Hi Nanna Review Rating Shocking l హాయ్ నాన్న రివ్యూ రేటింగ్ 2024

Written by Movie Updates

Published on:

Hi Nanna Review:- టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో అంగద్ బేడీ, జయరాం, నాజర్, ప్రియదర్శి, శృతి హాసన్ నటించారు.

hi nanna movie review

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మించగా హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో విరాజ్ పాత్రలో నాని కనిపించగా యష్న పాత్రలో మృణాల్ నటించారు. బేబీ కియారా ఖన్నా ఈ మూవీలో మహి పాత్ర చేసింది. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన హాయ్ నాన్న మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొంది మంచి విజయం అందుకుంది.

hi nanna movie review in english

హీరోగా నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది హాయ్ నాన్న. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, తన కూతురితో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఫోటో స్టూడియో నడుపుకుంటూ ఉంటాడు విరాజ్. అయితే అతడి కూతురు మహికి అనుకోకుండా ఊపిరితిత్తుల వ్యాధి సోకడంతో ఒక్కసారిగా అతడు బాధకు గురవవుతాడు. డాక్టర్లు ఆమె బ్రతకడం కష్టం అని చెప్పినప్పటికీ తప్పకుండా మహి మాత్రం తనని వదిలి ఎక్కడికీ వెళ్ళదని భావిస్తుంటాడు.

ఇక తరచు తన తల్లి విషయం చెప్పమని కూతురు మహి తానై అడుగుతుంటే ఆ మాటని దాట వేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు విరాజ్. మధ్యలో అనుకోకుండా విరాజ్ కి ఒక సందర్భంగా యష్నా తారస పడడం, మహిని అలానే విరాజ్ ని ఆమె ఎంతగానో ఇష్టపడడం జరుగుతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరు, అసలు విరాజ్ భార్య ఏమైంది, మరి మహి తన వ్యాధి నుండి కోలుకుందా అనేది మొత్తం కూడా హాయ్ నాన్న మూవీలో చూడాల్సిందే. ముఖ్యంగా ఈ మూవీలో విరాజ్ పాత్రలో నాని అత్యద్భుతంగా నటించారు.

hi nanna review imdb

అలానే హీరోయిన్ మృణాల్ కూడా ఆకట్టుకున్నారు. బేబీ కియారా ఖన్నా కూడా చక్కగా నటించింది. ముఖ్యంగా దర్శకుడు శౌర్యువ్ తీసుకున్న పాయింట్, దానిని కథనం ఆకట్టుకునేలా తెరకెక్కించిన తీరు ఎంతో బాగుంది. కీలక పాత్రల్లో చేసిన జయరాం, అలానే శృతి హాసన్, నాజర్ కూడా బాగా నటించారు. సను వర్గేసే అందించిన ఆకట్టుకునే విజువల్స్ తో పాటు సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

hi nanna movie review in hindi

పలు కీలక సన్నివేశాల్లో హీరో నానితో పాటు బేబీ కియారా కూడా ఎమోషనల్ గా అలరించాయి. హీరోయిన్ మృణాల్ కు మంచి పెర్ఫార్మన్స్ కి తగ్గ పాత్ర లభించింది. ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత నెమ్మదించిందనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కథ, కథనాలు మనల్ని కట్టిపడేస్తాయి. దర్శకుడు సినిమా కథలో కీలక అంశం కోసం తీసుకున్న పాయింట్ బాగుంది.

hi nanna movie review and rating

మొత్తంగా హాయ్ నాన్న మూవీ అందరి మెప్పు అందుకుని బాగా కలెక్షన్ కూడా రాబట్టింది. చక్కగా కుటుంబసమేతంగా ఈ మూవీని మనము చూడవచ్చు. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ హిందీ, తెలుగు తో పాటు పలు ఇతర భాషల్లో కూడా అదరగొడుతూ మంచి వ్యూస్ అందుకుంటూ దూసుకెళుతోంది. తప్పకుండ వీలైతే మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఈ వారం ఈ మూవీని ఓటిటి లో చూసి చక్కగా ఎంజాయ్ చేయండి.

Hi Nanna Review

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hi Nanna Review