Fighter Movie Review Shocking l ఫైటర్ మూవీ రివ్యూ 2024

Written by Movie Updates

Published on:

Fighter Movie Review Shocking:-

సమీక్ష : ఫైటర్ (Fighter ) – అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ డ్రామా మూవీ

విడుదల తేదీ : జనవరి 25, 2024

మూవీ అప్ డేట్స్. ఇన్ రేటింగ్ – 3. 5 / 5

నటీనటులు: ఆదర్శ్, హృతిక్ రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్, రిషబ్ సాహ్ని, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు.

దర్శకుడు: సిద్దార్ధ ఆనంద్

నిర్మాతలు : జ్యోతి దేశ్ పాండే, సిద్దార్థ ఆనంద్, రామన్ చిబ్, అజిత్ అందరే, అంకు పాండే, కెవిన్ వాజ్, మమతా భాటియా

సంగీత దర్శకులు : విశాల్ శేఖర్, సంచిత బల్హారా, అంకిత్ బల్హారా

సినిమాటోగ్రాఫర్: సచ్చిత్ పౌలోస్

ఎడిటర్: ఆరిక్ షేక్

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్, స్టార్ నటి దీపికా పదుకొనె ల తొలి కలయికలో యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఫైటర్. ఈ మూవీ ప్రారంభము నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచింది. వార్ 2 తరువాత సిద్దార్థ, హృతిక్ ల క్రేజీ కాంబినేషన్ లో ఫైటర్ రూపొందింది. మరి నేడు అనగా జనవరి 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ :

కథ ప్రకారం భారత వైమానిక దళం శ్రీనగర్ లో తమ యొక్క బేస్ క్యాంప్ పై శత్రువులు దాడి జరిగే అవకాశం ఉందని బేస్ క్యాంపు ముందుగా పసిగడతారు. కాగా అటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి రాకేష్ జై (Anil Kapoor) తన అండర్ లో గల కొందరు పదునైన తెలివైన సైనికులు అయిన షంషేర్ పటానియా (Hrithik Roshan) అలానే మిన్నీ రాథోర్ (Deepika Padukone) సర్తాజ్ గిల్ (Karan Singh Grover) లతో ఒక పవర్ఫుల్ టీమ్ ని సిద్ధం చేస్తాడు.

కాగా ఒకరోజు ఉగ్రవాద నాయకుడు జైష్ ఈ మహమ్మద్ RPF సోల్జర్స్ పై అమానుషమైన ఘోర దాడి జరుపుతాడు. దానితో భరత్ కి అలానే ఉగ్రవాదులకి మధ్య భీకరమైన పోరాటానికి రంగం సిద్ధం అవుతుంది. అయితే ఈ సమయంలో ప్యాటీ గా పిలవపడే షంషేర్ పటానియా అండ్ టీమ్ ఏవిధంగా ఉగ్రవాదులని ఎదుర్కొంది, అనంతరం ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది మొత్తం కూడా ఫైటర్ మూవీలో చూడాల్సిందే.

Fighter Movie Review Shocking

ప్లస్ పాయింట్స్ :

ఇక ఈ మూవీలో ఎప్పటిమాదిరిగా మరొక్కసారి తన ప్యాటి పాత్రలో నటుడు హృతిక్ రోషన్ అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో మరొక్కసారి తన అద్భుత ప్రదర్శనతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించారు హృతిక్ రోషన్.

ఇక కేవలం అందానికి మాత్రమే కాకుండా అభినయానికి కూడా చోటున్న మంచి పాత్ర చేసారు దీపికా. తన పాత్రలో ఆమె కనబరిచిన అద్భుత నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.

ఇటీవల ఆనిమల్ మూవీ ద్వారా ఆడియన్స్ ని అలరించిన సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ మరొక్కసారి ఫైటర్ లో తన పాత్ర ద్వారా అందరినీ అలరించారు. ఇక దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ తన సినిమాల్లో పెద్దగా కథ లేనప్పటికి ఆకట్టుకునే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ముందుకు తీసుకెళ్తుంటాడు.

అయితే అదే ఫార్మాట్ లో ఫైటర్ కథ కూడా నడుస్తుంది. ముఖ్యంగా హీరో హృతిక్ రోషన్ ని ఆయన స్క్రీన్ పై నెక్స్ట్ లెవెల్లో చూపించారు అనే అనాలి. ఇందులో హై యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ అందిస్తాయి. అలానే దేశానికి సంబందించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి ఎంతో కనెక్ట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్ :

మొదట మనం చెప్పుకున్న విధంగా సిద్దార్ధ ఆనంద్ గత సినిమాల్లో మాదిరిగా ఫైటర్ లో కూడా పెద్దగా కథ ఉండదు, కానీ కథనం మాత్రం యాక్షన్ ఎమోషనల్ గా ముందుకు నడుస్తుంది. పలు యాక్షన్ సీన్స్ అదిరిపోయినప్పటికీ వాటికి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా అనిపించదు.

అలానే కొన్ని సీన్స్ అయితే గతంలో మనం చూసిన పలు దేశభక్తి సినిమాల్లోవిగా అనిపిస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం నడిపిన విధానం బాగున్నప్పటికీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ఇంకా పవర్ఫుల్ గా రాసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ఇక గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నా మరింత బెటర్మెంట్ చేసుంటే బాగుండేది.

Fighter Movie Review Shocking

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా ఈ మూవీలో గ్రాండియర్ విజువల్స్ తో పాటు నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు అందరూ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మూవీ కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుంది. మ్యూజిక్ వర్క్ మాత్రం ఇంకా బెటర్ గా చేసి ఉంటె బాగుండేది.

ముఖ్యంగా యాక్షన్, ఫైట్స్ కోసం యాక్షన్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. అలానే ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ మరొక్కసారి రొటీన్ కథాంశాన్ని తీసుకున్నా తన శక్తిమేరకు ఆడియన్స్ ని హృతిక్ ఫ్యాన్స్ ని అలరించేలా బాగానే తెరకెక్కించారు. పలు ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. అవి ఆడియన్స్ మనసు తాకుతాయి. కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.

తీర్పు :

మొత్తంగా హృతి రోషన్, దీపికా పదుకొనె లతో తొలిసారిగా యువ దర్శకుడు సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన పేట్రియాటిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని అందుకుంది అనే చెప్పాలి. ఇక సినిమాలో స్టోరీ రొటీన్ గా ఉన్నా దర్శకుడు సిద్దార్థ మూవీని ఆసక్తికర యాక్షన్, ఎమోషనల్ అంశాలతో బాగా నడిపించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా కూడా పలు అంశాలు ఆడియన్స్ ని అల్సరిస్తాయి.

అయితే ఇంటర్వెల్ అలానే క్లైమాక్స్ కూడా మరింత పవర్ఫుల్ గా ఉండి ఉంటె ఫైటర్ టాక్ మరొక రేంజ్ లో ఉండేవి. అయితే హృతిక్, దీపికా ల అద్భుత నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్స్ గా చెప్పుకోవచ్చావు. ఇక ఈ వారం హ్యాపీగా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి మీ సమీప థియేటర్స్ లో ఫైటర్ మూవీ హ్యాపీగా చూసేయొచ్చు.

మా movieupdates.in రేటింగ్  – 3. 5 / 5

Fighter Movie Review

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Fighter Movie Review Shocking