Hanuman Movie Collection Worldwide Closing l హనుమాన్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్ 2024

Written by Movie Updates

Updated on:

Hanuman Movie Collection యువ నటుడు తేజ సజ్జ బాలనటుడిగా టాలీవుడ్ లో గతంలో రాజకుమారుడు, యువరాజు, ఇంద్ర వంటి సినిమాలతో పాటు పలు సినిమాల్లో కూడా నటించి అప్పట్లోనే తన అలరించే నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక తొలిసారిగా బివి నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. ఒక కొరియన్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన బేబీ మూవీలో తన నటనతో ఆకట్టుకున్నారు తేజ సజ్జ. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుని నటుడిగా ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఆ యాక్షన్ ఫ్యామిలీ ఫాంటసీ ఎంటర్టైనర్ లో సీనియర్ నటి లక్ష్మి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

hanuman movie boxoffice collection

ఆ తరువాత తొలిసారిగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి మూవీతో కూడా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు తేజ. 2021 లో రిలీజ్ అయిన ఆ యాక్షన్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఆనంది హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో గెటప్ శ్రీను, దక్ష నాగర్కర్, సుమంత్ అశ్విన్, శ్రీదివ్య నటించారు. ఇక ఈ మూవీలో మరొక్కసారి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు తేజ. ఈ మూవీ రిలీజ్ తరువాత మంచి విజయం అందుకుని నటుడిగా ఆయనకు మరింత క్రేజ్ ని పేరుని తీసుకువచ్చింది.

hanuman movie collection worldwide till now

ముఖ్యంగా జాంబీ రెడ్డి మూవీ కాన్సెప్ట్ తో ఇక్కడ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడం, అలానే దానిని మన ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిన యాక్షన్ ఎంటెర్టైన్మెంట్ తో పాటు సమపాళ్లలో యాక్షన్ అంశాలు జోడించి దర్శకుడు ప్రశాంత్ వర్మ చక్కగా తెరకెక్కించి తన ప్రతిభ చాటుకున్నారు. ఇక ఇటీవల ప్రశాంత్ వర్మతోనే మరొక్కసారి చేసిన ఫాంటసి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో కె. నిరంజన్ రెడ్డి నిర్మించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. ఈ పాన్ ఇండియన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పెద్ద విజయం అందుకుని నటుడిగా తేజ కు బాగా క్రేజ్ తీసుకువచ్చింది. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వరలక్ష్మి శరత్ కుమార్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించారు.

hanuman movie collection worldwide

ముఖ్యంగా హను మాన్ మూవీలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసుకున్న కథ, కథనాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రథమార్ధం, అలానే ద్వితీయార్ధం రెండూ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హనుమంతు గా నటించిన తేజ సజ్జ, అంజమ్మగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇక ఎప్పటి మాదిరిగా మరొక్కసారి నెగటివ్ పాత్ర చేసిన వినయ్ రాయ్ కూడా ఆకట్టుకున్నారు. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ ల కామెడీ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, భారీ విజయ్వల్స్, అలరించే గ్రాఫిక్స్ వంటివి హను మాన్ మూవీకి బాగా కలిసి వచ్చిన అంశాలు.

hanuman movie collection till now

ఇక హనుమంతుని కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ పాయింట్ తో కథనాన్ని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ముందుకు నడిపారు. ఇక హను మాన్ మూవీలో చివరి ఇరవై నిముషాలు అయితే ప్రాణం అని చెప్పాలి. ఆ సీన్స్ లో మనకు గూస్ బంప్స్ రావడం ఖాయం అని చెప్పాలి. ముఖ్యంగా హను మాన్ మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్ సహా అన్ని ఏరియాల్లో కూడా అద్భుతంగా ఆడి నిర్మాత, బయ్యర్లకు బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద హను మాన్ బాగా కలెక్షన్ రాబట్టిందని చెప్పాలి. అలానే హను మాన్ మూవీకి అనుదీప్ దేవ్ తో పాటు గౌర హరి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించి అలరించారు.

ముఖ్యంగా ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా బాగా పాపులర్ కాగా పూలమ్మే పిల్ల సాంగ్ అయితే యువత తో పాటు అందరినీ ఆకట్టుకుంది. అలానే హను మాన్ లో పలు కీలక సన్నివేశాల్లో సంగీత దర్శకుడు గౌర హరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పకతప్పదు. అటువంటి సీన్స్ కి థియేటర్స్ లో ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ లభించింది.ఈ మూవీ యొక్క టోటల్ కలెక్షన్ డీటెయిల్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా రూ. 295 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. వీటిలో ఇండియా నుండి రూ. 238 కోట్ల గ్రాస్ ఉండగా ఓవర్సీస్ నుండి రూ. 57 కోట్ల కలెక్షన్ ఉంది.

అలానే దీని ప్రకారం ఇండియాలో మొత్తంగా హను మాన్ మూవీ రూ. 201.6 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు చెప్తునాన్రు ట్రేడ్ పండితులు. కాగా కేవలం రూ. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ మూవీ మొత్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపి దాదాపుగా ఆరు రేట్ల కలెక్షన్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీని అనంతరం ప్రస్తుతం హీరో తేజ సజ్జ, యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో మిరాయ్ అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ కీలక పాత్రలు చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. గ్రాండియర్ గా ఎంతో భారీ స్థాయిలో రూపొందనున్న మిరాయ్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోన్న మిరాయ్ తో తేజ సజ్జ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

hanuman movie collection

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment