Tollywood Top 10 Heroines l టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ 2024

Written by Movie Updates

Updated on:

Tollywood Top 10 Heroines:- తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది హీరోయిన్స్ వచ్చారు, వెళ్లారు. అయితే అందులో కొందరు తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటే మరికొందరు మాత్రం తమ ఆకట్టుకునే అందం అభినయంతో ఎందరో ఫ్యాన్స్ ఆడియన్స్ మనసులో గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుని చెరగని ముద్ర వేశారు. మనం ఇప్పుడు చెప్పుకోబోతోంది అటువంటి టాలీవుడ్ లోని టాప్ 10 హీరోయిన్స్ గురించి

సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) :

తెలుగు సినిమా పరిశ్రమలో సమంత కు ఎంతో క్రేజ్ ఉంది. మొదటి సినిమా ఏ మాయ చేసావే తో ఆమె చిత్ర రంగ ప్రవేశం చేసారు. ఆ మూవీలో ఆమె చేసిన జెస్సి పాత్రకు విశేషమైన క్రేజ్ లభించింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఆ మూవీని గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతో గొప్ప విజయం అందుకున్న సమంత ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు, రాజమౌళి ఈగ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం సినిమాలు చేసి మరొక మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు.

ఇక అక్కడి నుండి అనేకమంది తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన ఆమె హీరోయిన్ గా నటించి ఎన్నో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల శాకుంతలం, యశోద సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాలని అందుకున్నాస్ సమంత ప్రస్తుతం అమెరికన్ సిరీస్ సిటాడెల్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్  (Kajal Aggarwal) :

తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్షి కళ్యాణం మూవీతో ఆమె చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమా హీరోయిన్ గా కాజల్ కు మంచి విజయం అందించింది. ఆ మూవీలో కాజల్ ఆకట్టుకునే అందం, అభినయం ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది.

ఇక ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన మగధీర మూవీతో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్, అనంతరం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోని పలువురు స్టార్స్ తో నటించి అనేక సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇటీవల గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న కాజల్ ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న సత్యభామ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

అనుష్క శెట్టి : (Anushka Shetty) :

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ నటీమణుల్లో అనుష్క శెట్టి కూడా ఒకరు. తొలిసారిగా నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ద్వారా ఆమె ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతరం ఒకటి రెండు సినిమాలు చేసిన అనుష్క కి ఆ తరువాత దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన అరుంధతి మూవీ సూపర్ గా క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఆ మూవీలో అరుంధతిగా అనుష్క నటన అందరినీ ఆకట్టుకోవడంతో పాటు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత ప్రభాస్ తో మిర్చి, బాహుబలి సినిమాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు అనుష్క. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క అతి త్వరలో ఒక మంచి మూవీ చేసేందుకు సిద్దము అవుతున్నారు.

కీర్తి సురేష్ (Keerthy Suresh) :

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న కీర్తి సురేష్ తొలిసారిగా రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో శైలు గా ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆకట్టుకునే అందం, అభినయంతో ఆ పాత్రకు జీవం పోశారు కీర్తి సురేష్.

ఆ తరువాత నాచురల్ స్టార్ నానితో నేను లోకల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట, అలానే పలువురు తమిళ స్టార్స్ తో కూడా సూపర్ హిట్ సినిమాలు చేసి ఎంతో గొప్ప క్రేజ్ అందుకున్నారు కీర్తి సురేష్. ఇక ఇటీవల ఒకింత డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరింత మంచి పేరు అందుకుంటున్న కీర్తి, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

Tollywood Top 10 Heroines

తమన్నా భాటియా (Tamannaah Bhatia) :

తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ హీరోయిన్స్ లో తమన్నా భాటియా కూడా ఒకరు. తొలిసారిగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత శేఖర్ కమ్ముల అంతా కొత్తవారితో అప్పట్లో తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ లో ఒక హీరోయిన్ గా నటించి సూపర్ డూపర్ క్రేజ్ ని హిట్ ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నాగచైతన్య హీరోగా సుకుమార్ తీసిన 100% లవ్ మూవీ కూడా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది.

అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆగడు, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో రెబల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బద్రీనాథ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ వంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ అందుకున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో అవంతిక గా ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న తమన్నా, అటు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ : (Rakul Preet Singh)

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ కథానాయికల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా కెరటం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ హీరోయిన్ గా ఆమెకు విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం గోపిచంద్ తో లౌక్యం, సూపర్ స్టార్ మహేష్ తో స్పైడర్, రామ్ చరణ్ తో ధ్రువ, బ్రూస్ లీ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు.

ఇక ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. నటిగా ఆమెకు ధ్రువ, నాన్నకు ప్రేమతో ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ తో ఆమె చేసిన అయలాన్ మూవీ మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పలు తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

పూజా హెగ్డే (Pooja Hegde) :

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. తొలిసారిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ముకుందా మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ తో పూజా హెగ్డే నటించిన మూవీ మోహేన్జా దారో మూవీ మంచి విజయం అందుకుంది.

ఇక ఆ తరువాత అల్లు అర్జున్ తో డీజే, సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, మరొక్కసారి వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, మరొక్కసారి అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలని చేసి మంచి విజయాలు అందుకున్నారు. ఇక అక్కడి నుండి మరింత మంచి క్రేజ్ తో నటిగా పలువురు ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క ఆదరణతో కొనసాగుతున్నారు పూజా హెగ్డే. ఇటీవల ఆమె విజయ్ సరసన నటించిన బీస్ట్, మెగాస్టార్, రామ్ చరణ్ ల ఆచార్య, హిందీలో వచ్చిన సర్కస్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం పలు తెలుగు, హిందీ, తమిళ ప్రాజక్ట్స్ తో పూజా హెగ్డే బిజీగా ఉన్నారు.

శృతి హాసన్ : )Shruti Haasan)

దిగ్గజ నటుడు కమల్ హాసన్ తనయ అయిన శృతి హాసన్ తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు సిద్దార్థ హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా తెరంగేట్రం చేసారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. అక్కడి నుండి మంచి అవకాశాలు అందుకున్న శృతి, అనంతరం మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ చేసారు.

ఆ తరువాత అల్లు అర్జున్ తో రేసుగుర్రం, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా, ఇక ఇటీవల ప్రభాస్ తో సలార్ మూవీస్ చేసి మంచి విజయాలు అందుకున్నారు శృతి హాసన్. నటిగానే కాక సింగర్ గా సంగీత దర్శకురాలిగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శృతి హాసన్ పలువురు ఫ్యాన్స్ ఆడియన్స్ యొక్క ఆదరణతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు శృతి.

Tollywood Top 10 Heroines

సాయి పల్లవి : (Sai Pallavi) :

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ కథానాయికల్లో సాయి పల్లవి కూడా ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా ద్వారా తొలిసారిగా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం, ఫ్యాన్స్, అభినయంతో ఎంతో గొప్ప క్రేజ్ సొంతంక్ చేసుకున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఫిదా మూవీ మంచి విజయం అందుకుంది.

అనంతరం సూర్య, ధనుష్ ఇలా పలువురు తమిళ స్టార్స్ సరసన కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న సాయి పల్లవి, ఇటీవల గార్గి మూవీ ద్వారా మరొక విజయం అందుకున్నారు. ఇక తాజాగా యువ నటుడు నాగ చైతన్య తో కలిసి చందూ మొండేటి తీస్తున్న తండేల్ మూవీ చేస్తున్నారు సాయి పల్లవి. గతంలో శేఖర్ కమ్ములతో వీరిద్దరూ కలిసి చేసిన లవ్ స్టోరీ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం పలు ఇతర ప్రాజెక్ట్స్ తో కూడా బిజీగా కొనసాగుతున్నారు సాయి పల్లవి.

రష్మిక మందన్న : (Rashmika Mandanna) :

తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా నాగ శౌర్య హీరోగా యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు రష్మిక మందన్న. అంతకముందు కన్నడలో ఆమె నటించిన కుర్రిక్ పార్టీ మూవీ అక్కడ మంచి విజయం అందుకుంది. ఇక తెలుగులో కూడా ఫస్ట్ మూవీ ఛలో తో కూడా విజయం అందుకున్న రష్మిక మందన్న ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ తో ఇండియా వైడ్ సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ తో ఆమె చేసిన సరిలేరు నీకెవ్వరు, ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ తో చేసిన ఆనిమల్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు రష్మిక. ఇక ప్రస్తుతం పలు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు రష్మిక మందన్న.

శ్రీలీల (Sreeleela) :

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ కథానాయికగా ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి ఎంతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో శ్రీలీల ఒకరు. తొలిసారిగా సీనియర్ యాకత్ర్ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

దాని తరువాత మాస్ మహారాజా రవితేజ తో ధమాకా, సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం, రామ్ పోతినేని తో స్కంద సినిమాలు చేసారు శ్రీలీల. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే శ్రీలీలకు ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ, కన్నడ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

Tollywood Top 10 Heroines

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tollywood Top 10 Heroines