Kajal Aggarwal Without Makeup l మేకప్ లేకుండా కాజల్ అగర్వాల్ ని ఎప్పుడైనా చూసారా 2024

Written by Movie Updates

Updated on:

Kajal Aggarwal Without Makeup టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ తొలిసారిగా తేజ తెరకెక్కించిన లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చారు. వెర్సటైల్ యాక్టర్ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ యావరేజ్ గా ఆడింది. ఈ మూవీలో తొలిసారిగా హీరోయిన్ గా నటించినప్పటికీ తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని అలరించారు కాజల్. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, కాజల్ మధ్య వచ్చే లవ్, ఎమోషనల్ సీన్స్, తేజ టేకింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ వంటివి అప్పట్లో లక్ష్మి కళ్యాణం లో ఆడియన్స్ ని అలరించాయి.

అనంతరం కృష్ణవంశీ తీసిన చందమామ మూవీ కాజల్ కి బాగా పేరు తీసుకువచ్చింది. నవదీప్, శివ బాలాజీ హీరోలుగా నటించిన ఈ మూవీలో కాజల్ పెర్ఫార్మన్స్ కి బాగా పేరు లభించింది. ఇక ఈ మూవీలో మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో కనిపించగా ఆహుతి ప్రసాద్ మరొక ముఖ్య పాత్ర చేసారు. మొత్తంగా చందమామ మూవీ అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడంతో పాటు హీరోయిన్ గా కాజల్ కు రెండవ మూవీతో మరింత మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఆ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మగధీర మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన కాజల్ అక్కడి నుండి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Kajal Aggarwal Without Makeup

మగధీర మూవీ అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయం అందుకుంది. ఆ మూవీలో రామ్ చరణ్, కాజల్ ఇద్దరూ కూడా డ్యూయల్ రోల్స్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా దూసుకెళ్లిన కాజల్ అగర్వాల్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాబీ తెరకెక్కించిన సర్దార్ గబ్బర్ సింగ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మరొక హీరోయిన్ సమంత కూడా నటించిన బృందావనం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నాయక్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దశరథ్ తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఆర్య 2 మూవీస్ ద్వారా నటిగా మరింత క్రేజ్ అందుకుని ఆనతి కాలంలో టాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లిన కాజల్ అగర్వాల్ కు ఆపైన టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా కాజల్ కు హీరోయిన్ గా బాగా అవకాశాలు వచ్చాయి.

ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కాజల్ బాగా అవకాశాలతో దూసుకెళ్లారు. అక్కడ కూడా మంచి విజయాలు ఆమెకు లభించాయి. అలానే అటు హిందీలో కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు కాజల్ అగర్వాల్. దానితో నార్త్ లో కూడా కాజల్ కు బాగా పేరు లభించింది. బాలీవుడ్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన తలా అజిత్ కుమార్, ఇళయదళపతి విజయ్ లతో పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు కాజల్. ఇక ఎటువంటి పాత్రలో అయినా మొదటి నుండో ఒదిగిపోయి నటించడంతో పాటు తన ఆకట్టుకునే అందంతో తన ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని మెప్పిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు కాజల్ అగర్వాల్.
ఇక ఇటీవల ఒక సంచలన ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు కాజల్.

Kajal Aggarwal Without Makeup

అది తన మేకప్ లేని ఫోటో. అయితే అందం అనేది బాహ్యంగా కాదు అంతరంగా ఉంటుందని, ఎంతగా మన మనసు స్వచంగా అందంగా ఉంటుందో అదే నిజమైన అందం అని ఆ ఫోటో పోస్ట్ చేస్తూ కాజల్ తెలిపారు. అందుకే తాను ఏ మాత్రం భయం జంకు లేకుండా మేకప్ లేని ఫోటోని పోస్ట్ చేసినట్లు తెలిపారు కాజల్. ఆ ఫోటో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మొత్తంగా డేరింగ్ గా కాజల్ పోస్ట్ చేసిన మేకప్ లేని ఫోటో పై అందరూ ప్రసంశలు కురిపించారు. ముఖ్యంగా మొదటి నుండి ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నిటిలో యాక్టివ్ గా ఉంటూ వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు కాజల్. ఆ విధంగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ కలిగిన కాజల్ ఒక్కో మూవీతో హీరోయిన్ గా అందరి నుండి బాగా పేరు అందుకున్నారు.

ఇక ఇటీవల గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న కాజల్, కొన్నాళ్ల క్రితం తనయుడు నీల్ కి జన్మనిచ్చిన కాజల్ తన ఫ్యామిలీ కి కూడా కొంత సమయం కేటాయించి వారితో సరదాగా గడుపుతూ ఉంటారు. అలానే కాజల్ సోదరి ఈషా అగర్వాల్ కూడా పలు సినిమాల్లో నటించి అప్పట్లో మంచి పేరు అందుకున్నారు. అనంతరం వివాహం చేసుకున్న ఈషా కూడా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం కెరీర్ పరంగా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ ల క్రేజీ సీక్వెల్ మూవీ భారతీయుడు 2 లో కూడా నటిస్తున్నారు కాజల్. ఇటీవల సత్యభామ టీజర్ అలానే సాంగ్స్ రిలీజ్ అయి మంచి క్రేజ్ అందుకున్నాయి. ఈ మూవీ అతి త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అలానే జూన్ లో కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ సినిమాలతో పాటు రాబోయే రోజుల్లో నటిగా మరిన్ని విజయాలు అందుకుని కాజల్ అగర్వాల్ గారు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Kajal Aggarwal Without Makeup

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment