Sreeleela Shocking Decision l శ్రీలీల సంచలన నిర్ణయం 2024

Written by Movie Updates

Updated on:

Sreeleela Shocking Decision ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో యువనటిగా మంచి సక్సెస్ లతో క్రేజ్ తో కొనసాగుతున్న యువ కథానాయికల్లో అందాల నటి శ్రీలీల కూడా ఒకరు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకి చెందిన శ్రీలీల తొలిసారిగా కన్నడలో హీరోయిన్ గా అక్కడి చిత్ర పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ చదువుతున్న ఆమె అనుకోకుండా మూవీస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు వచ్చాయి. ఇక తొలిసారిగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందడి మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన శ్రీలీల ఆ మూవీతో సూపర్ హిట్ కొట్టారు.

ఆ మూవీని దర్శక దిగ్గజం కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు. ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పెళ్ళిసంది మూవీ మంచి అంచలనతో రిలీజ్ అయి హిట్ కొట్టింది. ఇక ఆ మూవీలో హీరో రోషన్ తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పించి ఫస్ట్ మూవీతోనే బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. దాని అనంతరం మాస్ మహారాజా రవితేజ తో ఆమె చేసిన ధమాకా మూవీ పెద్ద విజయం అందుకుని నటిగా మంచి బ్రేక్ ని అందించింది.

Sreeleela Shocking Decision

త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మూవీ మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అలానే ఈ మూవీలో మాస్ మహారాజ సరసన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అలరించారు శ్రీలీల. ఆ విధంగా ధమాకా తర్వాత అక్కడి నుండి కెరీర్ పరంగా తనకు లభించిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందుకుని ముందుకు సాగారు శ్రీలీల. ఆ పైన మెగా హీరో యువ నటుడు పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ మూవీలో కూడా నటించారు శ్రీలీల. ఆ మూవీలో కూడా తన అభినయంతో ఫ్యాన్స్ ని అలరించిన శ్రీలీల, అనంతరం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ హీరోగా రూపొందిన మాస్ యాక్షన్ మూవీ స్కందలో నటించారు శ్రీలీల.

ఈ మూవీ భారీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందింది. అయితే అటు ఆదికేశవ, ఇటు స్కంద అసిచ్చిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దానితో శ్రీలీల ఇకపై సినిమాల ఎంపిక విషయమై కొంత జాగ్రత్త వహించారు. ఇక ఇటీవల శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ తో పాటు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా పర్వాలేదనిపించే విజయం అందుకోగా అనంతరం స్టార్ యాక్టర్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి భారీ సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో బాలకృష్ణ కూతురిగా మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించారు శ్రీలీల. ఎమోషనల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అనంతరం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ విధంగా భగవంత్ కేసరితో విజయం అందుకున్నారు శ్రీలీల.

ఇక ఇటీవల ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆమె చేసిన గుంటూరు కారం మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో ఆమె చేసిన అమ్ము పాత్రకు యువత నుండి భారీగా క్రేజ్ లభించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం మూవీలో శ్రీలీల తో పాటు మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటించింది.

Sreeleela Shocking Decision

సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, మురళీశర్మ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక రిలీజ్ రోజున ఒకింత నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ మొత్తంగా అయితే గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ రాబట్టి హీరోయిన్ గా శ్రీలీలకు ఫ్యాన్స్ , ఆడియన్స్ లో మరింత మంచి పేరు తీసుకువచ్చింది.
అయితే విషయం ఏమిటంటే, తాజాగా హీరోయిన్ శ్రీలీల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

దాని ప్రకారం ఇకపై తన సినిమాల సెలక్షన్ విషయంలో ముఖ్యంగా పాత్రల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహించనున్నారట. కథ కథనాలు విన్న తరువాత తన పాత్ర యొక్క ప్రాధాన్యతని బట్టే సినిమాలు ఎంపిక చేసుకోనున్నారట.ఒకరకంగా ఇలా చేయడం వలన మంచి సినిమాలు ఎంచుకోవడంతో పాటు నటిగా శ్రీలీలకు అవి బాగా ఇమేజ్ ని సక్సెస్ ని తెచ్చిపెడతాయని అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో పలు మంచి ప్రాజక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీలీల.

ఇటీవల తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఈ మూవీలో సాక్షి వైద్య కూడా మరొక హీరోయిన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలుఎ ఏర్పరిచాయి. ఇక వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజక్ట్స్ హీరోయిన్ శ్రీలీల చేసేందుకు సిద్డమవుతున్నారు. మరి నటిగా శ్రీలీల రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Sreeleela Shocking Decision

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి