A Movie Starring Mahesh Babu without Even Shoes l షూస్ కూడా లేకుండా మహేష్ నటించిన మూవీ 2024

Written by Movie Updates

Published on:

A Movie Starring Mahesh Babu without Even Shoes టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటించారు.

A Movie Starring Mahesh Babu without Even Shoes

ఇక తన మూవీ కెరీర్ ని హీరోగా రాజకుమారుడు మూవీతో ఆరంభించిన మహేష్ బాబు, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అక్కడి నుండి వరుసగా ఒక్కో సినిమాతో కోట్లాది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న మహేష్, కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన మూవీ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ తో పాటు పలు ప్లాప్స్ కూడా ఉన్నాయి.

విషయం ఏమిటంటే, మహేష్ బాబు కెరీర్ ని ఎంతో పెద్ద మలుపుతిప్పిన మూవీ గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు. అప్పట్లో ఒక్కడు సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ తరువాత తేజ తో ఆయన నిజం అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేసారు. రక్షిత హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మహేష్ బాబు, సీతారాం అనే అమాయకుడు పాత్రలో తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

A Movie Starring Mahesh Babu without Even Shoes

అప్పట్లో ఆయన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ నుండి ఆ పాత్రకు నంది అవార్డు కూడా లభించింది. అయితే ఆ మూవీలో మహేష్ బాబు ఏమాత్రం మేకప్ లేకుండా అలానే కనీసం షూ కూడా లేకుండా నటించారని దర్శకుడు తేజ పలు ఇంటర్వూస్ లో తెలిపారు.

అయితే ఇలాగే ఇలాగే అనే సాంగ్ లో మాత్రం తామందరం కోరిన మేరకు ఆయన షో తో నటించారని, ఇక సినిమా మొత్తం కూడా మహేష్ బాబు ఎంతో సహజంగా నటించారని, ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన మహేష్ అందుకే కెరీర్ పరంగా ఎంతో గొప్ప ఊహకందని క్రేజ్ తో దూసుకెళ్తున్నారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

A Movie Starring Mahesh Babu without Even Shoes

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment