Top 10 Hollywood Movie Hindi Dubbed l హిందీ డబ్బింగ్ హాలీవుడ్ మూవీస్ 2024

Written by Movie Updates

Published on:

Hollywood Movie Hindi Dubbed:- ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎక్కువగా చూసేవి హాలీవుడ్ సినిమాలు అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆడియన్స్ అందరిలో కూడా హాలీవుడ్ సినిమాలు చూడాలనే ఉత్సాహం, ఎంతో ఉత్సుకత ఉంటూ ఉంటుంది. ఎన్నో వైవిధ్యమైన కథ, కథనాలు కలిగిన సినిమాలతో పాటు భారీ స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సినిమాలు హోలీవుడ్ లో ఎప్పటికప్పుడు చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి.

ఇక మిగతా అన్ని దేశాల సినిమాలతో పోలిస్తే హాలీవుడ్ సినిమాల యొక్క ఖర్చు ఒకింత ఎక్కువగా ఉండడంతో పాటు ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష కాబట్టి అవి ప్రపంచం అంతటా రిలీజ్ అయి భారీ స్థాయిలో కలెక్షన్ అందుకుంటూ ఉంటాయి. టైటానిక్, అవతార్, మమ్మీ, మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బ్యాండ్ సినిమాలు, ఇండియానా జోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ ని కొల్లగొట్టి ఎన్నో వేల కోట్ల రూపాయల కలెక్షన్ ఆర్జించాయి అని చెప్పాలి.

ఇక జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ సహా అనేకమంది దర్శకులు ఎన్నో గొప్ప చిత్రాలను హాలీవుడ్ లో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల యొక్క మన్ననలు అందుకుంటూ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది హిందీ లో డబ్బింగ్ కాబడ్డ బెస్ట్ హాలీవుడ్ సినిమాల గురించి.  అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ది డార్క్ నైట్ (The Dark Night) :

2008లో విడుదలైన ఈ సినిమా బాట్ మ్యాన్ సిరీస్ లో భాగంగా తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంది. కామిక్ పుస్తకాల ఆధారంగా అత్యున్నతంగా భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో బ్రూస్ వెయిన్ / బ్యాట్ మ్యాన్ గా క్రిషియన్ బేల్ నటించగా ఆల్ఫ్రెడ్ పెన్నా వార్త పాత్రలో మైఖేల్ కెయిన్ నటించారు. ఇక క్రిమినల్ మాస్టర్ మైండ్ కలిగిన జోకర్ పాత్రలో హీత్ లెడ్జెర్ నటించారు. హానెస్ట్ అధికారిగా జేమ్స్ గోర్డాన్ పాత్రలో గ్యారీ ఓల్డ్ మ్యాన్, అలానే హార్వే డెంట్ పాత్రలో ఆరోన్ అకార్ట్, రాచెల్ డేవిస్ గా మాగీ గైలెన్ హాల్ నటించారు.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ సూపర్ హీరో మూవీ 2008 జులై 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. మొత్తంగా ఈ మూవీ యొక్క బడ్జెట్ 185 మిలియన్ డాలర్స్ కాగా ఈ మూవీ 1006 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని కొల్లగొట్టింది. జోకర్ అనే దారుణ మానసిక ప్రవృత్తి గల వ్యక్తి ప్రజల పై దాడి చేసి వినాశనం చేస్తున్న సమయంలో అతడిని ఎదిరించి బ్యాట్ మ్యాన్ ఏవిధంగా పోరాడాడు అనే కథనంతో ది డార్క్ నైట్ మూవీ సాగుతుంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ IMDB లో 9 రేటింగ్ కలిగి ఉంది.

2. ఎక్స్ మెన్ అపాకలిప్స్ (X-Men: Apocalypse) :

హాలీవుడ్ చిత్రాల్లో ఎక్స్ మెన్ సినిమాలకు మొదటి నుండి ఎంతో ఆదరణతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి ఉంది. ఇక 2016 మే 9న రిలీజ్ అయిన ఎక్స్ మెన్ అపాకలిప్స్ మూవీ అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. 1980వ దశకంలో ఎక్స్ మెన్ ప్రపంచానికి విధ్వంశం తీసుకురావడం ద్వారా అభివృద్ధి చెందాలని భావిస్తున్న పురాతన సర్వశక్తిమంతుడైన ఎన్ సబా నూర్ ని ఓడించడం అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.

ఇందులో ప్రొఫెసర్ చార్లెస్ క్జేవియర్ గా జేమ్స్ మేకవోయ్, మాగ్నెటో గా మైఖెల్ ఫాస్ బెండర్, రావెన్ గా జెన్నిఫర్ లారెన్స్, ఎన్ సబ నూర్ గా ఆస్కార్ ఇసాక్, బీస్ట్ గా నికోలస్ హాల్ట్ నటించి తమ పాత్రల ద్వారా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీని తెరకెక్కిచడంతో పాటు స్వయంగా నిర్మించారు దర్శకనిర్మాత అయిన బ్రియాన్ సింగర్. మొత్తంగా ఎక్స్ మెన్ అపాకలిప్స్ మూవీ 178 మిలియన్ డాలర్స్ తో పాటు రూపొంది ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని అలరించి 543.9 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకుంది. అలానే ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ IMDB లో 6.9 రేటింగ్ ని కలిగి ఉంది.

3. 10 థింగ్స్ ఐ హెట్ అబౌట్ యు (10 Things I Hate About You) :

1999 మార్చి 31న గిల్ జుంగర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ టీనేజ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 10 థింగ్స్ ఐ హెట్ అబౌట్ యు మూవీ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. హై స్కూల్ కుర్రాడు కామెరాన్, బియాంకా తో తన సామజిక వ్యతిరేక అక్క వచ్చేవరకు డేటింగ్ చేయలేరు కనుక కామెరాన్ క్యాట్ ను ఆకర్షించడానికి పాట్రిక్ అనే రహస్య కుర్రాడికి చెల్లించడం అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది.

ఇందులో ప్రధాన పాత్ర అయిన కత్రినా గా జూలియా స్టైల్స్, పాట్రిక్ వెరోనా గా హీత్ లెడ్జెర్, కామెరాన్ జేమ్స్ గా జోసెఫ్ గార్డెన్ లెవిట్, బియాంకా స్ట్రాట్ ఫోర్డ్ గా లారీసా ఒలేయ్నిక్, వాల్టర్ స్ట్రాట్ఫర్డ్ గా లారీ మిల్లర్ నటించారు. ఇక అప్పట్లో 13 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అప్పట్లో 60.4 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఒటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ IMDB లో 7.3 రేటింగ్ ని కలిగి ఉంది.

Hollywood Movie Hindi Dubbed

4. 28 డేస్ లేటర్ (28 Days Later)

2002 నవంబర్ 1న తెరకెక్కి ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రిటిష్ హర్రర్ మూవీ 28 డేస్ లేటర్ అందరినీ ఆకట్టుకుని అప్పట్లో మంచి విజయం అందుకుంది. డానీ బోయ్లే తెరకెక్కించిన ఈ మూవీని డి ఎన్ ఏ ఫిలిమ్స్, యుకె ఫిలిం కౌన్సిల్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. ఇక ఇందులో జిమ్ గా సిలియన్ మర్ఫీ, సెలెనా గా నవోమి హారిస్, ఫ్రాంక్ గా బ్రెండన్ గ్లీసెన్, హన్నా గా మేగాన్ బర్న్స్ నటించారు.

యుకె అంతటా ఒక రహస్యమైన అంతంచేయలేని భయంకర వైరస్ వ్యాపించిన నాలుగు వారల తరువాత ప్రాణాలతో బయటపడిన కొంతమంది అభయారణ్యం కోసం ప్రయత్నించడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆసక్తికర కథ, కథాలతో రూపొందింది ఈ మూవీ. ఇక 8 మిలియన్ డాలర్స్ తో రూపొందిన 28 డేస్ లేటర్ మూవీ మోతంగా 84.6 మిలియన్ డాలర్స్ కలెక్షన్ ని కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ IMDB లో 7.5 రేటింగ్ ని కలిగి ఉంది.

5. 300 (Film) :

2006, డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన అమెరికన్ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ మూవీ 300 మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ మూవీని జాక్ సిండర్ తెరకెక్కించారు. ఇందులో లియోనిడాస్ గా గెరార్డ్ బట్లర్, డిలోయిస్ గా డేవిడ్ వెన్హాం, క్వీన్ గార్గో గా లేనా హెడి, ప్లెయిస్తార్కస్ గా గియోవన్నీ కిమ్మోనియా, థెరాన్ గా డొమినిక్ వెస్ట్ నటించి తమ తమ పాత్రల్లో ఆడియన్స్ ని అలరించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన 300 మూవీ 60 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద 456 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది.

స్పార్టా రాజు లియోనిడాస్ మరియు 300 మంది పురుషుల దళం 480 బి. సి. లో థర్మో పైల్ వద్ద పర్షియన్స్ పోరాడే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో యుద్ధ సన్నివేశాలు, భారీ విజువల్స్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ ని అందించాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియన్స్ కి అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ IMDB లో 7.6 రేటింగ్ ని కలిగి ఉంది.

6. 300 రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్ (300: Rise of an Empire)

2014 మార్చి 4 న అమెరికన్ హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ ఫిలిం 300 రైజ్ ఆఫ్ యాన్ ఎంపైర్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సె సాధించింది. ఇక ఈమూవీని నవోమ్ ముర్రో తెరకెక్కించారు. ఈ మూవీలో తెమిస్తోకల్స్ గా సల్లివాన్ స్టాప్లేటాన్, ఆర్టేమిసియా గా ఎవా గ్రీన్, క్వీన్ గార్గో గా లేనా హెడి, కింగ్ క్సర్ క్సస్ గా రోడ్రిగో శాంటోరో నటించి తమ అద్భుత నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.

ఏథెన్స్ యొక్క గ్రీకు జనరల్ తెమిస్టోకిల్స్ మర్త్య మారిన దేవుడు జర్క్సెస్ మరియు పెర్షియన్ నావికా దళానికి ప్రతీకార కమాండర్ అయిన ఆర్తెమిసియా నేతృత్వంలోని పెర్షియన్ దళాల పై దండయాత్రకు వ్యతిరేకంగా నావికా ఆరోపణకు ప్రయత్నించడం అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియో ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. దీనికి IMDB లో 6.2 రేటింగ్ ఉంది.

Hollywood Movie Hindi Dubbed

7. ఏ నైట్ మెర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ (A Nightmare on Elm Street) :

అమెరికన్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ అయిన ఈ మూవీ 1984 నవంబర్ 9 న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఇక ఈ మూవీని వెస్ క్రావెన్ తెరెకెక్కించగా రాబర్ట్ షయే నిర్మించారు. ఈ మూవీలో నాన్సీ థామ్సన్ గా హీథర్ లంజెన్క్యాంప్, ఫ్రెడ్ గా రాబర్ట్ ఎంగ్లండ్, గ్లేన్ లాంజ్ గా జానీ డెప్, మార్గే థామ్సన్ గా రోనీ బ్లాక్ లీ నటించి తమ నటనతో ఆడియన్స్ ని మెప్పించారు.

టీనేజర్ అయిన నాన్సీ థామ్సన్ మరియు ఆమె స్నేహితురాలు కలలలో బ్లేడెడ్ గ్లొవె తో సీరియల్ కిల్లర్ యొక్క ఆత్మకు లక్ష్యంగా మారిన తరువాత ఆమె తల్లితండ్రులు దాచిపెట్టిన చీకటి సత్యాన్ని వెలికితీయాలి, ఐతే అందులో వారు చనిపోతే అది వీరిని నిజ జీవితంలో చంపుతుందనే ఇంట్రెస్టింగ్ కథనంతో రూపొందింది ఏ నైట్ మీరు ఆన్ ఎల్మ్ స్ట్రీట్. ఇక ఈ మూవీ 1.1 మిలియన్ డాలర్స్ బడ్జె తో రూపొంది 57 మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం ఈమూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. అలానే ఈ మూవీకి IMDB లో 7. 4 రేటింగ్ ఉంది.

8.  ఏ నైట్ మెర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ ( A Nightmare on Elm Street 2010 film) :

అమెరికన్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ 2010 ఏప్రిల్ 27న రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీని సామ్యూల్ బెయర్ తెరకెక్కించగా ఇందులో ఫ్రెడ్డీ గా జాకీ ఏర్లే హాలే, క్వేన్టిన్ స్మిత్ గా కైల్ గాల్నర్, నాన్సీ హాల్బ్రూక్ గా రూనీ మారా, క్రిస్ ఫోవెల్స్ గా కాటి క్యాసిడి నటించి తమ నటనతో ఆడియన్స్ ని మెప్పించారు.

వికృతమైన వ్యక్తి యొక్క భీతి తనను హత్య చేసిన తల్లతండ్రుల పిల్లలను వెంటాడుతుంది. వారి కలలలో వారిని వెంబడించి చంపడం అనే ఆసక్తిరక థ్రిల్లింగ్ కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ 35 మిలియన్ డాలర్స్ తో రూపొందగా దీనికి 117.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్ లభించింది. ఇక ఈ మూవీకి IMDB లో 5.2 రేటింగ్ ఉంది.

9. ఏలియన్ (Alien) :

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ ఫిలిం. 1979, మే 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. దీనిని రిడ్లీ స్కాట్ తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో డల్లాస్ గా టామ్ స్కెరిట్, కేన్ గా జాన్ హర్ట్, రిప్లి గా సిగోర్ని వీవర్, లాంబెర్ట్ గా వెరోనికా కాట్ రైట్ నటించారు.

తెలియని మూలం యొక్క రహస్య ప్రసారాన్ని పరిశోధించిన తరువాత వాణిజ్య వ్యోమ నౌక సిబ్బంది ప్రాణాంతకమైన జీవితాన్ని ఏవిధంగా ఎదుర్కొన్నారు అనే ఆసక్తికర కథాంశంతో ఏలియన్ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ 11 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో రూపొందగా దీనికి 184.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్ లభించింది. కాగా ఈ మూవీ IMDB లో 8.5 రేటింగ్ ని కలిగి ఉంది.

10. ఏలియన్స్ (Aliens) :

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ క్యామెరాన్ తెరకెక్కించిన ఏలియన్స్ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందింది. ఈ మూవీ 1986 జులై 18న ఆడియన్స్ ముందుకి మంచి అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఈ మూవీలో ఎలెన్ రిప్లే గా సిగోర్ని వీవర్, డ్వెయిన్ హిక్స్ గా మైఖేల్ బియెన్, కార్టర్ జె బుర్కె గా పాల్ రేయిజర్, బిషప్ గా లాన్స్ హెన్రిక్సన్ నటించి తమ నటనతో ఆడియన్స్ ని అలరించారు.

నోస్ట్రోమో సంఘటన నుండి బయటపడిన దశాబ్దాల తరువాత యెల్లెన్ రిప్లీ ఒక టెర్రాఫార్మింగ్ కాలనీతో సంబంధాన్ని పునస్థాపించుకోవడానికి పంపబడింది. అయితే ఆమె ఏలియన్ క్వీన్ మరియు ఆమె యొక్క సంతానంతో పోరాడతున్నట్లు గుర్తుస్తోంది. ఈ కథాంశంతో ఆకట్టుకునే రీతిన జేమ్స్ క్యామెరాన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఏలియన్స్ మూవీ 18.5 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద 183 మిలియన్ డాలర్స్ వరకు కొల్లగొట్టింది. ఈ మూవీ IMDB లో 8.4 రేటింగ్ ని కలిగి ఉంది.

Hollywood Movie Hindi Dubbed

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hollywood Movie Hindi Dubbed

2 thoughts on “Top 10 Hollywood Movie Hindi Dubbed l హిందీ డబ్బింగ్ హాలీవుడ్ మూవీస్ 2024”

Comments are closed.