Hollywood Horror Movies l హాలీవుడ్ హారర్ సినిమాలు 2024

Written by Movie Updates

Published on:

Hollywood Horror Movies:- సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో అన్ని జానర్ మూవీస్ కి ఆడియన్స్ యొక్క ఆదరణ ఉన్నప్పటికీ ఎక్కువగా హర్రర్ మూవీస్ కి మరింతగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విధంగా ఇప్పటివరకు అనేక హాలీవుడ్ హర్రర్ మూవీస్ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఆడియన్స్ ని అలరించాయి. ముఖ్యంగా అటువంటి ఆదరణ అందుకున్న మోస్ట్ ఫియర్ ఫుల్ హర్రర్ మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.

1. The Ring (2002)

ఈ మూవీని గోరె వెర్బిన్స్కి తెరకెక్కించగా అక్టోబర్ 18, 2002 న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ఈ మూవీ 48 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కగా 249.3 మిలియన్ డాలర్స్ ని ఇది కొల్లగొట్టింది. ఒక జర్నలిస్ట్ తప్పనిసరిగా రహస్యమైన వీడియో టేప్ ని పరిశీలించాలి, పరిశోధించాలి. అయితే అది చూసిన వారం రోజుల అనంతరం ఎవరైనా మరణానికి కారణం అవుతారు అనే కాన్సెప్ట్ తో ది రింగ్ మూవీ తెరకెక్కింది.

2. IT (2017) :

ఈ మూవీని ఆండీ మాసెట్టి తెరకెక్కించగా సెప్టెంబర్ 5, 2017న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. 40 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ 701 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. 1989 వేసవిలో ఆకారాన్ని మార్చే రాక్షసుడిని నాశనం చేయడానికి బెదిరింపులకు గురైన పిల్లల బృందం కలిసి ఉంటుంది. ఇది విదూషకుడిగా మారువేషంలో ఉండి మరియు వారి చిన్నమైన పట్టణమైన దేఱి పిల్లలను వేటాడుతుంది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

3. The Nun (2018) :

ఈ మూవీని కోరిన హార్డీ తెరకెక్కించగా సెప్టెంబర్ 4, 2018లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం అందుకుంది. ఇక ఈ మూవీకి 22 మిలియన్ డాలర్స్ ఖర్చు కాగా 366 మిళియన్స్ ని ఇది కొల్లగొట్టింది. రొమేనియా లోని ఒక సన్యాసిని మఠం వద్ద ఉన్న ఒక యువ సన్యాసిని తన ప్రాణాలను తీసుకువెళ్ళినపుడు, భూత కాలం ఉన్న ఒక పూజారి మరియు ఆమె ఆఖరి ప్రమాణాల థ్రెషోల్డ్ లో ఉన్న ఒక క్రొత్త వ్యక్తిని వ్యాటికన్ పరిశోధించాడనికి పంపింది. ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

4. The Conjuring (2013):

జేమ్స్ వాన్ తెరకెక్కించిన ఈ మూవీ జులై 15, 2013లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇక ఈ మూవీకి 20 మిలియన్స్ బడ్జెట్ ఖర్చు కాగా 319. 5 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లు మరియు లోరైన్ వారెన్ తమ ఫామ్ హౌస్ లో చీకటి ఉనికిని చూసి భయాందోళనలకు గురైన కుటుంబానికి సహాయం చేస్తారు. ఈ కాన్సెప్ట్ తో ది కంజూరింగ్ మూవీ తెరకెక్కింది.

Hollywood Horror Movies

5. Annabelle (2014) :

జాన్ ఆర్ లియోనెట్టి తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ సెప్టెంబర్ 29, 2014లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఈమూవీ 6. 5 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కగా 257.6 మిలియన్ డాలర్స్ ని ఇది సొంతం చేసుకుంది. జాన్ ఫారం మరియు అతని భార్య మియాకి సరైన బహుమతిని కనుగొన్నట్లు భావిస్తాడు. అందమైన దుస్తులతో పాతకాలపు బొమ్మను ఆమె అందించడం, అనంతరం దానివలన సమస్యలు తలెత్తడం అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.

6. Dead Silence (2007) :

జేమ్స్ వాన్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 16, 2007లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇక ఈ మూవీకి 20 మిలియన్ డాలర్స్ ఖర్చు కాగా ఇది 22. 4 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని అందుకుంది. జామి ఆషెన్ మరియు అతని భార్య లిసా, బిల్లీ అనే వెంట్రిలాక్విస్ట్ బొమ్మను అనామక బహుమతిగా అందుకుంటారు. జయేష్ బయటకు వెళ్ళినపుడు ఒక వ్యక్తి లిసాని చంపేస్తాడు. తన నాలుక తెగిపోయిందని జామి తిరిగి రావడం, అనంతరం అతడు అరెస్ట్ కావడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

7.  Sinister (2012) :

స్కాట్ డెరైక్షన్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 11, 2012లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. 3 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈమూవీ మొత్తంగా 87. 7 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది. ఇది ఏతాన్ హాక్ ను పోరాడుతున్న నిజమైన నేర రచయితగా చూపిస్తుంది. అతని కొత్త ఇంట్లో భయంకరమైన హత్యలను వర్ణించే స్నఫ్ చిత్రాలను కనుకొనడం అతని కుటుంబాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

Hollywood Horror Movies

8.  The Witch (2015) :

రాబర్ట్ ఎగ్గర్స్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 27, 2015లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీ 4 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కి 40. 4 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది. ఒక జంట యొక్క నవజాత కుమారుడు రహస్యంగా అదృశ్యమైనపుడు మరియు వారి పంటలు విఫలమైనప్పుడు కుటుంబం ఒకరిపై ఒకరు తిరగడం ప్రారంభం అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

9.  Hereditary (2018) :

అరి యాస్టర్ తెరకెక్కించిన ఈ మూవీ 2018 జనవరి 21న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక 10 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ 82. 8 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. మానసిక అనారోగ్యంతో ఉన్న తల్లి మరణించినప్పుడు అన్నీ మరియు ఆమె భర్త, కొడుకు, కూతురు అందరూ ఆమెను కోల్పోయినందుకు దుఃఖిస్తారు. కుటుంబం వారి దుఃఖాన్ని నిర్వహించడానికి వివిధ మార్గాలను ఆశ్రయించింది. అందులో అన్నీ ,మరియు ఆమె కుమార్తె అతేంద్రియ శక్తులతో పోరాడడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది.

10. A Nightmare on Elm Street (1984) :

వెస్ క్రావెన్ తెరకెక్కించిన ఈమూవీ 1984 నవంబర్ 9న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఈమూవీని 1. 1 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కించగా ఇది బాక్సాఫీస్ వద్ద 57 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది. యుక్త వయసులోని పాత్రలు వారి తల్లితండ్రులు చేసిన రాక్షసత్వం ద్వారా అపస్మారక వయస్సులో చిక్కుకుంటారు. ఇందులో హీరోయిన్ నాన్సీ థాంప్సన్ తన కలలోని హంతకుడిని తప్పించుకోవాలి మరియు ఆమె నిద్రపోవాలని పట్టుబట్టే తల్లితండ్రులు మరియు సంరక్షకులను అధిగమించాలి. ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

Hollywood Horror Movies

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hollywood Horror Movies