Hi Nanna Movie Review :- సమీక్ష : హాయ్ నాన్న – ఆకట్టుకునే లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రామా
విడుదల తేదీ : డిసెంబర్ 7, 2023
Review of Hi Nanna Movie
మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ – 3. 5 / 5
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, జయరాం, నాజర్, అంగద్ బేడీ, ప్రియదర్శి, శృతి హాసన్, బేబీ కియారా ఖన్నా తదితరులు.
దర్శకుడు: శౌర్యువ్
నిర్మాతలు : మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల
సంగీత దర్శకుడు: హేషం అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రాఫర్: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న (Hi Nanna) యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
ఇక కథ పరంగా చూస్తే, విరాజ్ (Nani) అనే ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ తన కూతురితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. అతడికి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అయితే విరాజ్ కూతురు మహి (బేబీ కియారా ఖన్నా) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. నిజానికి వాస్తవానికి ఆమె ఆరోగ్యం పరిస్థితి అసలు బాగోదు, డాక్టర్లు కూడా ఆమె ఎక్కువరోజులు బ్రతికే అవకాశం లేదని చెప్పినప్పటికీ తన కూతురు తనని విడిచి ఎక్కడికీ వెళ్ళదని విరాజ్ బలంగా నమ్ముతాడు. ఇక తనని కన్నా తల్లి ఎవరు అని ఎప్పటినుండో మహి తెలుసుకోవాలని తరచు తండ్రిని అడుగుతూ ఉంటుంది.
కానీ ప్రతిసారి విరాజ్ ఆ విషయాన్ని మాత్రం దాటేస్తూ ఉంటాడు. అసలు ఇంతకీ ఆమె తల్లి ఎవరు, ఎందుకని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. అలానే మధ్యలో యష్న (Mrunal Thakur) విరాజ్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇంతకీ అసలు ఆమె ఎవరు. అనుకోకుండా ఆమె ఎందుకు మహికి విరాజ్ కి దగ్గరవుతుంది. ఆమె గతం ఏమిటి, చివరికి విరాజ్ అతడి భార్యని కలిశాడా లేదా అనేది మొత్తం మనం హాయ్ నాన్న మూవీలో చూడాల్సిందే.
Hi Nanna Movie Review Rating
ప్లస్ పాయింట్స్ :
ఇక ఎప్పటివలె హీరో నాచురల్ స్టార్ నాని తన విరాజ్ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా పలు ఎమోషనల్ సీన్స్ లో నాని యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఇక కూతురు మహితో అతడి అనుబంధం మనల్ని ఎంతో కదిలిస్తుంది. ఇందులో నాని యాక్టింగ్, స్టైల్ తో పాటు డ్యాన్స్ లు కూడా బాగున్నాయి. సాంగ్స్, బీజీఎమ్, ఎమోషనల్ సీన్స్ అయితే ఆడియన్స్ మనసు తాకుతాయి. హేషం అద్బుల్ వాహబ్ ఈ సినిమాకి ఎంతో న్యాయం చేసారు. ఇక హీరోయిన్ మృణాల్ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకునే అందం, అభినయంతో ఎంతో అలరించింది.
వారిద్దరి మధ్య వచ్చే సంఘర్ణణ సన్నివేశాలు కదిలిస్తాయి. ముఖ్యంగా మహి పాత్ర చేసిన బేబీ కియారఖాన్న కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తల్లిని కోల్పోయిన బిడ్డ ఆవేదన, బిడ్డ కోసం, భార్య కోసం తపన పడే భర్త, ఇలా చక్కటి కనెక్టివిటీతో మూవీ ని అందరికీ చేరువ చేసారు దర్శకుడు శౌర్యువ్. ఇక క్లైమాక్స్ సీన్స్ అయితే మరింత బాగుంటాయి. ప్రియదర్శి కామెడీ బాగుంది. అంగద్ బేడీ, జయరాం, నాజర్ కూడా తమ తమ పాత్రల్లో బాగా నటించారు.
Nanna Movie Review in Telugu
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఈమూవీ కోసం దర్శకుడు తీసుకున్న కథ బాగున్నా కూడా కథనం మాత్రం కొంత నెమ్మదిగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్నా, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. తాను తీసుకున్న కథ ప్రకారం పాత్రలని స్క్రీన్ పై బాగానే ఎలివేట్ చేసిన దర్శకుడు శౌర్యువ్, కథనం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. ఇక సినిమాలో చిన్న ట్విస్ట్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ సహా పలు సీన్స్ ఊహించదగినవిగా ఉంటాయి. నిజానికి పాత్రల యొక్క పెర్ఫార్మన్స్ బాగా కుదరడంతో మరింతగా హాయ్ నాన్న మూవీలో తప్పులు మనకు పెద్దగా అనిపించవు.
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా ఈ మూవీ దర్శకుడు శౌర్యువ్ ఎంచుకున్న కథ, దానిని నడిపించిన తీరు బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ మూవీలో ఎమోషన్స్ బాగా పండాయి. పలు సీన్స్ అయితే ఆడియన్స్ మనసుని తాకుతాయి. అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలు ఉన్నప్పటికీ పర్వాలేదని చెప్పవచ్చు. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సూపర్ సాంగ్స్, బీజీఎమ్ అందించారు. కెమెరా మ్యాన్ వర్గీస్ అద్భుతంగా విజువల్స్ ప్రెజెంట్ చేసారు. ఎడిటింగ్ విభాగం బాగానే పని చేసింది. కొన్ని డైలాగ్స్ మనసుని కదిలిస్తాయి. నిర్మాతలైన వైరా ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి.
Hi Nanna Full Movie Review
తీర్పు :
మొత్తంగా చెప్పాలి అంటే మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన హాయ్ నాన్న మూవీ ఆల్మోస్ట్ అన్ని వర్గాల ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. చిన్న ట్విస్ట్ తో ఆకట్టుకునే విధంగా దర్శకుడు కథని తీసుకుని కథనం ముందుకి నడిపాడు. హీరో నాని, హీరోయిన్ మృణాల్, బేబీ కియారా ఖన్నా తమ పాత్రల్లో అద్భుతంగా పెర్ఫర్మ్ చేసారు. హృద్యమైన సాంగ్స్, బీజీఎమ్, గ్రాండియర్ విజువల్స్ ఈమూవీకి ప్లస్ పాయింట్స్. అయితే స్కీఎం ప్లే పరంగా దర్శకుడు మరింతగా జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైతే తప్పకుండా ఓటిటి లో హాయ్ నాన్న మూవీ చూసేయండి మరి.
మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ : 3.5 / 5
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Hi Nanna Movie Review