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 260 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

10. సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ లెవెల్లో నిర్మించినా పాన్ ఇండియన్ మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో తమన్నా భాటియా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ నటించారు. ఇక ఈ మూవీకి అమిత్ త్రివేది సాంగ్స్ ని అలానే జూలియస్ పకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు.

కాగా ఈ హిస్టారికల్ భారీ యాక్షన్ డ్రమ్ మూవీలో నరసింహా రెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి అద్భుత నటనతో పాటు సురేందర్ రెడ్డి సూపర్ టేకింగ్ కి అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఆకట్టుకునే సెట్టింగ్స్, గ్రాండియర్ విజువల్స్ సైరా నరసింహా రెడ్డి మూవీకి మంచి విజయం అందించాయి. ఇక ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టి ఒక క్యామియో పాత్ర చేసారు. కాగా సైరా నరసింహా రెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

Tollywood Top 10 Collection Movies

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tollywood Top 10 Collection Movies