Kurchi Madathapetti Song Sensation l కుర్చీ మడతపెట్టి సాంగ్ సెన్సేషన్ 2024

Written by Movie Updates

Published on:

Kurchi Madathapetti Song Sensation సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీలో మహేష్ బాబు తన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మరొక్కసారి మెప్పించారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ, తండ్రిగా జయరాం కనిపించారు.

Kurchi Madathapetti Song Sensation

సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చిన గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, అజయ్ ఘోష్, సునీల్ కనిపించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా ముఖ్యంగా మాస్ సాంగ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ కి మాస్ తో పాటు యువత నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది.

Kurchi Madathapetti Song Sensation

ఈ మాస్ సాంగ్ లో సూపర్ స్టార్ మహేష్, శ్రీలీల ఇద్దరూ కూడా పోటాపోటీగా వేసిన డాన్స్, అలానే థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా రిలీజ్ అయి నాలుగు నెలలకు పైగా సమయం గడిచినప్పటికీ కూడా కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ముఖ్యంగా ఈ సాంగ్ ప్రస్తుతం లిరికల్ వర్షన్ 128 మిలియన్ అలానే వీడియో వర్షన్ 221 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుని దూసుకెళుతోంది. ఇక మరోవైపు ఈ సాంగ్ కి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియాల్లో విపరీతంగా రీల్స్ వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సాంగ్ ఇంకెంతమేర సెన్సేషన్ స్రుష్టిస్తుందో చూడాలి.

Kurchi Madathapetti Song Sensation

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment