Dhee 16 Winner:- తెలుగు టెలివిజన్ తెర పై ఇటీవలతో పోలిస్తే ప్రస్తుతం మంచి కాన్సెప్ట్ కలిగిన షో లకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ ఈటివిలో కొన్నేళ్లుగా ప్రసారం అవుతున్న క్రేజీ డ్యాన్సింగ్ షో ఢీ. ఇక ఎప్పటి నుండి అందరి నుండి మంచి రెస్పాన్స్ తో భారీ క్రేజ్, టిఆర్పి రేటింగ్స్ అందుకుంటూ కొనసాగుతున్న ఈ షో యొక్క ఢీ 16 సీజన్ మరింత ఆసక్తికరంగా ఇటీవల సాగింది.
Etv Dhee 16 Winner
అలానే ముఖ్యంగా ఢీ 16 ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే మరింత ఉత్సాహభరితంగా సాగడంతో పలు టీమ్స్ తమ యొక్క టాలెంట్ ని నిరూపించుకున్నాయి .అయితే ఆ టీమ్స్ లో టైటిల్ విన్నర్ గా హైదరాబాద్ ఉస్తాద్స్ అయిన గ్రీష్మ మాస్టర్ టీమ్ నిలిచింది. మొదటి నుండి ఆమె టీమ్ లోని పలువురు డ్యాన్సర్లు తమ అద్భుతమైన పెరఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక గ్రాండ్ ఫినాలే లో వారు మరింతగా అదరగొట్టి జడ్జిల మనసు దోచి విన్నర్స్ గా నిలిచారు. ఇక ఆ గ్రాండ్ ఫినాలే కి హాయ్ నాన్న ఫేమ్ మృణాల్ ఠాకూర్ తో పాటు నాచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్టులుగా విచ్చేసి డ్యాన్సర్స్ ని మరియు వారి టీమ్స్ లో మంచి జోష్ నింపారు.
Dhee 1 Winner Choreographer
ఇక విన్నర్ గా గ్రీష్మ మాస్టర్ టీమ్ నిలవడంతో ఆమెకు ఫినాలే ప్రైజ్ అనంతరం హీరోగా నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, మొదటి నుండి కష్టాన్ని నమ్ముకుంటే తప్పకుండా లేట్ అయినా విజయం వరిస్తుంది అనడానికి గ్రీష్మ మాస్టర్ అండ్ టీమ్ ఒక ఉదాహరణ అని అన్నారు.
Dhee Juniors 2 Winner
అలానే గ్రీష్మ మాస్టర్ టీమ్ మొదటి నుండి ఎంతో కష్టపడడం తాను విన్నానని, ఇక ఫైనల్ విన్నర్ గా నిలిచిన ఆమెకు రూ. 75 లక్షల ప్రైజ్ మనీ అందించారు. ఇక గ్రీష్మ గురించి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా మాట్లాడుతూ ఫైనల్ విన్నర్ గా గ్రీష్మ టీమ్ నిలవడం ఎంతో ఆనందంగా ఉందని, తనతో ఢీ జోడి చేసాం అని అన్నారు. ఇక ఈ ఫణాలే లో పలు సరదా ప్రశ్నలకు తనదైన స్టైల్ లో నాచురల్ స్టార్ నాని సమాధానాలు ఇచ్చారు.
Etv Dhee 16 Winner 2023 Winner
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ఫినాలే కి శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జిలు గా ఉన్నారు. ఇక రన్నర్స్ గా నిలిచిన సైరా రాయలసీమ టీమ్ డ్యాన్సర్స్ కూడా ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఢీ 16 గ్రాండ్ ఫినాలే షో ఆడియన్స్ ని ఆకట్టుకుని వినోదబరితంగా అలానే పలు హృద్యమైన సీన్స్ తో అలరించింది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2 thoughts on “Dhee 16 Winner Greeshma Master Shocking l ఢీ 16 విన్నర్ గ్రీష్మ మాస్టర్ షాకింగ్ 2024”
Comments are closed.