WoW! Baahubali 3 Movie Blasting Update l బాహుబలి 3 మూవీ బ్లాస్టింగ్ అప్ డేట్

Written by Movie Updates

Published on:

Baahubali 3 Movie Blasting Update:- మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2 సిరీస్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఈ మూవీ లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో నటించి తన అత్యద్భుత నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు.

దేవసేన గా అనుష్క శెట్టి, శివగామిగా రమ్య కృష్ణ, భల్లాల దేవుడిగా రానా దగ్గుబాటి కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అలరించారు. ఇక జక్కన్న రాజమౌళి ఈమూవీస్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని దేశవిదేశాల్లో చాటి చెప్పారు. ఇక బాహుబలి 1 మూవీ రూ. 650 కోట్లు కొల్లగొట్టగా, బాహుబలి 2 మూవీ రూ. 1900 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తాని హాలీవుడ్ స్థాయికి నిరూపించింది. ఇక అనంతరం ఎన్టీఆర్, చరణ్ లతో RRR మూవీ తెరకెక్కించారు ఎస్ ఎస్ రాజమౌళి.

Baahubali 3 Movie Blasting Update

దానికి కూడా అందరి నుండి ఎంతో గొప్ప క్రేజ్ లభించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ గ్లోబ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు రాజమౌళి. ఇది పూర్తి కావడానికి దాదాపుగా మూడు నుండి నాలుగేళ్ళ టైం పెట్టె అవకాశం ఉంది. అయితే అందరూ ఎప్పటి నుండో బాహుబలి 3 మూవీ ఉంటుందా లేదా అనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

Baahubali 3 Movie Blasting Update

అయితే ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు రాజమౌళి, కథకుడు వి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి 3 మూవీ పక్కాగా ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అని, ఐతే తమ మనసులో ఒక ఐడియా మాత్రం ఉందని తెలిపారు. ముఖ్యంగా రాబోయే మరిన్ని ఏళ్లలో బాహుబలి మూవీస్ ని అలానే ఆ క్యారెక్టర్ ని మరింతగా ఫ్యాన్స్, ఆడియన్స్ లోని తీసుకెళ్లేలా ఆలోచన మాత్రం ఉందని అన్నారు. అయితే పక్కాగా బాహుబలి 3 అనేది ఎప్పుడు తెరకెక్కిస్తాం అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ RRR 2 తో పాటు Baahubali 3 కూడా ఉంటుందని అన్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ అనంతరం ఈ మూవీ ఉంటుందేమో చూడాలి.

Baahubali 3 Movie Blasting Update

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Baahubali 3 Movie Blasting Update

1 thought on “WoW! Baahubali 3 Movie Blasting Update l బాహుబలి 3 మూవీ బ్లాస్టింగ్ అప్ డేట్”

Comments are closed.