Animal Post Credit Scene Shocking Update l ఆనిమల్ పోస్ట్ క్రెడిట్ సీన్ షాకింగ్ అప్ డేట్ 2024

Written by Movie Updates

Published on:

Animal Post Credit Scene:- తొలిసారిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీ తీసి పెద్ద విజయం అందుకున్నారు యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆ మూవీ లో షాలిని పాండే హీరోయిన్ గా నటించారు. అంతకముందు పెళ్లిచూపులు మూవీతో సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి మూవీ సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఆయనని టాలీవుడ్ లో ఒక్కారిగా స్టార్ హీరోని చేసింది.

animal post credit scene video

అనంతరం అదే మూవీని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) కియారా అద్వానీ (Kiara Advani) లతో హిందీలో కబీర్ సింగ్ (Kabir Singh) పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా చాలా గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ చేస్తారు అని అప్పట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే అది మాత్రం సెట్ కాలేదు. అనంతరం తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ స్టార్ యాక్టర్ (Ranbir Kapoor) తో అనౌన్స్ చేసారు సందీప్ రెడ్డి వంగ.

ఆ మూవీకి ఆనిమల్ (Animal) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఆనిమల్ మూవీని భారీ రేంజ్ లో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించి డిసెంబర్ 1, 2023లో రిలీజ్ చేసారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఆ మూవీలో బబ్లు పృథ్వీరాజ్, శక్తికపూర్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలని చేసారు. అయితే ముందుగా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఆ తరువాత సాంగ్స్, ఆపైన చివరిగా ట్రైలర్ తో ఒక్కసారిగా అందరిలో విపరీతమైన  ఆనిమల్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

animal post credit scene explained

తండ్రి మీద అమితమైన ప్రేమతో ఆయన కోసం ఎంతకోసం అయితే తెగించి వెళ్లే కొడుకుగా ఆనిమల్ లో రణబీర్ కపూర్ నటన అత్యద్భుతం. అలానే ఆయన ప్రేయసిగా నటించిన రష్మిక మందన్న కూడా అద్భుతంగా నటించారు. ఇక అనిల్ కపూర్, శక్తి కపూర్ సహా సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక రిలీజ్ అనంతరం ఆనిమల్ మూవీ మొత్తంగా రూ. 937 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకోవడం విశేషం.

ఇక ఆ మూవీలో బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలానే రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేసారు. మొత్తంగా ఆనిమల్ అద్భుత విజయం అటు రణబీర్ కపూర్ కి ఇటు సందీప్ రెడ్డి వంగ కు మరింత విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే అక్కడక్కడా కొందరి నుండి ఆనిమల్ మూవీకి విమర్శలు తప్పలేదు.

animal post credit scene video download

ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన యువ అందాల నటి త్రిప్తి దిమ్రి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మనసు దోచింది. ఆమె నటించిన సన్నివేశాలు యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రణబీర్, త్రిప్తి ల రొమాంటిక్ సీన్స్ అయితే యూట్యూబ్ సహా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగస్ సందడి చేసాయి. విషయం ఏమిటంటే, ఆనిమల్ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ లోని రణబీర్ కపూర్ యొక్క రెండవ పాత్ర షాకింగ్ ఎంట్రీ, అలానే అతడి క్రూరమైన ప్రవర్తన, ఆ పాత్రకి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంది.

animal post credit scene actor

ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కి అందరి నుండి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఆనిమల్ కి సీక్వెల్ గా రూపొందనున్న అనిమల్ పార్క్ లో ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటినుండే పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆనిమల్ లో సంగీతం, గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా మూవీ అంత పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

Animal Post Credit Scene

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Animal Post Credit Scene

3 thoughts on “Animal Post Credit Scene Shocking Update l ఆనిమల్ పోస్ట్ క్రెడిట్ సీన్ షాకింగ్ అప్ డేట్ 2024”

Comments are closed.