Hari Hara Veera Mallu Teaser Creating Sensation l సంచలనం రేపుతోన్న హరిహర వీరమల్లు టీజర్ 2024

Written by Movie Updates

Published on:

Hari Hara Veera Mallu Teaser Creating Sensation పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Hari Hara Veera Mallu Teaser Creating Sensation

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి మరొక ప్రత్యేక టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్స్, స్టైల్ అదిరిపోయాయి. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించగా ఇక నుండి ఈ మూవీని మిగతా భాగం మొత్తం ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించనున్నట్లు టీజర్ లో మేకర్స్ తెలిపారు.

Hari Hara Veera Mallu Teaser Creating Sensation

ఇక ఈ హరి హర వీర మల్లు స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 గా రూపొందుతున్న ఈ మూవీకి ధర్మం కోసం యుద్ధం అనేది ఉప శీర్షిక. ఇక ఈ మూవీని 2024 లోనే ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తంగా హరిహర వీర మల్లు టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో కొనసాగుతోంది.

Hari Hara Veera Mallu Teaser Creating Sensation

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment