Hi Nanna OTT Release Date Shocking l హాయ్ నాన్న ఓటిటి రిలీజ్ డేట్ 2024

Written by Movie Updates

Published on:

Hi Nanna OTT Release Date:- నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా హీరోయిన్ గా యువ అందాల భామ మృణాల్ ఠాకూర్ నటించారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచి ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి థియేటర్స్ లో మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంది.

hi nanna movie ott platform release date

ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మోహన్ చేరుకొని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు. ప్రియదర్శి, జయరాం, శృతిహాసన్, నాజర్, అంగద్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించిన హాయ్ నాన్న మూవీ థియేటర్స్ అనంతరం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చి అన్ని భాషల్లో కూడా వారి యొక్క ఆదరణ అందుకుంటూ ప్రస్తుతం బాగా వ్యూస్ తో కొనసాగుతోంది.

new indian releases on ott

ఇక ఈ మూవీలో బేబీ కియారఖన్నా కీలక పాత్ర పోషించింది. తన తండ్రితో కలిసి పెరిగే పాప, పలుమార్లు తల్లి గురించి అతడిని అడగడం, అయితే ఆమె అడిగినప్పుడల్లా మాట దాట వేసే తండ్రి తన గతాన్ని,భార్య విషయాన్ని కూతురికి చెప్పకపోవడం చేస్తుంటాడు. ఆ విధంగా వారి జీవితం కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా పాపకు ఊపిరితిత్తుల వ్యాధి సోకడం, అక్కడి నుండి కథ మరింత ఎమోషనల్ గా సాగడం జరుగుతుంది.

hi nanna ott release date netflix

మరి ఇంతకీ ఆ పాప తల్లి ఎవరు, మధ్యలో వాళ్ళ నాన్నకు తారసపడ్డ యష్న ఎవరు, ఆమె చివరికి ఏమి చేసింది. మరి ఇంతకీ వాళ్ళ అమ్మ జాడ పాపకి తెలిసిందా, అలానే చివరకు పాప ఆరోగ్యం ఏమైంది ఇలాంటివి అన్ని కూడా హాయ్ నాన్న మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఓటిటి ఆడియన్స్ ని సైతం విశేషముగా ఆకట్టుకుంటున్న ఈ మూవీలో విరాజ్ పాత్రలో నాని అద్భుతంగా యాక్ట్ చేయడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ మనసు దోచారు.

hi nanna ott release date time

ఇక యష్న పాత్రలో మృణాల్ కూడా ఎంతో ఆకట్టుకున్నారు. మహి పాత్రలో బేబీ కియారా ఖన్నా పెర్ఫార్మన్స్ కూడా ఎంతో బాగుంది. దర్శకుడు శౌర్యువ్ ఎంచుకున్న పాయింట్, దానిని స్క్రీన్ పై ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీసిన విధానం ఎంతో బాగుంది. హాయ్ నాన్న మూవీ ఫస్ట్ హాఫ్ ఎంతో బాగుంటుంది, అయితే సెకండ్ హాఫ్ మాత్రం మధ్యలో ఒకింత నెమ్మదించినప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ మనసుని తాకుతాయి.

hi nanna ott release date malayalam

అందుకే ఈ మూవీకి తెలుగుతో పాటు ఇతర భాషల ఆడియన్స్ నుండి కూడా ఓటిటిలో బాగా రెస్పాన్స్ లభిస్తోంది. ఇక హాయ్ నాన్న హిందీ వర్షన్ మూవీ ప్రస్తుతం ఇంకా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో  నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. గ్రాండియర్ విజువల్స్, తో పాటు మూవీకి యువ సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ అందించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. మొత్తంగా హాయ్ నాన్న మూవీ అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటిటి లో కూడా అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళుతోంది.

Hi Nanna OTT Release Date

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi Nanna OTT Release Date