That Was Big Puls Point For Guntur Kaaram l గుంటూరు కారం కి అదే పెద్ద ప్లస్ పాయింట్ 2024

Written by Movie Updates

Published on:

That Was Big Puls Point For Guntur Kaaram:-టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దాదాపుగా పుష్కర కాలం తరువాత తెరకెక్కుతున్న క్రేజీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఓపెనింగ్ నుంచి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పరచిన ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తికా వొచ్చింది. ప్రస్తుతం మూవీకి సంబంధించి వేగంగా ప్యాచ్ వర్క్ జరుగుతోంది.

యువ అందాల కథానాయికలు శ్రీలీల , మీనాక్షి చౌదరి మహేష్ బాబు కి జోడి గా నటిస్తున్న ఈ మూవీకి యువ సంగీత తరంగం ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్ నిర్మితమౌతోంది గుంటూరు కారం. ఇక ఈ మూవీ నుండి మొదట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని ఆపైన రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టీజర్ అలానే ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరిని విశేషంగా ఆకట్టుకొని ఇప్పటివరుకు వున్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

That Was Big Puls Point For Guntur Kaaram

చాలాఏళ్ళ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తున్న ఈ మూవీలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, రఘు బాబు, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది, వెన్నెల కిశోర్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మ్యాటర్ లోకి వెళితే తన గత సినిమాలకు ఒకింత భిన్నంగా ముఖ్యంగా ఫ్యామిలీస్ తో పాటు మాస్, యువత ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కిచినట్టు తెలుస్తుంది.

That Was Big Puls Point For Guntur Kaaram

ఓ వైపు మహేష్ బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు త్రివిక్రమ్ పవర్ ఫుల్ టేకింగ్ కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ నే కాదు సాధారణ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుందని అదే ఈ సినిమాకు ప్రధాన బలం అని టాలీవుడ్ వర్గాల టాక్. సినిమాలో హీరో పాత్రతో పాటు హీరోయిన్స్ ఇద్దరి పాత్రలకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల నిడివి గల గుంటూరు కారం సినిమా రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటున్నారు. రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.

That Was Big Puls Point For Guntur Kaaram

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

That Was Big Puls Point For Guntur Kaaram