Mahesh Babu New Movie 2024 l మహేష్ బాబు కొత్త సినిమా 2024

Written by Movie Updates

Updated on:

Mahesh Babu New Movie 2024:- మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ కి అందరి నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. అలానే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ తో పాటు హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరి ల ఆకట్టుకునే అందం అభినయం నిర్మాతలైన హారికా హాసిని క్రియేషన్స్ వారి గ్రాండియర్ టేకింగ్ అందరినీ ఆకట్టుకుంది.

ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. భారీ యాక్షన్ తో కూడిన గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గా అత్యధిక వ్యయంతో ఈ మూవీ రూపొందనుండగా మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.

Mahesh Babu New Movie 2024

నిజానికి ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు రాగా, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం దీనిని ఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణం మూవీని అనేక దేశాల్లో చిత్రీకరించనున్నారని, అందుకోసం ఇప్పటికే దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ కొన్ని దేశాల్లో లొకేషన్స్ సెర్చింగ్ కోసం వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారట. అలానే SMMB 29 మూవీ యొక్క స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదని అందుకు మరికొంత సమయం పెట్టె అవకాశం ఉందని అంటున్నారు.

Mahesh Babu New Movie 2024

ఇక ఈ మూవీలో పలువురు హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించనుండగా హీరోయిన్ గా మహేష్ కి జోడీగా ఒక మలేషియన్ నటిని దర్శకుడు రాజమౌళి ఫైనల్ చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళిల తొలి కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ ప్రాజక్ట్ పై అందరిలో ఆసక్తి తారా స్థాయిలో ఉందని చెప్పాలి. మరి ఈ మూవీ పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Mahesh Babu New Movie Shocking Update

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mahesh Babu New Movie 2024