Anushka Shetty Instagram Update l అనుష్క శెట్టి ఇంస్టాగ్రామ్ అప్ డేట్ 2024

Written by Movie Updates

Updated on:

Anushka Shetty Instagram Update టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తొలిసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ మూవీ ద్వారా హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్న ఈ మూవీలో అనుష్క శెట్టి షాషా పాత్రలో తన పెర్ఫార్మన్స్ అందంతో ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హిందీ నటి అయేషా టాకియా హీరోయిన్ గా నటించగా సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గ్రాండ్ గా నిర్మించగా బాలీవుడ్ నటుడు సోను సూద్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు.

Anushka Shetty Instagram Update

ఆ తరువాత సుమంత్ తో కలిసి ఆమె నటించిన మహానంది మూవీ కూడా బాగానే విజయం అందుకుంది. ఈ మూవీలో దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్ర పోషించారు. ఆపై రవితేజ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రలో తెరకెక్కిన బలాదూర్ మూవీలో కూడా నటించారు అనుష్క శెట్టి. ఆ మూవీ కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విజయం అందుకుంది. చంద్ర మోహన్ తో పాటు సై నటుడు ప్రదీప్ రావత్ కూడా ఇందులో ముఖ్య పాత్ర చేసారు. అనంతరం
అక్కడక్కడా పలు సినిమాల్లో నటించిన అనుష్క, అనంతరం ప్రముఖ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అరుంధతిలో నటించారు. అప్పట్లో భారీ విజయం అందుకున్న ఈ మూవీలో తన వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ తో పాటు పేరు కూడా సొంతం చేసుకున్నారు అనుష్క శెట్టి.

ఈ మూవీలో జేజెమ్మగా అనుష్క పెర్ఫార్మన్స్ కి అందరి నుండి ప్రసంశలు కురిసాయి. ముఖ్యంగా పలు యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో అనుష్క శెట్టి నటనకు మంచి పేరు దక్కింది. కోటి సంగీతం అందించిన ఈ మూవీని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మించగా కీలక పాత్రల్లో సోను సూద్, సుభాషిణి, కైకాల సత్యనారాయణ, మనోరమ నటించారు. ముఖ్యంగా అరుంధతి మూవీ అనేక ప్రాంతాల్లో భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత పలు సినిమా అవకాశాలు అనుష్క కు క్యూ కట్టాయి. అక్కడి నుండి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలు అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. ,ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు అయిన సూర్య, విజయ్, రజినీకాంత్ లతో పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి అక్కాడి ఆడియన్స్ యొక్క మెప్పు కూడా అందుకున్నారు అనుష్క శెట్టి. ఇక ఆ తరువాత ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో అదరగొట్టిన అనుష్క శెట్టి ఆ మూవీలో దేవసేన గా మరొక్కసారి తన అద్భుత నటనతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు. ఆ మూవీస్ రెండూ కూడా రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించాయి మనకు తెలిసిందే.

Anushka Shetty Instagram Update

దేవసేన పాత్ర అనుష్క శెట్టి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ని చెప్పకతప్పదు. ఆపైన నిశ్శబ్దం, అలానే భాగమతి మూవీస్ చేసారు అనుష్క శెట్టి. ఆ మూవీస్ రెండూ కూడా బాగానే సక్సెస్ కాగా ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ అయిన భాగమతిలో టైటిల్ రోల్ నటించిన అనుష్క శెట్టి కి బాగా పేరు లభించింది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఆ మూవీని అశోక్ తెరకెక్కించారు. ఇక నిశ్శబ్దం మూవీలో మాధవన్ విలన్ గా నటించగా ఆ మూవీలో అనుష్క శెట్టి మరొక్కసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల యువ నటుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి అనుష్క శెట్టి నటించిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

యువ దర్శకుడు పి. మహేష్ తెరకెక్కించిన ఈ మూవీ కొన్నాళ్ల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో అనుష్క శెట్టి చెఫ్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ విజయం నటిగా అనుష్క కెరీర్ కి మరింత మంచి పేరు తీసుకువచ్చింది. ఆ విధంగా వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్న అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడితో ఘాటీ అనే మూవీ చేస్తున్నారు.వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఈ మూవీలో అనుష్క శెట్టి పాత్ర ఎంతో విభిన్నంగా ఉండడంతో పాటు అదిరిపోతుందని అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ హీరో మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన వేదం మూవీ లో నటించారు అనుష్క. ఆ మూవీలో ఆమె వేశ్య గా కనిపించి అందరినీ తన పెర్ఫార్మన్స్ తో అలరించారు. క్రిష్ తెరకెక్కించిన వేదం మూవీకి విమర్శకుల నుండి కూడా ప్రసంశలు అందాయి.

విషయం ఏమిటంటే, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అకౌంట్స్ కలిగి ఉన్నారు అనుష్క. ఇక ఆమె ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం 7 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలు వాటిలో షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు అనుష్క శెట్టి. ముఖ్యంగా తన ఫ్యామిలీ అలానే తల్లితండ్రులకు సంబందించిన పలు విషయాలు షేర్ చేసుకునే అనుష్క అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా అనుష్క కు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారనే చెప్పాలి.

Anushka Shetty Instagram Update

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment