Pawan Kalyan Worked with Two Idlis with a Glass of Juice l రెండు ఇడ్లిలు ఒక గ్లాస్ జ్యూస్ తో వర్క్ చేసిన పవన్ కళ్యాణ్ 2024

Written by Movie Updates

Updated on:

Pawan Kalyan Worked with Two Idlis with a Glass of Juice మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా తన సినీ కెరీర్ ని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ద్వారా ఆరంభించారు. సుప్రియ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తెరకెక్కించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు తొలి చిత్రంతో నటుడిగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు పవన్ కళ్యాణ్.

ఆ తరువాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత, అలానే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం సినిమాలు చేసారు పవన్ కళ్యాణ్. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విజయాలు అందుకుని నటుడిగా ఆయనకు బాగానే పేరు తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఆ మూడు సినిమాల్లో నటుడిగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Worked with Two Idlis with a Glass of Juice

అనంతరం కరుణాకరన్ తో ఆయన చేసిన తొలిప్రేమ మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకుని హీరోగా పవన్ కు బాగా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి అందాల నటి కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఆ మూవీకి విద్య సాగర్ సంగీతం అందించగా నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, సంగీత, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి ఆకట్టుకోవడంతో పాటు అందులో పవన్, కీర్తి సురేష్ ల ప్రేమ సన్నివేశాలు అలరించాయి. అలానే ముఖ్యంగా సాంగ్స్ తో పాటు ఆలీ, వేణుమాధవ్ ల కామెడీ కూడా తొలిప్రేమ లో ఎంతో పండింది.

అప్పటికి యువతని ఆకట్టుకునేలా దర్శకుడు కరుణాకరన్ తొలిప్రేమ ని తెరకెక్కించి ఆడియన్స్ నుండి మెప్పు అందుకున్నారు. అనంతరం పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో బాలీవుడ్ అందాల నటి ప్రీతీ జింగ్యానీ హీరోయిన్ గా తెరకెక్కిన తమ్ముడు మూవీ చేశారు పవన్ కళ్యాణ్. రమణగోగుల సంగీతం అందించిన ఈ మూవీలో చంద్రమోహన్, అచ్యుత్, మల్లిఖార్జునరావు తదితరులు కీలక పాత్రలు చేసారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన తమ్ముడు మూవీ మంచి విజయం అందుకుంది.
ఇక ఆ తరువాత పూరి జగన్నాథ్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన బద్రి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ నటి అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్స్ గా నటించిన బద్రి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది.

ఆ తరువాత లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఖుషి మూవీ కూడా విజయవంతం అయింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్ భూమిక ల మధ్యన వచ్చే లవ్ సీన్స్ అప్పట్లో ఎంతో మంచి క్రేజ్ అందుకున్నాయి. ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఖుషి మూవీతో ఏకంగా యువతలో ఎంతో క్రేజ్ అందుకున్నారు పవన్. యువతలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ మూవీతో అప్పట్లో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఖుషిలో రాజన్ పి దేవ్, శివాజీ, ఎస్ జె సూర్య, విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం దానిని గ్రాండ్ లెవెల్లో ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. మొత్తంగా ఖుషి విజయంతో నిర్మాతకు మంచి లాభాలు లభించాయి.

Pawan Kalyan Worked with Two Idlis with a Glass of Juice

దాని తరువాత కొంత గ్యాప్ తీసుకుని తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన మూవీ జానీ. ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించారు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టడంతో ఆయన ఫ్యాన్స్ లో మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎంతగానో అంచనాలు ఏర్పడ్డాయి. రమణ గోగుల సంగీతం అందించిన ఈ మూవీలో ఎం ఎస్ నారాయణ, గీత, రఘువరన్, ఆలీ, బ్రహ్మాజీ, మల్లిఖార్జున రావు తదితరులు కీలక పాత్రలు చేసారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన యువకుడిగా పవన్ నటించిన ఈ మూవీ పై అప్పట్లో మంచి క్రేజ్ ఉంది.

విషయం ఏమిటంటే, ఈ మూవీలో జానీ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఒకింత సన్నగా కనబడడం కోసం ఆయన నిత్యం వ్యాయామం చేస్తూ కేవలం రెండు ఇడ్లిలు మరియు ఒక గ్లాస్ జ్యూస్ మాత్రమే తాగేవారట.అయితే ఆ విధంగా అప్పట్లో ఎంతో కష్టపడి జానీ మూవీ చేసినప్పటికీ అది మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలానే అప్పట్లో ఆ విధంగా కొన్నాళ్ల పాటు పవన్ ఆరోగ్యం సరిగ్గా లేక ఆపైన ఆయనకు అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా చేసారు. ఆ విధంగా జానీ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఆ మూవీకి రమణ గోగుల సంగీతం అందించారు.

అప్పట్లో ఆ మూవీలోని సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. మొత్తంగా జానీ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా పవన్ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పాలి. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్యన వచ్చే లవ్ ఎమోషనల్ సీన్స్ తో పాటు ఫైట్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అప్పటి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం వీరశంకర్ దర్శకత్వంలో చేసిన గుడుంబా శంకర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన పవన్ దానితో పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకోగలిగారు.

Pawan Kalyan Worked with Two Idlis with a Glass of Juice

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment