Hollywood Upcoming Movies l అప్ కమింగ్ హాలీవుడ్ మూవీస్ 2024

Written by Movie Updates

Updated on:

Hollywood Upcoming Movies:- ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా ప్రతి సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో మాత్రం హాలీవుడ్ లో రిలీజ్ అయ్యే అప్ కమింగ్ సినిమాల పై మాత్రం ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఆ విధంగా ఆ సినిమాలు మన అందరి మనసులో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి అన్నమాట.

ఇక భాషతో సంబంధం లేకుండా హాలీవుడ్ లో రూపొందే ఆ సినిమాలు చూడాలని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ నూతన ఏడాది అయిన 2024 లో కూడా పలు హాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ మనల్ని అందరినీ అలరించేందుకు గ్రాండ్ లెవెల్లో సిద్ధం అవుతున్నాయి. మరి అవి ఏమిటో, ఎప్పుడెప్పుడు వాటి యొక్క విడుదల ఉండనున్నాయి అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

ఆర్గైల్ (Argylle) :

హేన్రి కావిల్, సామ్ రాక్ వెల్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్, బ్రయాన్ క్రాన్స్ట్రాన్, కేథరీన్ ఓ హారా తదితరులు కీలక పాత్ర చేయనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని మాత్యు వాగన్ తెరెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ 2 ఫిబ్రవరి 2024న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకి రానుంది.

ది హోల్డోవర్స్ (The Holdovers) :

పాల్ గియామట్టి, డావిన్ జాయ్ రండోల్ఫ్, డొమినిక్ సేస్సా, టేట్ డొనోవన్, క్యారీ ప్రెస్టన్, గిలియన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ కామెడీ డ్రామా ఎంటర్టైన్మెంట్ మూవీ 9 ఫిబ్రవరి 2024 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుండగా దీనిని అలెగ్జాండర్ పేనే తెరకెక్కించారు.

Hollywood Upcoming Movies

మేడం వెబ్ (Madame Web) :

డకోటా జాన్సన్, సిడ్నీ స్వీని, ఇసాబెలా మెర్సెడ్, ఎమ్మా రాబర్ట్స్, ఆడం స్కాట్, జిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని ఎస్ జె క్లార్క్ సన్ తెరకెక్కిస్తుండగా, ఈ యాక్షన్ బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేమికుల దినోత్సవం అయిన 2024 ఫిబ్రవరి 14న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకి రానుంది.

బాబ్ మార్లే వన్ లవ్ (Bob Marley One Love) :

కింగ్స్లీ బెన్ అధిర్, లాషణ లించ్, జెస్సి సిలియో, జేమ్స్ నార్టన్, మైఖేల్ గాండోల్ఫీని, నాడిన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా రేయినాల్డో మార్కస్ గ్రీన్ దేనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ బయోగ్రఫీ డ్రామా మ్యూజికల్ ఎంటర్టైనర్ మూవీని 2024 ఫిబ్రవరి 23న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

డ్యూన్ పార్ట్ 2 (Dune Part Two) :

తిమోతి చాలామేట్, రెబెకా ఫెర్గుసన్, జోష్ బ్రోలిన్, స్టెల్లన్ స్కార్స్ గార్డ్, డేవ్ బౌటిస్తా తదితరులు కీలక పాత్రలు చేయగా డెనిస్ విల్లెనేవ్ తెరకెక్కించారు. యాక్షన్ అడ్వెంచర్ తో సాగనున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ మార్చి 15న ఆడియన్స్ ముందుకి రానుంది.

రోడ్ హౌస్ : (Road House)

జేక్ జిలెన్హాల్, డానియేల మెల్చిర్, బిల్లీ మ్యాగ్ నస్సేన్, జెస్సికా విలియమ్స్, డారెన్ బార్నెట్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని డౌగ్ లీమన్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 21, 2024 న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

కుంగ్ ఫు పాండా 4 : (Kung Fu Panda 4) :

అక్వఫానియా, ఏంజెలినా జోలీ, సేథ్ రోజెన్, జాక్ బ్లాక్, జాకీ చాన్, లూసీ లియు, డస్టిన్ హాఫ్ మ్యాన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఈ యాక్షన్ అడ్వెంచరస్ యానిమేషన్ మూవీని మైక్ మిచెల్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 మార్చి 24న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Hollywood Upcoming Movies

గాడ్జిల్లా vs కాంగ్ ది న్యూ ఎంపైర్ (Godzilla vs Kong) The New Empire :

డ్యాన్ స్టీవెన్స్, రెబెకా హాల్, బ్రియాన్ టైర్ హెన్రీ, కేలీ హాటిల్, ఫాలెన్ చెన్, అలెక్స్ ఫ్లెర్న్స్, రాచెల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఆడమ్ వింగర్ద్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 12 ఏప్రిల్ 2024 న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

రెబెల్ మూన్ – పార్ట్ టూ ది స్కార్ గివర్ (Rebel Moon – Part Two – The Scargiver) :

సోఫియా బౌటెల్ల. ఎడ్ స్క్రెయిన్, జేనా మేలోన్, చార్లీ హున్నాం, స్టాజ్ నాయర్, మైఖేల్ హస్మన్, తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీని జాక్ సిండర్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించి 19 ఏప్రిల్ 2024 న ఆడియన్స్ ముందుకి రానుంది.

డెడ్ పూల్ – 3 (Deadpool – 3) :

ర్యాన్ రెనాల్డ్స్, హగ్ హాక్ మ్యాన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని షాన్ లెవీ తెరకెక్కిస్తుండగా, ఈ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సూపర్ హీరో మూవీ 3 మే 2024 న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానుంది.

ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa – A Mad Max Saga) :

అన్య టేలర్ జాయ్, క్రిస్ హెమ్స్ వర్త్, టామ్ బర్కే, అల్యిలా బ్రౌన్, నాథన్ జోన్స్, యంగస్ సాంప్సన్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఈ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీని జార్జ్ మిల్లర్ తెరకెక్కిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో 23 మే 2024 న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ : (Kingdom Of the Planet of the Apes)

ఓవెన్ టీజ్, ఫ్రెయ అల్లెన్, పీటర్ మెకన్, విలియం హెచ్ మాసి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీని వెస్ బాల్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ 24 మే 2024 న ఆడియన్స్ ముందుకి రానుంది.

Hollywood Upcoming Movies

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hollywood Upcoming Movies