Reviews of Animal Shocking l ఆనిమల్ షాకింగ్ రివ్యూ 2024

Written by Movie Updates

Updated on:

Reviews of Animal Shocking తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ గా పేరుగాంచిన అందాల నటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, శక్తి కపూర్, త్రిప్తి దిమ్రి, చారు శంకర్, ప్రేమ్ చోప్రా, బబ్లూ పృథ్వీరాజ్, మధురాజా, సురేష్ ఒబెరాయ్ కనిపించారు. 2023 డిసెంబర్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 930 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో పాటు గత ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయిన టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలానే ఈ స్థాయి హిట్ ని రణబీర్ కపూర్ కూడా తొలిసారిగా తన కెరీర్ లో సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా ఈ మూవీలో రణ్విజయ్ సింగ్ పాత్రలో తన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు రణబీర్ కపూర్, అలానే క్లైమాక్స్ లో వచ్చే అజీజ్ పాత్రలో కూడా కొద్దిసేపు ఎంతో వయొలెంట్ గా కనిపించి ఆయన మెప్పించారు. ఇక హీరోయిన్ అయిన గీతాంజలి పాత్రలో రష్మిక మందన్న పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కథ, కథనం ఎంతో ఆకట్టుకుంది. తన తండ్రి పై హత్యాప్రయత్నం చేసిన వారి పై రివెంజ్ తీర్చుకునే కథని బేస్ చేసుకుని ఆనిమల్ మూవీ సాగుతుంది.

reviews on animal kingdom

ముఖ్యంగా గీతాంజలి పాత్రలో రష్మిక మందన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, రొమాంటిక్ పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు రష్మిక. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆమె చేసిన పుష్ప లోని శ్రీవల్లి పాత్ర కూడా బాగున్నప్పటికీ అంతకుమించి పెర్ఫార్మన్స్ కి బాగా స్కోప్ ఉన్న ఆనిమల్ లోని గీతాంజలి పాత్రలో రష్మిక జీవించారు. పలువురు విమర్శకులు సైతం హీరో రణబీర్ కపూర్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న నటన పై ఎన్నో ప్రసంశలు కురిపించారు.

reviews on animal movie

ఇక ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రీతం, జామ్ 8, విశాల్ మిశ్రా, మన్నన్ భరద్వాజ్, భూపిందర్ బబ్బల్, శ్రేయాస్ పురానిక్, జానీ, ఆశిం కేమ్సన్, ఏ ఆర్ రహమాన్, అజయ్ అతుల్, గురిందర్ సీగల్ వంటి వారు అందించిన సాంగ్స్, అమిత్ రాయ్ చిత్రీకరించిన గ్రాండియర్ విజువల్స్ అలరించాయి. ఆద్యంతం ఆనిమల్ మూవీ యువత ని ఫామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని ఎంతో అలరించింది. ఇక మొత్తంగా ఆనిమల్ మూవీ పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకుని బాలీవుడ్ లోని టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఆ విధంగా ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ తో హీరోగా రణబీర్ కపూర్ తో పాటు తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా రేంజ్ తో పాటు మార్కెట్ స్థాయి మరింతగా పెరిగాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఈమూవీలో హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక తో పాటు చెప్పుకోవలసింది రణబీర్ తండ్రి పాత్రలో నటించిన అనిల్ కపూర్ గురించి. అద్భుత నటుడైన అనిల్ కపూర్ మరొక్కసారి తన బల్బీర్ సింగ్ పాత్రలో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆనిమల్ మూవీ టీమ్ లోని ప్రతి ఒక్కరికీ విశేషమైన ఇమేజ్ ని మార్కెట్ ని తెచ్చిపెట్టింది. ఇక మరీ ముఖ్యంగా ఆనిమల్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ లు ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

reviews on animal pak

నిజానికి ఆనిమల్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతో పెద్ద సక్సెస్ సాధించినప్పటికీ పలువురు నుండి విమర్శలను సైతం ఎదుర్కొనక తప్పలేదు. కొందరు పత్రికల్లో ఈ మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేస్తే మరికొందరు అయితే తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. నిజానికి సినిమాని సినిమాలనే చూడాలని అందులో మంచి ఉంటె తీసుకుని చెడుని వదిలేయాలనేది కొందరు ఆడియన్స్ యొక్క అభిప్రాయం. ఇక ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి, ఆ తరువాత దాని బాలీవుడ్ రీమేక్ అయిన కబరీ సింగ్ సినిమాలతో అప్పటికే రెండు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకడు సందీప్ మరొక్కసారి ఆనిమల్ తో తన అద్భుత టాలెంట్ ని నిరూపించుకున్నారు.

reviews on animal

ఈ మూవీలోని పలు సీన్స్ లో ఆయన టేకింగ్ చూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. కథలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా కథనం వేగవంతంగా సాగడంతో ఎక్కడా కూడా మనకి పెద్దగా బోర్ అనిపించదు. మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. ఆనిమల్ రిలీజ్ టైం లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ, తన సినిమా అప్పటికే యాభై సార్లు పైగా చూసుకున్నానని, నిజానికి లెంగ్త్ పరంగా కొద్దిగా ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ మూవీకి పక్కాగా కనెక్ట్ అయి మంచి విజయం అందిస్తారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. మొత్తంగా రిలీజ్ అనంతరం దర్శకుడు పెద్ద విజయం అందుకున్నారు సందీప్ రెడ్డి వంగా.

ఇక ఈ మూవీలోని యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అయితే మరింత ఆకట్టుకుంటాయి. ఆ సీన్స్ విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుని ఆడియన్స్ న్నీ అలరించేలా చిత్రీకరించినట్లు చెప్పారు దర్శకుడు సందీప్. కాగా ఆనిమల్ మూవీ భారీ విజయంతో ఒక్కసారిగా దర్శకుడిగా పెద్ద క్రేజ్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ దీని యొక్క సీక్వెల్ అయిన ఆనిమల్ పార్క్ ని త్వరలో పట్టాలెక్కించనున్నారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని, తప్పకుండా ఆ మూవీ కూడా మరింతగా ఆడియన్స్ ని అలరించేలా ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తన్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సందీప్ తెలిపారు. దాని అనంతరమే ఆనిమల్ పార్క్ ఉంటుందని కూడా ఆయన తెలిపారు.

reviews of animal

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment