12th Fail Movie Review in Telugu:- సమీక్ష : 12th ఫెయిల్ (12th Fail) – ఆకట్టుకునే రియల్ ఎమోషనల్ డ్రామా
విడుదల తేదీ : నవంబర్ 3, 2023
మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ – 4 / 5
నటీనటులు: విక్రాంత్ మెస్సి, మేధా శంకర్, అన్షుమన్ పుష్కర్, అనంత్ విజయ్ జోషి, గీత అగర్వాల్, హరీష్ ఖన్నా, సరితా జోషి, వికాస్ దివ్య కీర్తి తదితరులు.
దర్శకుడు: విధు వినోద్ చోప్రా
నిర్మాత : విధు వినోద్ చోప్రా
సంగీత దర్శకుడు: శాంతను మొయిత్రా
సినిమాటోగ్రాఫర్స్ : రంగరాజన్, రామభద్రన్
ఎడిటర్స్: జస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా
ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన రియల్ స్టోరీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ 12th ఫెయిల్. ఈ మూవీలో విక్రాంత్ మెస్సి, మేధా శంకర్ హీరో హీరోయిన్స్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించడంతో పాటు దీనిని నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో దాని యొక్క పూర్తి సమీక్ష లో చూద్దాం.
12th Fail Movie Review in Telugu
కథ :
ఈ మూవీ ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ యొక్క నిజ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన జీవితంలో జరిగిన పలు వాస్తవ ఘటనలను తీసుకుని దీనిని సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఇక ఈ మూవీలో మనోజ్ కుమార్ శర్మ గా (Vikrant Massey) నటించగా ఆయన ఇష్టసఖి శ్రద్ధ గా (Medha Shankar) నటించారు. చంబల్ లో నివసించే పేద కుటుంబంలో జన్మించిన మనోజ్ తండ్రి నిజాయితీగా వ్యవహరించడంతో జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు. అయితే అక్కడి స్కూల్ లో 12th చదువుతున్న మనోజ్ సహా ఇతర విద్యార్థులు అందరూ కూడా ప్రిన్సిపాల్ యొక్క ప్రోద్బలంతో పరీక్షల్లో మాల్ చేస్తారు.
అయితే అదే సమయంలో తన టీమ్ తో కలిసి వచ్చిన డిఎస్పీ దుశ్యంత్ ప్రిన్సిపాల్ ని అరెస్ట్ చేసి జీవితంలో నీతి నిజాయితీ ముఖ్యం అని మనోజ్ కి చెప్తాడు. అయితే దుశ్యంత్ మాటలతో ఎంతో ప్రభావితం అయిన మనోజ్ ఎలాగైనా కష్టపడి నిజాయితీగా చదివి డిఎస్పీ అవ్వలని అనుకుంటాడు. మరి అనంతరం మనోజ్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆపైన అతడు డిఎస్పీ అవ్వడానికి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, అనంతరం అతడు ఐపీఎస్ ఎందుకు అవ్వలనుకుంటాడు, ఇంతకీ తన గోల్ సాదించాడా లేదా అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
నిజానికి 12th ఫెయిల్ మూవీ యొక్క కథ ఎంతో అద్బుతంగా ఉంటుంది. ఇక ఇటువంటి వాస్తవ కథలకు పక్కగా ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాయడం అనేది సులువు కాదు. ఇటువంటి కథలతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే వాటికి పోలిక లేకుండా ఆడియన్స్ ని కథకు, కథనానికి కనెక్ట్ చేయడంలో దర్శకడు విధు వినోద్ చోప్రా పూర్తిగా సఫలం అయ్యారు అని చెప్పాలి. సినిమాలో ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ మనసు తాకుతాయి.
ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ మెస్సి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆ పాత్రకి జీవం పోశారు. పలు కీలక సీన్స్ లో అతడి పెరఫార్మన్స్ కి విశేషమైన స్పందన లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. నిజానికి ఇటువంటి బయోపిక్ లకు ప్రత్యేకంగా రిఫరెన్స్ లు ఉండవు కాబట్టి పాత్రల్లో జీవిస్తేనే అది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో విక్రాంత్ నూటికి నూరు శాతం మార్కులు అందుకుంటారు. ఇక హీరోయిన్ గా అతడి ఇష్టసఖి గా నటించిన మేధా శంకర్ కూడా సూపర్ గా యాక్ట్ చేసారు.
12th Fail Movie Review in Telugu
పలు సీన్స్ లో ఆమె నటన అదరహో అనిపిస్తుంది. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఎంతో బాగా వర్కౌట్ అయింది. నిజ జీవితంలోని జంటలు ఒకరికొకరు తోడు నీడగా ఎలా నిలిచారు అనేది సినిమాలో అద్భుతంగా ప్రెజెంట్ చేసారు. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్, అలానే చివర్లో వచ్చే ఇంటర్వ్యూ సీన్స్ అయితే అత్యద్భుతం అని చెప్పాలి. ఆ విధంగా చివరి సీన్స్ లో కూడా దర్శకుడు ఆడియన్స్ ని ఎంతో కనెక్ట్ చేసారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన అనంత్ విజయ్ జోషి, సరితా జోషి, వికాస్ దివ్యకీర్తి, అన్షుమన్ పుష్కర్ వంటి వారి పాత్రలు కూడా ఎంతో బాగా పండాయి, అందరూ కూడా అద్భుతంగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఇటువంటి వాస్తవిక బయోపిక్స్ లో పెద్దగా లోపాలు వెతకలేం. ఎందుకంటే కథ, కథనం కనుక ఆకట్టుకుంటే ఆడియన్స్ దానికి బాగా కనెక్ట్ అవుతారు. ఇక 12th ఫెయిల్ మూవీ అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ మధ్యలో కథనం పుంజుకుంటుంది. ఈ జానర్ లో పలు సినిమాలు గతంలో వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనేది దాదాపుగా ముందే ఊహించవచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ నార్మల్ గా అనిపిస్తాయి. ఇక లీడ్ పెయిర్ మధ్య వచ్చే చిన్న గొడవ తాలూకు ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేయాల్సింది. ముఖ్యంగా మన వ్యవస్థలో గల నిజాయితీ నిబద్దత గల అధికారుల గురించి నొక్కివక్కాణిస్తుంది కాబట్టి ఎటువంటి కమర్షియల్ అంశాలు ఇందులో మనం ఆశించలేము. ఇక పెద్దగా మైనస్ లు అనేవి ఇందులో లేవు అనే చెప్పాలి.
సాంకేతిక వర్గం :
శాంతను మొయిత్రా కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు పలు చోట్ల బీజీఎమ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు సాహిత్యం బాగుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బాగున్నాయి. అయితే అక్కడక్కడా ఒకటి రెండు సీన్స్ ని ఎడిటింగ్ విభాగం వారు కత్తిరిస్తే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా దర్శకుడు, నిర్మాత అయిన విధు వినోద్ చోప్రా సినిమాని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించారు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీతగా అనిపించినా ఆ సీన్స్ మెల్లగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఇక నటీనటులు అందరూ కూడా అద్భుతంగా పెర్ఫర్మ్ చేయడం మూవీకి పెద్ద ప్లస్.
తీర్పు :
మొత్తంగా చెప్పాలి అంటే 12th ఫెయిల్ మూవీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ టాక్ ని సంపాదించింది. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు ప్రతి ఒక్క పాత్రధారి యొక్క అలరించే నటన నభూతో నభవిష్యతి అని చెప్పాలి. దర్శకుడు, నిర్మాత అయిన విధు వినోద్ చోప్రా ఈ బయోపిక్ మూవీని ప్రతి ఒక్క ఆడియన్ యొక్క మదిని తాకేలా చక్కగా తీశారు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సాగతీతగా అనిపించినా ఎమోషన్స్ మన మదిని తాకుతాయి. సాంగ్స్, డైలాగ్స్, తీసుకున్న పాయింట్, టేకింగ్, మ్యూజిక్, ఎమోషనల్ సన్నివేశాలు, యాక్టర్స్ నటన ఈ మూవీని సూపర్ సక్సెస్ చేశాయి అని చెప్పాలి. మంచి ఇన్స్పిరేషన్ తో కూడిన రియల్ స్టోరీస్ ని ఇష్టపడేవారికి 12th ఫెయిల్ మూవీ ఎంతో బాగా నచ్చుతుంది.
మూవీ అప్ డేట్స్ . ఇన్ రేటింగ్ : 4 / 5
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి