Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD l ప్రభాస్ కల్కి 2898 ఏడి గురించి సంచలన న్యూస్ చెప్పిన నాగ అశ్విన్

Written by Movie Updates

Published on:

Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD:- టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి భారీ సక్సెస్ సొంతం చేసుకుంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కల్కి 2898 ఏడి.

ఈ మూవీ పై కూడా అందరిలో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అయిన అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ లోకనాయకుడైన కమల్ హాసన్, బాలీవుడ్ అందాల నటి దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ముంబైలోని ఒక మీడియా మీటింగ్ లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా మాట్లాడారు.

Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD

ఆయన మాట్లాడుతూ, అటు ప్రభాస్ గారు ఇటు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు దీపికా పదుకొనె వంటి వారు కెరీర్ లో ఈ సినిమా ఒక ప్రతిష్టాత్మక సినిమాగా మిగిలిపోతుందని, ముక్యంగా వారందరూ కలిసి ఎంతో హార్డ్ వర్క్ చేసారని అన్నారు. ఇక తమ కల్కి 2898 ఏడి మూవీ కోసం ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ని డిజైన్ చేశామని, స్క్రాప్ నుంచి తీసుకున్న వస్తువులతో ఎంతో గ్రాండ్ లెవెల్ లో కొన్ని నెలలపాటు కష్టపడి ఈ సెట్టింగ్స్ ని వేయడం జరిగిందన్నారు.

Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD

ఆయా నటీనటుల యొక్క కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుందని తెలిపారు నాగ అశ్విన్. ఇప్పటివరకు హాలీవుడ్ లో ఎన్నో ఫ్యూచర్ మూవీస్ వచ్చాయని వాటిలో ఇతర దేశాలు, నగరాల యొక్క ఫ్యూచర్ సిటీస్ ని ప్రెజెంట్ చేయడం జరిగిందని అయితే ఇండియా రాబోయే ఏళ్లలో ఎలా ఉంటుందనేది మా కల్కి 2898 ఏడి మూవీలో చూపించడం జరిగిందని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమా యొక్క థియేటర్ ట్రైలర్ ని రాబోయే మూడు నెలల అనంతరం రిలీజ్ చేసి ఆపైన సినిమాని పలుభాషలో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఓవరాల్ గా కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అత్యంత గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తోంది.

Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD