best movie for watch 2024 l చూడటానికి ఉత్తమ చిత్రం

Written by Movie Updates

Updated on:

best movie for watch 2024 తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఏడాది కూడా పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. ఇప్పటికే గడచిన నాలుగు నెలల్లో మొత్తంగా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవ్వగా మరికొన్ని మాత్రం ఫెయిల్ అయ్యాయి. 2024 సంవత్సరం అటు పెద్ద సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలతో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించనుంది. ఇక 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ ప్రశాంత్ వర్మ ల హను మాన్, వెంకటేష్ సైంధవ్, అలానే నాగార్జున నా సామిరంగ మూవీస్ లో హను మాన్ బ్లాక్ బస్టర్ కొట్టగా, సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, నా సామిరంగ సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. అయితే సైంధవ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయం అందుకుంది.

good movie to watch bollywood

ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ ల గుంటూరు కారం మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు ఒకింత నెగటివ్ టాక్ లభించినప్పటికీ కూడా ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ కల్ట్ క్రేజ్ తో గుంటూరు కారం మూవీ భారీ కలెక్షన్ తో దూసుకెళ్లింది. ముఖ్యంగా ఆ మూవీలో మహేష్ బాబు సూపర్ యాక్టింగ్, శ్రీలీల, మీనాక్షి చౌదరి ల ఆకట్టుకునే అందం అభినయంతో పాటు త్రివిక్రమ్ టేకింగ్, థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ పరమహంస విజువల్స్ మొత్తంగా గుంటూరు కారం మూవీని మంచి సక్సెస్ చేసాయి. చాలా ప్రాంతాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం. ఇక సైంధవ్ కూడా బాగానే ఆకట్టుకుంది. యువ దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కించారు. జెర్సీ భామ శ్రద్ధ శ్రీనాథ్ నటించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

best movie to watch amazon prime

వెంకటేష్ కెరీర్ 75వ మూవీగా రిలీజ్ అయిన సైంధవ్ ని వెంకట్ బోయినపల్లి గ్రాండ్ గా నిర్మించారు. దాని తరువాత అదే సంక్రాంతి సమయంలో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాగార్జున, విజయ్ బిన్నీ ల కాంబో మూవీ నా సామిరంగ కూడా బాగానే విజయం అందుకుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కన్నడ నటి ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. వీటితో పాటు చిన్న మూవీగా రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న సినిమా హను మాన్. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా కీలక పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించి నేషనల్ వైడ్ గా హీరో తేజ సజ్జ అలానే దర్శకుడు ప్రశాంత్ వర్మ లకు బాగా క్రేజ్ తీసుకువచ్చింది.

best movie watching websites

మొత్తంగా సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. అనంతరం ఇటీవల వచ్చిన సినిమాల్లో టిల్లు స్క్వేర్, ఓం భీం బుష్ కూడా సక్సెస్ అయ్యాయి. అయితే విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచే విజయం మాత్రమే అందుకున్నాయి. ఇక వీటితో పాటు విశ్వక్సేన్ గామి కూడా యావరేజ్ విజయం అందుకుంది. అయితే ఓం భీం బుష్ తో పాటు టిల్లు స్క్వేర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టాయి. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ అయితే సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెఫుల్ మూవీగా నిలిచింది.

ఈ మూవీలో మరొక్కసారి తన అద్భుతమైన యాక్టింగ్ తో సిద్దము ఆకట్టుకోగా హీరోయిన్స్ నేహా శెట్టి అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకునే అందం అభినయం కూడా టిల్లు స్క్వేర్ మూవీకి మంచి ప్లస్ గా నిలిచాయి. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ మూవీ ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారు. అయితే వీటితో పాటు ఈ ఏడాది భారీగా పలు పాన్ ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ ఆగష్టు 15న, ప్రభాస్ నాగ అశ్విన్ ల కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి మూవీ సెప్టెంబర్ 27న, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీస్తున్న దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా అక్టోబర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

good movie to watch for family

ఇక ఈ సినిమాల పై కూడా ఆడియన్స్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప తో పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తప్పకుండా పుష్ప 2 తో భారీ విజయం అందుకుంటారని, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ ల ఓజి పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా ఏర్పరిచింది . ఇక ప్రభాస్ ఇటీవల సలార్ తో పెద్ద విజయం అందుకున్నారు. దీని అనంతరం ఆయన చేస్తున్న కల్కి 2898 ఏడి మూవీ పై కూడా భారీ అంచనాలు ఉండడంతో పాటు ఇది భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో తప్పకుండా సక్సెస్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అలానే  ఎన్టీఆర్ దేవర తో పాటు నాని నుండి వస్తున్న సరిపోదా శనివారం సినిమాలు కూడా రాబోయే రోజుల్లో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఇవి రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటాయి అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

best movie for watch

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment