Tollywood Top 10 Movies l టాలీవుడ్ టాప్ 10 మూవీస్ 2024

Written by Movie Updates

Published on:

Tollywood Top 10 Movies:- నిజానికి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) బాలీవుడ్ తో పాటు ఎంతో వేగవంతంగా మార్కెట్ ని విస్తరించుకుంటూ పోతోంది. ముఖ్యంగా 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ పోకిరి అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

ఆ తరువాత వచ్చిన మగధీర, దూకుడు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, బాహుబలి సిరీస్ రెండు సినిమాలు, అల వైకుంఠపురములో, పుపుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్ ఇలా ప్రతి ఒక్కటి కూడా భారీ విజయాలతో పాటు ఎప్పటికప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని మార్కెట్ ని మరింతగా పెంచేస్తున్నాయి.

ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అందుకోవడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సైతం మన టాలీవుడ్ వైపు చూసింది. ఆ విధంగా ఇక్కడి నటీనటులు పలువురు నిర్మాతలు, దర్శకులు తెలుగు సినిమాని అద్బుతముగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు చెప్పుకోబోతోంది టాలీవుడ్ టాప్ 10 మూవీస్

1. బాహుబలి 2 (Bahubali 2: The Conclusion)

తెలుగు సినిమా యొక్క మార్కెట్ ని అలానే ఖ్యాతిని ముందుగా పాన్ ఇండియన్ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమాలు బాహుబలి సిరీస్ లోని రెండు అని చెప్పాలి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాల్లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ అద్భుత నటన, అలానే కీలక పాత్రల్లో నటించిన అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు ఎవరికి వారు తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారు.

అలానే ఈ మూవీస్ ఇంత భారీ సక్సెస్ సాదించినదానికి మూల కారణం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యద్భుత టేకింగ్. ముఖ్యంగా బాహుబలి పార్ట్ 1 సూపర్ గా ఆడడంతో అందరిలో బాహుబలి 2 పై మరింతగా క్రేజ్ ఏర్పడడం, అలానే దానిని ఏమాత్రం తగ్గకుండా మరింత వినాయవంతం చేసేలా మూవీ రూపొందడం జరిగింది.

ఇక బాబుబలి 2 లో గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, నటీనటుల యాక్టింగ్, కళ్ళు మిరుమిట్లు గొలిపే విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నాయా తక్కువే అవుతుంది. యాక్షన్ ఎమోషనల్ అంశాలను తెరకెక్కించడంతో దిట్ట అయిన రాజమౌళి ఈ సిరీస్ సినిమాలతో జయహో జక్కన్న అని అనిపించుకున్నారు. ఇక బాహుబలి 2 మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1900 కోట్ల కలెక్షన్ అందుకోవడంతో పాటు IMDB లో 8.2 రేటింగ్ ని కలిగి ఉంది.

2. ఆర్ఆర్ఆర్ (RRR)

బాహుబలి సిరీస్ సినిమాల తరువాత తొలిసారిగా మెగా నందమూరి యంగ్ స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నిర్మించిన గ్రాండియర్ యాక్షన్ పీరియాడిక్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఆర్ఆర్ ఆర్. ఈ మూవీలో కొమురం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించారు.

ఇక కీలక పాత్రల్లో బాలీవుడ్ అందాల నటి అలియా భట్, హాలీవుడ్ నటులు ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్, ఒలీవియా మోరిస్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, రాజీవ్ కనకాల, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ నటించారు. రాజమౌళి అత్యద్భుత టేకింగ్ తో పాటు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి కనబరిచిన అద్భుత నటన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రాణంగా నిలిచింది.

ఈ మూవీలో కూడా భారీ విజువల్స్, సెట్టింగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీని గ్రాండియర్ స్థాయిలో డివివి దానయ్యే నిర్మించారు. ఇక ఈమూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1387 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక దీనికి IMDB లో 7.8 రేటింగ్ ఉంది.

3. సలార్ Salaar: (Part 1 – Ceasefire)

మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీలో అందాల కథానాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఝాన్సీ, బాబీ సింహా నటించారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీని కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ తన హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. రవి బస్రూర్ సంగీతం అందించిన సలార్ లో ప్రభాస్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, ఫైట్స్, గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఎమోషనల్ కథని ఆకట్టుకునే తీరున యాక్షన్ అంశాలు జోడించి దానిని ఎలివేషన్స్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో బాగా తీశారు. ఇక సలార్ పార్ట్ 2 కూడా త్వరలో పట్టాలెక్కనుంది. మంచి అంచనాలతో ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ రూ. 720 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీకి IMDB లో 6.6 రేటింగ్ ఉంది.

Tollywood Top 10 Movies

4. బాహుబలి (Baahubali: The Beginning)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని పార్ట్ 1 మూవీ 2015లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. తొలిసారిగా భారీ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ప్రభాస్ రెండు పాత్రల్లో నటించిన ఈ మూవీలో అనుష్క శెట్టి, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రానా దగ్గుబాటి తదితరులు కీలక పాత్రలు చేసారు.

ఇక ఈ మూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా రెండు పాత్రల్లో ప్రభాస్ తన అత్యద్భుత నటనతో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. అలానే దేవసేన గా అనుష్క శెట్టి, భల్లాల దేవుడిగా రానా దగ్గుబాటి నటన కూడా ఆడియన్స్ ని ఎంతో అలరించింది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించినా ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.

వి శ్రీనివాస్ మోహన్ అందించిన గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యద్భుత టేకింగ్, కీరవాణి వండర్ఫుల్ సాంగ్స్, అలరించే పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్ సీన్స్, కళ్ళను అబ్బురపరిచే భారీ సెట్టింగులు బాహుబలి మూవీకి ప్రధాన బలాలు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాండ్ ని సొంతం చేసుకోవడం విశేషం. అలానే ఈ మూవీ IMDBలో 8 రేటింగ్ ని కలిగి ఉంది.

5. సాహో (Saaho)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ అందాల కథానాయిక శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలాత్ నిర్మించిన పాన్ ఇండియన్ మూవీ సాహో.

బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల భారీ విజయాల అనంతరం ప్రభాస్ చేసిన ఈ మూవీలోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు తో పాటు ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్, అలరించే అందరు నటీనటుల నటన, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

మురళి శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో ప్రభాస్ ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తారు. మంచి అంచనాలతో బాక్సాఫీస్ వద్ద 2019లో రిలీజ్ అయిన సాహూ అందరి అంచనాలు అందుకుని మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక దీనికి IMDB లో 5 రేటింగ్ ని కలిగి ఉంది.

6. పుష్ప 1 (Pushpa: The Rise)

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020 లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న అలవైకుంఠపురములో మూవీ అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారిగా నటించిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక అందరిలో మంచి అంచనాలతో 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతము చేసుకుంది. సుకుమార్ సూపర్ టేకింగ్ కి అల్లు అర్జున్ అద్భుత నటన తోడై పుష్ప ని ఎంతో పెద్ద సక్సెస్ అయ్యేలా చేసింది. ఇక అన్ని భాషల్లో కూడా పుష్ప విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా మొత్తం మంచి క్రేజ్ అందుకున్నారు.

ఇక ఈ మూవీలో తగ్గేదేలే అంటూ ఆయన కనబరిచిన మాస్ యాక్టింగ్ కి ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడ లభించింది. ఇక పుష్ప లో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, అలరించే యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు, గూస్ బంప్స్ తెప్పించే ఫైట్స్, ఎలివేషన్స్ వంటివి ఆడియన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ IMDBలో 7.6 రేటింగ్ ని కలిగి ఉంది.

7. ఆదిపురుష్ (Adipurush)

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆదిపురుష్.

బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీని అత్యంత భారీ వ్యయంతో టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థలు నిర్మించాయి. భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రాఘవ గా  ప్రభాస్, జానకి గా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్, భజరంగి గా దేవదత్త నాగే నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆదిపురుష్ మూవీ గత ఏడాది జూన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

భారీ గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ తో పాటు అలరించే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రభాస్ కృతి సహా ప్రతి ఒక్క పాత్రధారి యొక్క ఆకట్టుకునే నటన ఆడియన్స్ ని అలరించి ఈ మూవీకి మంచి విజయాన్ని అందించాయని చెప్పాలి. అయితే దర్శకుడు ఓం రౌత్ మూవిని తెరకెక్కించిన విధానం పై కొంత విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ తట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 354 కోట్లని కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ IMDB లో 3.8 రేటింగ్ ని కలిగి ఉంది.

Tollywood Top 10 Movies

8. అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo)

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకుంది. అంతకముందు కెరీర్ పరంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఈ మూవీతో ఒక్కసారిగా నటుడిగా బాగా క్రేజ్ అందుకున్నారు.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో సుశాంత్, ఈశ్వరి రావు, టబు, జయరాం, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ అయితే యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడంతో పాటు నేషనల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యాయి.

ఇక అల వైకుంఠపురములో మూవీకి అద్భుతమైన సాంగ్స్ అందించినందుకు గాను ఎస్ థమన్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. అల్లు అర్జున్ ఆకట్టుకునే నటనకు త్రివిక్రమ్ అద్భుతమైన టేకింగ్, థమన్ సాంగ్స్, బీజీఎమ్, గ్రాండియర్ విజువల్స్, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సీన్స్, మంచి ఎంటెర్టైన్మెట్ వంటివి బాగా కలిసి రావడంతో అల వైకుంఠపురములో మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రప్రంచవ్యాప్తంగా రూ. 265 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ IMDB లో 7.3 రేటింగ్ కలిగి ఉంది.

9. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు.

ఈ మూవీలో సత్య దేవ్, విజయశాంతి, సంగీత, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు చేయగా దీనిని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత భారీ స్థాయిలో నిర్మించాయి. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యద్భుత నటన, అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు ఫోటోగ్రఫి, గ్రాండియర్ విజువల్స్, అలరించే ఎమోషనల్ సీన్స్ వంటివి దీనిని మంచి విజయవంతం చేసాయి.

ఇక చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ మూవీతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ కి నటిగా మళ్ళి పునఃప్రవేశం చేసారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కామెడీ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ IMDB లో 5.8 రేటింగ్ ని కలిగి ఉంది.

10. సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ మూవీ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించగా, టైటిల్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి తన అత్యద్భుత నటనతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు.

ఈ మూవీ ద్వారా మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారారు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించారు చరణ్ .ఇక ఈమూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చ సుదీప్ ప్రత్యేక పాత్రలు చేయగా కీలక పాత్రల్లో జగపతిబాబు, తమన్నా, బ్రహ్మాజీ, సాయిచంద్, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. అమిత్ త్రివేది ఈ మూవీకి అందించిన సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.

నయనతార హీరోయిన్ గా నటించిన సైరా నరసింహా రెడ్డి లో తమన్నా భాటియా మరొక ముఖ్య పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుత టేకింగ్ తో పాటు మెగాస్టార్ సూపర్ యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, భారీ సెట్టింగ్స్, రత్నవేలు ఫోటోగ్రఫి సైరా నర్సింహా రెడ్డి మూవీని పెద్ద సక్సెస్ చేసాయి. ఇక 2019 అక్టోబర్ లో పాన్ పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 240 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అలానే ఈ మూవీకి IMDB లో 7.2 రేటింగ్ ఉంది.

Tollywood Top 10 Movies

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tollywood Top 10 Movies