12th Fail OTT Release Shocking l 12th ఫెయిల్ ఓటిటి రిలీజ్ తెలుగు 2024

Written by Movie Updates

Published on:

12th Fail OTT Release:- తాజాగా తెలుగు తో పాటు పలు చిత్ర పరిశ్రమల్లో మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు తెరకెక్కుతూ దూసుకెళ్తున్నాయి. ఇక తమని ఆకట్టుకుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆయా సినిమాలకు ఆడియన్స్ ఎంతో మంచి ఆదరణ అందిస్తారు అనేది తెలిసిందే. ఇక ఆ విధంగా ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్.

ఈ మూవీ లో విక్రాంత్ మాసే, మేధా శంకర్ హీరో హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో అనంత్ వి జోషి, అన్షుమన్ పుష్కర్, ప్రియన్షు ఛటర్జీ, గీత అగర్వాల్ శర్మ తదితరులు కీలక పాత్రలు చేసారు. ఇక ఈ యాక్షన్, ఎమోషనల్ బయోగ్రఫికల్ సినిమాని విధు వినోద్ చోప్రా తెరకెక్కించి నిర్మించగా శాంతను మొయిత్రా సంగీతాన్ని, రంధరాజన్ రామభద్రన్ ఫోటోగ్రఫి అందించారు.

12th fail ott release date

ముందుగా 27 అక్టోబర్ 2023 న బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చిన 12th ఫెయిల్ మూవీ అందరినీ ఆకట్టుకుని థియేటర్స్ లో సూపర్ గా కలెక్షన్ ని సొంతం చేసుకుంది. చంబల్ అనే ఒక చిన్న కుగ్రామంలో ఇంటర్మీడియట్ విద్యని అభ్యసించే మనోజ్ కుమార్ శర్మ అనే యువకుడు ఒక పోలీస్ అధికారి యొక్క నిజాయితీ నిబద్దతని చూసి తాను కూడా ఐపీఎస్ అవ్వాలని నిర్ణయించుకుని అనంతరం పై చదువులు చదవానికి ఎంతగా కష్టపడ్డాడు, ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో ఈ మూవీని సూపర్ గా తెరకెక్కించారు దర్శకనిర్మాత విధు వినోద్ చోప్రా.

ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ మాసే నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ముఖ్యంగా మనోజ్ కుమార్ శర్మ పాత్రలో అతడు పరకాయ ప్రవేశం చేయడంతో పాటు పలు హృద్యమైన సన్నివేశాల్లో ఆడియన్స్ మనసుని కదిలిస్తాడు. అలానే హీరోయిన్ గా యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర చేసిన మేధా శంకర్ కూడా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఎంతో మెప్పించింది.

12th fail ott release date telugu

ఆద్యంతం సినిమాని చక్కటి కథ, కథనాలతో దర్శకుడు నడిపిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక ఇతర కీలక పాత్రధారులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి సినిమాకి ప్రాణం పోశారు. నిజానికి ఇటువంటి బయోపిక్స్ కి కథ బాగున్నప్పటికీ ఆకట్టుకునే విధంగా కథనం రాయడం అంతా ఈజీ కాదని చెప్పాలి.

12th fail ott release platform

కానీ ఆ విషయంలో ఆడియన్స్ నాది పట్టి వారిని సీట్స్ లో కూర్చోబెట్టి మనసుని కదిలించేలా స్క్రిప్ట్ రాసుకుని కథనం నడిపారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. నిజానికి ఏమాత్రం యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం చక్కటి పాయింట్ తో ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంటూ కొనసాగుతుంది. ఫస్ట్ ఎంతో బాగుండడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని ఏర్పరుస్తుంది.

12th fail ott platform netflix

సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ కూడా మనం మెల్లగా స్టోరీ కి కనెక్ట్ అవుతాం. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ సినిమాకి మరింత ప్రాణం పోశాయి. ఇక ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ భాషలో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన 12th ఫెయిల్ మూవీ అందరినీ ఆకట్టుకుంటూ అక్కడ కూడా విజయవంతంగా వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది.

అసలు మీటర్ ఏమిటంటే, ఈ మూవీని తెలుగు సహా ఇతర భాషల్లో ఎప్పుడు డబ్ చేసి ఓటిటిలో అందుబాటులోకి తీసుకువస్తారు అని పలువు ఆడియన్స్ ఎంతో ఆసక్తికర్మగా ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం అతి త్వరలోనే ఈ మూవీ యొక్క ఇతర భాషల ఓటిటి వర్షన్స్ ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అలానే దానికి సంబంధించి మేకర్స్ నుండి అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట.

12th Fail OTT Release

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12th Fail OTT Release

1 thought on “12th Fail OTT Release Shocking l 12th ఫెయిల్ ఓటిటి రిలీజ్ తెలుగు 2024”

Comments are closed.