Guntur kaaram Review Was Shocking:- సమీక్ష : గుంటూరు కారం – ఆకట్టుకునే మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా
విడుదల తేదీ : జనవరి 12, 2024
123 తెలుగు. కామ్ రేటింగ్ – 4 / 5
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సునీల్, మహేష్ ఆచంట తదితరులు.
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : సూర్యదేవర రాధాకృష్ణ
సంగీత దర్శకుడు: ఎస్ థమన్
సినిమాటోగ్రాఫర్: పీఎస్ వినోద్, మనోజ్ పరమహంస
ఎడిటర్: నవీన్ నూలి.
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీలో యువ అందాల కథానాయికలు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి ఎన్నో అంచనాలతో నేడు రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
చిన్నప్పుడు జరిగిన ఒక ఘటన కారణంగా తల్లి నుండి దూరమైన వెంకటరమణ అనంతరం అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు. అయితే అప్పటి నుండి వెళ్ళిపోయిన తల్లి ప్రస్తావన అతడికి 25 ఏళ్ళ అనంతరం రావడం, ఆపై అతడు తల్లిని కలుసుకోవాలనుకోవడం జరుగుతుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అతడు అస్లు తల్లిని కలుసుకున్నాడా లేదా ? ఇంతకీ అతడిని తల్లి ఎందుకు వదిలేసింది, తండ్రి ఎక్కడ ఉన్నాడు. ఈ మధ్యలో ఆముక్త మాల్యద తో ప్రేమలో పడ్డ వెంటకరమణ జీవితం ఏవిధంగా సాగింది. ఇలా ప్రశ్నలకు సమాధానం కావలి అంటే మాత్రం గుంటూరు కారం మూవీ చూడాల్సిందే.
Guntur kaaram Review Was Shocking
ప్లస్ పాయింట్స్ :
గుంటూరు కారం మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న కథ, కథనాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు మార్వలెస్ మెస్మరైజింగ్ యాక్టింగ్ ప్రధాన బలంగా చెప్పవచ్చు. ఖలేజా, దూకుడు, ఆగడు, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట తరువాత మహేష్ బాబు ఈ మూవీ ద్వారా ఊర మాస్ స్టైల్ లో తన స్వాగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ తో ఎమోషనల్ సీన్స్ లో కూడా అలరించారు. ఇక నటి రమ్యకృష్ణ, నటుడు జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
హీరోయిన్స్ అయిన శ్రీలీల తమ ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించింది. ఇక సాంగ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ ఎంతో బాగుంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కూడా డ్యాన్స్ లో తమ గ్రేస్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. ఇక థమన్ అందించిన సాంగ్స్ తో పాటు మహేష్ బాబు వేసిన మాస్ స్టెప్స్ అదిరిపోయి అందరికీ మరింత కిక్ అందించాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అయితే కొన్ని మనసుని తాకగా మరికొన్ని సరదాగా నవ్విస్తాయి. థమన్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ లో పలు సీన్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ లో అయితే థమన్ సూపర్ గా వర్క్ చేసారు. గుంటూరు కారం మూవీకి విజువల్స్ ఎంతో బాగున్నాయి. ఫోటోగ్రాఫర్ లో పీఎస్ వినోద్, మనోజ్ పరమహంస ఇద్దరూ కూడా విజువల్స్ ని ఎంతో గ్రాండియర్ గా ప్రెజెంట్ చేసారు అనే చెప్పాలి. ఫైట్స్ తో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక్కసారి తనకు తానే సాటి అనేలా ప్రూవ్ చేసారు. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ కి మహేష్ బాబు యాక్టింగ్ తోడైతే పక్కాగా ఇలాం సూపర్ అవుట్ పుట్ వస్తుంది అని అనిపించకమానదు.
Guntur kaaram Review Was Shocking
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఈ మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ లేవనే చెప్పాలి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ కి తోడు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ మూవీలో అదిరిపోయింది. ఇక అక్కడక్క కొద్దిగా చిన్న ల్యాగ్ అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా మూవీని మరింతగా ఆకట్టుకునేలా ముందుకు నడిపారు దర్శకుడు. కథ లో గాని, అలానే కథనం లో గాని పెద్దగా లోపాలు కనపడవు. అయితే ఫస్ట్ హీరోయిన్ గా నటించిన శ్రీలీల పాత్ర బాగున్నా సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి పాత్ర మరింతగా ఉంటె బాగుండేది. ఆమెది మూవీలో చాలా చిన్న పాత్ర.
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా గుంటూరు కారం మూవీని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళ క్రితం, సూపర్ స్టార్ మహేష్ తో ఆయన చేసిన అతడు పెద్ద విజయం అందుకోగా అనంతరం వచ్చిన ఖలేజా పెద్దగా ఆడలేదు. దానితో ఈ మూవీ పై గట్టిగా దృష్టి పెట్టి ప్రతి ఫ్రేమ్, సీన్ అద్భుతంగా తీశారు త్రివిక్రమ్. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, టేకింగ్ అద్బుతముగా ఉన్నాయి. ఎస్ థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ ఐతే మరొక లెవెల్. నవీన్ నూలి ఎడిటింగ్ ఎంతో బాగుంది. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో ఈ మూవీకి ఖర్చు చేయగా ఫోటోగ్రాఫర్స్ పీఎస్ వినోద్, మనోజ్ పరమహంస దానిని అద్భుతంగా స్క్రీన్ పై చూపించి ఆడియన్స్ ని అలరించారు. కొన్ని ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.
తీర్పు :
మొత్తంగా మొదటి నుండి అందరిలో ఎంతో భారీ హైప్ ని ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ గ్రాండ్ గా నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్, స్టైల్, స్వాగ్, త్రివిక్రమ్ మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సీన్స్, ఫైట్స్, గ్రాండియర్ విజువల్స్ వంటివి ఈ మూవీలో అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ని ఈ మూవీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు రిపీట్స్ లో కూడా అలరిస్తుంది. ఓవరాల్ గా ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేసిన గుంటూరు కారం సూపర్ హిట్ గా నిలిచింది.
మూవీ అప్ డేట్స్ రేటింగ్ : 4 / 5
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
1 thought on “Guntur kaaram Review Was Shocking l గుంటూరు కారం షాకింగ్ రివ్యూ 2024”
Comments are closed.