Samantha Instagram Update l సమంత ఇన్స్టాగ్రామ్ అప్ డేట్ 2024

Written by Movie Updates

Updated on:

Samantha Instagram టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు తొలిసారిగా నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టారు. ఆమూవీలో జెస్సి పాత్రలో సమంత తన ఆకట్టుకునే అందం, అభియనంతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ మెప్పించారు.
అప్పట్లో మంచి విజయం అందుకున్న తరువాత వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన సమంత కు మంచి అవకాశాలు లభించాయి. ముఖ్యంగా ఏ మాయ చేసావే మూవీలో సమంత తన యాక్టింగ్ తో అప్పటి యువతని అలరించడంతో పాటు అబ్బాయిల మనస్సు దోచారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత మంజుల ఘట్టమనేని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. అప్పట్లో ఏ మాయ చేసావే మూవీలో నాగచైతన్య, సమంత మధ్యలో లవ్ సీన్స్ తో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఎంతో ఆకట్టుకున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ టేకింగ్ కూడా బాగా అలరించాయి.

ఇక అక్కడి నుండి తనకు కెరీర్ పరంగా వచ్చిన అవకాశాలు అన్ని కూడా వినియోగించుకున్న సమంతకు అవి మరింతగా సక్సెస్ లని అందించి ఆమెకు బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం రావడం, రిలీజ్ అనంతరం ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో హీరోయిన్ గా సమంత క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. అలానే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మరొక హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన బృందావనం మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇక ఆ తరువాత నాని హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఈగ లో హీరోయిన్ గా నటించారు సమంత రూత్ ప్రభు.

Samantha Instagram

ఈ మూవీ కూడా బాగ్ విజయం అందుకోవడంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా సమంత గోల్డెన్ లెగ్ భామగా బాగా పేరు సొంతం చేసుకుంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సమంత కు హీరోయిన్ క్రేజ్ ని మరింతగా పెంచాయి అని చెప్పాలి. అనంతరం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకున్నారు సమంత.

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ తీసిన కత్తి, మరొక సూపర్ స్టార్ సూర్య శివకుమార్ హీరోగా లింగు స్వామి తెరకెక్కించిన సికిందర్ మూవీస్ తో అక్కడ కూడా క్రేజ్ అందుకున్నారు సమంత రూత్ ప్రభు. ఇక ఇటీవల మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత రూత్ ప్రభు డాక్టర్ల నుండి చికిత్స తీసుకున్న అనంతరం ఇటీవల మెల్లగా కోలుకున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వెకేషన్ కి వెళ్లి మానసికంగా కూడా తనని తాను బలంగా సిద్ధం అయ్యారు సమంత. కాగా కొన్నేళ్ల క్రితం అక్కినేని వారి మూడవతరం నటుడు మరియు తన తొలి చిత్ర కథానాయకుడు నాగ చైతన్యని వివాహాం చేసుకుని నాలుగేళ్ళ వివాహ బంధం కొనసాగించిన సమంత, అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఆయనకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన ఫ్యామిలీ తో విడిగా జీవిస్తున్నారు.

జీవితం అంటేనే మధ్యలో పలు కష్టాలు వస్తుంటాయని, అయితే వాటిని గుండె ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగితే తప్పకుండా వాటిని అధిగమించి ముందుకు సాగవచ్చని తరచు సమంత అంటుంటారు. ముఖ్యంగా తన లైఫ్ లో కష్ట సమయాలైన మాయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు అలానే చైతన్య నుండి విడాకులు తీసుకున్నపుడు తనకు అన్నివిధాలా అభిమానులతో పాటు కుటుంబసభ్యుల ప్రేమాభిమానులు తోడుగా ఉన్నాయని అందుకునే తాను ఆ పరిస్థితులని ఎదుర్కొని ముందుకు సాగనని, అందుకే తన ఫ్యామిలీ తో పాటు ప్రతి ఒక్క అభిమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సమంత.

Samantha Instagram

విషయం ఏమిటంటే, అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సమంత రూత్ ప్రభు కు అకౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సమంత కు ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో దాదాపుగా 35 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలు దాని ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు సమంత. ఆమె పోస్ట్ లకు ఇన్స్టా లో మంచి క్రేజ్ ఉంది. అలానే ఇన్స్టా తో పాటు పలు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా సమంత రూత్ ప్రభు కు అకౌంట్స్ ఉన్నాయి. అలానే మధ్యలో పలువురు ప్రేక్షకాభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు సమంత రూత్ ప్రభు.

అలానే మరోవైపు తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామజిక సేవా కార్యక్రమాలకు అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటారు సమంత. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం తాను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ నుండి పలువురు చిన్నారులు అమ్మాయిలకు విద్య సంబంధ సహాయం అందిచడంతో పాటు మరికొందరికి గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయించారు. సమంత ఇప్పటికే కూడా ఆమె తన సామజిక సేవని అందిస్తూనే మంచి పేరుతో కొనసాగుతున్నారు. ఆ విధంగా అటు నటిగా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకుని ఎందరో ఆడియన్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తూ కొనసాగుతున్న సమంత ఈ విధంగా పలు మంచి పనులు చేస్తూ విజయాలు అందుకుని మరింత ఆనందం ఆరోగ్యంతో ముందుకు సాగాలని మనందరం కోరుకుందాం.

Samantha Instagram

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment