Actress is Saddened By Missing Animal movie l ఆనిమల్ మూవీ మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్న నటి 2024

Written by Movie Updates

Published on:

Actress is Saddened By Missing Animal movie:- ఇటీవల సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ (Animal) ఆనిమల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో త్రిప్తి దిమ్రి (Tripti Dimri), అనిల్ కపూర్, పృథ్వీరాజ్, బాబీ డియోల్ నటించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఆనిమల్ మూవీ రిలీజ్ అనంతరం ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం.

ఇక ఇప్పటికీ కూడా ఈ మూవీ అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్ అందుకుంటోందని తెలుస్తోంది. తెలుగులో కూడా ఆనిమల్ మూవీ అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీలో తొలుత హీరోయిన్ గా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ని తీసుకోవాలని ఆమెతో కొన్ని సీన్స్ కూడా తీసారట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయితే కారణం తెలియదు కానీ, తనకు మాత్రం ఆనిమల్ లో గీతాంజలి పాత్రకు కావాల్సిన కొన్ని అంశాలు పరిణితీలో కనపడలేదని, అందుకే తనకు విషయం మెల్లగా వివరించినట్లు ఇటీవల ఇంటర్వూస్ లో భాగంగా తెలిపారు దర్శకుడు సందీప్.

Actress is Saddened By Missing Animal movie

అనంతరం పరిణీతి స్థానంలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్ పాత్ర చేయడం జరిగింది. నిజానికి పరిణితి ని తీసివేయడం తనకు కూడా ఇష్టం లేదని, అయితే పాత్రకు ఆమె సెట్ కాకపోవడం వల్లనే అలా చేయవలసి వచ్చిందని, ఆ విషయమై పరిణీతి కూడా ఎంతో బాధపడ్డారని అన్నారు సందీప్. నిజానికి అర్జున్ రెడ్డి రీమేక్ అయిన అర్జున్ రెడ్డి మూవీలో కియారా అద్వానీ స్థానంలోనే తాను పరిణీతి చోప్రాని తీసుకొవాలని భావించానని, అయితే అప్పట్లో కొన్ని కారణాల వలన అది కుదరలేదని ఆయన అన్నారు.

Actress is Saddened By Missing Animal movie

కాగా ఆనిమల్ మూవీ రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో అందులో హీరోయిన్ గా ఛాన్స్ మిస్ అయినందుకు హీరోయిన్ పరిణీతి ఒకింత బాధగా ఫీల్ అవుతున్నారట. అయితే ఒక్కో సందర్భంలో కొన్ని విషయాలు అలా జరుగుతుంటాయని, కొన్ని మనకు ప్రాప్తం ఉంటాయి, మరికొన్ని ఉండవు కాబట్టి అన్నిటినీ సర్దుకుని ముందుకు సాగడమే అంటూ ఆమె ఈ విషయమై తన సన్నిహితులతో చెప్పడం జరిగిందట.

Actress is Saddened By Missing Animal movie

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Actress is Saddened By Missing Animal movie