Maa Oori Polimera 2 OTT Release Date Shocking l మా ఊరి పోలిమేర 2 ఓటిటి రిలీజ్ డేట్ 2024

Written by Movie Updates

Published on:

Maa Oori Polimera 2 OTT Release Date:- ఇటీవల రిలీజ్ అవుతున్న పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మంచి ఆసక్తికరమైన కంటెంట్ తో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ మంచి ఆదరణ అందిస్తున్నారు. ఆ విధంగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీ మా ఊరి పొలిమేర (Maa Oori Polimera). అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈమూవీ ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. అనంతరం ఓటిటి ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది.

Maa Oori Polimera 2 OTT Platform

ఇక దానికి సీక్వెల్ గా తాజాగా రిలీజ్ అయిన మూవీ మా ఊరి పొలిమేర 2 (Maa Oori Polimera 2). సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, బాలాదిత్య, రవి వర్మ, బబ్లు పృథ్వీరాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు. ఈ మూవీ నవంబర్ 3, 2023న ఆడియన్స్ ముందుకి వచ్చింది. నిజానికి ఫస్ట్ పార్ట్ లో మించే విధంగా ఈ మూవీని కూడా మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కించారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఈ మూవీని శ్రీ కృష్ణ క్రియేషన్స్ సంస్థ పై గౌర్ కృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా గ్యాని సంగీతాన్ని అలానే కుశేన్దర్ రమేష్ రెడ్డి ఫొటోగ్రఫి అందించారు. తాజాగా ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది మా ఊరి పొలిమేర 2 మూవీ.

Maa Oori Polimera 2 OTT Release Date Netflix

జంగయ్య (Baladitya) తన అన్నయ్య అయిన కొమురయ్య (Satyam Rajesh) కవిత (Ramya) ని చేతబడి చేసి చంపాడని మొదటి భాగం చివర్లో మనకు చూపిస్తారు. అయితే చేతబడి అనంతరం నిప్పుల్లో పది కాలిపోయిందనుకున్న కవిత, అనంతరం ఆమె చేయిపట్టుకుని నిప్పుల్లో పడ్డ కొమురయ్య ఇద్దరూ కూడా బ్రతికి ఉండడం, కేరళ రాష్ట్రంలో ఒక హోటల్ నడుపుకుంటూ ఉండడం మనకు మొదటి భాగం చివర్లో చూపించి ట్విస్ట్ తో ముగించారు. ఇక పొలిమేర 2 కథ అయితే అక్కడి నుండే ప్రారంభం అవుతుంది. జాస్తీపల్లి పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్సై రవీంద్ర నాయక్, కొమురయ్య కేసుని తిరిగి ఓపెన్ చేస్తాడు. అయితే తన అన్నయ్య కొమురయ్యని చేతబడి నెపంతో హత్య చేసారని కోర్ట్ లో కేసు వేసిన జంగయ్య హఠాత్తుగా కేసు వాపసు తీసుకోవడం జరుగుతుంది.

Maa Oori Polimera 2 Movie OTT Release Date

మరి అంత సడన్ గా అతడు కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడు, అనంతరం అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆపైన అతడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏంటనేది ఈ సీక్వెల్ లో చూడవచ్చు. అలానే ఈక్రమంలో అతడికి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాద మూర్తి గుడికి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి (Anantha Padmanabhaswamy Temple) కి, కొమురయ్య చేసే క్షుద్ర పూజలకు లింక్ ఉన్నట్లు కనిపెట్టడం జరుగుతుంది. దానితో పాటు కొమురయ్య తన స్నేహితుడైన బలిజ (Getup Srinu) భార్యని కేరళ తీసుకెళ్లినట్లు గుర్తిస్తాడు. మరి ఇంతకీ కొమురయ్యతో వెళ్లిన కవిత పరిస్థితి ఏమైంది, అసలు అతని వెంట బలిజ భార్య వెళ్ళడానికి కారణం ఏంటి, మరి కొమురయ్య చేసే క్షుద్ర పూజలకు ఊరి పొలిమేర లో ఉన్న గుడికి, అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధం ఏంటి,

Maa Oori Polimera Part 2 OTT Release Date

కొమురయ్య చేతబడి చేసి పలువురు మనుషులను చంపుతున్నాడు అని తెలుసుకున్న అతడి భార్య ఏమి చేసింది, ఇంతకీ తన అన్న జాడ తెలుసుకునేందుకు వెళ్లిన జంగయ్యకు కొమురయ్య జాడ తెలిసిందా లేదా వంటివి అన్ని కూడా మా ఊరి పొలిమేర 2 మూవీలో చూడల్సిందే. నిజానికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంత ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ పొలిమేర 1 కంటే కూడా ఈ మూవీ అంత ఆసక్తిని రేకెత్తించలేదు అనేది కొందరు ఆడియన్స్ యొక్క భావన. మొత్తంగా థియేటర్స్ లో మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ పరంగా మంచి కలెక్షన్ అందుకోవడం తో పాటు ప్రస్తుతం ఓటిటి ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ బాగా వ్యూస్ అందుకుంటోంది.

Maa Oori Polimera 2 OTT App

Maa Oori Polimera 2 OTT Release Date

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Maa Oori Polimera 2 OTT Release Date

1 thought on “Maa Oori Polimera 2 OTT Release Date Shocking l మా ఊరి పోలిమేర 2 ఓటిటి రిలీజ్ డేట్ 2024”

Comments are closed.