Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit l ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా డేరింగ్ స్టెప్ 2023

Written by Movie Updates

Published on:

Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit:- పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ ఇప్పటికే థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ ని అలానే సూపర్ కలెక్షన్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు. మరోవైపు ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ఆనిమల్ మూవీ తీసి సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకున్నారు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

ఈ మూవీ కూడా పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే ఆయన తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలింస్ సంస్థలు కలిసి ఈ మూవీని సంయుక్తంగా భారీ వ్యయంతో నిర్మించనున్నాయి. ఇక ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఈ మూవీ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక డేరింగ్ స్టెప్ తీసుకోనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్.

Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit

ఇప్పటివరకు తన సినిమాల్లో ఒకింత బోల్డ్ సీన్స్ తో పాటు వయొలెంట్ సీన్స్ ని కూడా కథ యొక్క పరిధి మేరకు చూపించారు డైరెక్టర్ సందీప్. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం స్పిరిట్ మూవీలో హీరో ప్రభాస్ పాత్రని ఎంతో పవర్ఫుల్ గా సిద్ధం చేస్తున్నారట. ఒకరకంగా ఇటువంటి పవర్ఫుల్ పాత్ర ఇంతవరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాలేదని చెప్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పోలీస్ పాత్ర ఎంతో వయొలెంట్ గా ఉండడంతో పాటు డిఫరెంట్ స్టైల్, మ్యానరిజంతో సాగుతుందని, అందుకోసం ఎంతో జాగ్రత్తగా కథ, కథనాలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు.

Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit

ఒకరకంగా ఇది దర్శకుడు సందీప్ రెడ్డి వేస్తున్న డేరింగ్ స్టెప్ అని టాక్. ఇక ఈ మూవీలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేయనుండగా మూవీ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కూడా అవనుందట. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలా అద్భుతంగా స్పిరిట్ స్క్రిప్ట్ సిద్ధం అవుతోందట. మరి ఆనిమల్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్, రానున్న స్పిరిట్ మూవీతో ఇంకెంతటి భారీ సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలని అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మొత్తంగా అయితే సలార్ హిట్ తో ప్రభాస్ ఆనిమల్ హిట్ తో సందీప్ రెడ్డి వంగా కలిసి చేస్తున్న స్పిరిట్ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు అయితే ఉన్నాయి. 2024 జులై నుండి ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ చేసి, మూవీని సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి స్వయంగా తాజాగా ఇంటర్వ్యూ లో భాగముగా మాట్లాడుతూ చెప్పారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit

3 thoughts on “Sandeep Reddy Vanga Daring Step For Prabhas Spirit l ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా డేరింగ్ స్టెప్ 2023”

  1. You have made some good points there. I checked on the net
    to find out more about the issue and found most individuals will go along
    with your views on this web site.

Comments are closed.